Tuesday, August 26, 2014

BSNL లో ఉద్యోగాలు

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ జూనియర్ టెలికం ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
1. జూనియర్ టెలికం ఆఫీసర్
దరఖాస్తు : అభ్యర్థులు దరఖాస్తులను నుంచి డౌన్‌లోడ్ చేయాలి.
చివరి తేదీ : 5. 9. 2014
మరిన్నివివరాలకు:
www.haryana.bsnl.co.in/hrybsnl/JTO_SRD.pdf

Friday, August 22, 2014

ప్లాస్టిక్ నోట్లు వచ్చేస్తున్నాయి......ప్లాస్టిక్ నోట్లు వచ్చేస్తున్నాయి.......

ప్లాస్లిక్ నోట్లు వచ్చేస్తున్నాయని, వంద కోట్ల నోట్లకు సంబంధించి టెండరు బిడ్లు వచ్చాయని , ముందుగా ఐదు నగరాల్లో ప్రయోగాత్మకంగా వీటిని ప్రవేశపెడతామని రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. ప్లాస్టిక్ నోట్ల మీద ఎలాంటి మరకలు పడవు, తొందరగా చిరిగిపోవు. ఇప్పటికే పలు దేశాల్లో పాలిమర్ కరెన్సీ నోట్లను ఉపయోగిస్తున్నారు. ఇవి ఇప్పుడున్న నోట్ల కంటే ఖరీదైనవే అయినా.. జీవితకాలం ఎక్కువ కావడంతో వీటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. విభిన్న వాతావరణ పరిస్థితులు ఉండే కొచ్చి, మైసూర్, జైపూర్, భువనేశ్వర్, సిమ్లా నగరాల్లో ముందుగా ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెడతారు. ముందుగా తక్కువ డినామినేషన్ ఉన్న నోట్లను తేవాలని యోచిస్తున్నారు.

Tuesday, August 19, 2014

బాహుబలి’ చిత్రం విడుదలకు ముందే రికార్డులు ‘రోబో’ ను దాటుతున్న’బాహుబలి’…!

రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘బాహుబలి’ చిత్రం విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. దక్షిణాదిలో ప్రఖ్యాత దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘రోబో’ చిత్రాన్ని తలదన్నడం ఖాయమని సినీవర్గాలు భావిస్తున్నాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న బాహుబలి సినిమా నిర్మాణదశలోనే భారీ బిజినెస్ చేస్తోందని వినవస్తోంది. ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాలకు జరిగిన బిజినెస్ 79 కోట్ల రూపాయలు దాటిపోయిందని సమాచారం. ఇంకా మరికొన్ని ఏరియాల హక్కులు అమ్ముడు కావాలసి ఉంది. అన్ని కలిపితే ఒక్క థియేటర్ హక్కులే 105 కోట్ల రూపాయల వరకు వస్తాయని అంచనా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి బాహుబలి చిత్రానికి రైట్స్ రూపంలో 77 కోట్ల రూపాయలలు వచ్చినట్లు అంచనా. కర్నాటక నుంచి 9 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ మరో 9 కోట్ల రూపాయలు వసూలు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
ఇవేకాకుండా, శాలిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ రూపంలో మరో 10 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు తమిళం, హిందీ భాషల థియేటర్రైట్స్ బిజినెస్ జరుగాల్సి ఉంది. వీటి ద్వారా 30 నుంచి 40 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరుగుతుందని అంచనా. దీంతో పాటు ఇతర భాషల్లోనూ సినిమా విడుదలవుతోంది. అన్ని కలిపితే ‘బాహుబలి’ విడుదలకు ముందు బిజినెస్ ‘రోబో’ బిజినెస్ క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
తెలుగు ప్రేక్షకులతోపాటు తమిళ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేసే అవకాశం ఉంది