Saturday, June 28, 2014

టెలికాం సంస్థల ఆఫర్లు+ఛార్జీల పెంపు


ఛార్జీల పెంపులో పోటీపడుతున్న టెలికాం సంస్థలు ఇప్పుడు కనెక్షన్లు పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నాయి. తమ నెట్ వర్క్ పరిధిలో చేసుకునే కాల్స్,ఎస్ ఎంఎస్ లకు తక్కువ టారిఫ్ తోను,అపరిమిత సంఖ్యలోను అనుమతిసున్నాయి. తక్కువ ఖర్చుతో మాట్లాడుకునేందుకు ప్రస్తుత కనెక్షన్ దారులు,తమ సన్నిహితులు మరికొందరికి అవే నెట్ వర్క్ కనెక్షన్లు ఇప్పిస్తున్నారు. కొత్తగా కనెక్షన్లు తీసుకునే వారినీ ఈ ఆఫర్లు ఆకర్షిస్తున్నాయి. గతంలో ఎయిర్ టెల్ ఖాతాదారు ఐడియా కనెక్షన్ కు కాల్ చేస్తే,అతనికి అమల్లో ఉన్న టారిఫ్ ప్రకారం ఛార్జీ పడేది. ఎయిర్ టెల్ సంస్థ,ఐడియాకు నిమిషానికి 20పైసలు చెల్లించాల్సి వస్తోంది. అదే సొంత నెట్ వర్క్ పరిధిలో అయితే ఇలా ఆదాయం పంచాల్సిన పనిలేదు. ఇందుకోసమే సంస్థలు కొత్త పద్ధతికి తెరతీశాయి.

No comments:

Post a Comment