ఇకమీదట నెట్ లేకుండానే ఫేస్‌బుక్ ఓపెన్ చేసుకోవచ్చు.ఈ అవకాశాన్ని వినియోగదారులకు బీఎస్ఎన్‌ఎల్ కల్పిస్తోంది. అన్‌స్ర్టక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా ద్వారా ఫేస్‌బుక్ సేవలను అందించేందుకు యూ2 ఓపియా మొబైల్‌తో ఈ మేరకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అన్నిరకాల హ్యాండ్ సెట్లలోనూ ఈ సేవను పొందవచ్చు. ప్రస్తుతానికి కొన్ని జోన్లకు పరిమతమైన ఈ సేవలను త్వరలో దేశవ్యాప్తంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే మూడురోజుల ఈ ప్లాన్ వినియోగించుకుంటే రూ. 4, వారం,నెలవారీకి రూ. 10, 20లను చెల్లించాల్సివుంది.
No comments:
Post a Comment