Tuesday, November 4, 2014

ధ్యానంతో రొమ్ము క్యాన్సర్ బాధితులకు లబ్ధి.....



కెనడాలోని కాల్గరీ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు రొమ్ము క్యాన్సర్ బారిన పడి కోలుకుంటున్న వారికి ధ్యానంతో మంచి ఫలితాలు లభిస్తాయని తెలిపారు. 88మంది రొమ్ము క్యాన్సర్ బాధితులపై అధ్యయనం చేశారు. వీరి సగటు వయసు 55ఏళ్లు. వీరికి వారానికి గంటన్నర చొప్పున 8వారాల పాటు ధ్యానం, హఠయోగాలో శిక్షణ ఇచ్చారు. ఈ పరిశోధనలో క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేసే వారిలో ‘టెలోమీర్’ల పొడవు తగ్గిపోవటం లేదని వీరు గుర్తించారు. క్రోమోజోముల చివరన ఉండే ప్రొటీన్ సమ్మేళనాలనే టెలోమీర్లు అంటారు. ఇవి పొట్టిగా ఉండటం అన్నది పలు వ్యాధులకు సంకేతమని, పొడవుగా ఉంటే ఆరోగ్యానికి చిహ్నమని భావిస్తున్నారు. అంతే కాకుండా ఓ వైపు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూనే వీరందరికీ ఎప్పటికప్పుడు రక్తపరీక్షలు నిర్వహించారు. దీని ద్వారా వారి ఆరోగ్యపరిస్థతి మెరుగైందని వెల్లడైంది

No comments:

Post a Comment