Tuesday, November 4, 2014

ఏపీ విద్యార్థికి ఒబామా ఆహ్వానం....


అమెరికా అధ్యక్షుడు ఒబామా నుంచి ఏపీకి చెందిన విద్యార్థికి ఆహ్వానం పంపించారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన ‘నేషనల్ బ్రాడ్ కామ్ మాస్టర్స్ సైన్స్ కాంపిటేషన్స్’లో తెలుగు విద్యార్థి రాజీవ్ మొవ్వ సత్తాచాటాడు. కాలిఫోర్నియాలోని హార్కర్ స్కూల్ తొమ్మిదో తరగత చదువుతున్న ఇతడు లెక్కల్లో మొదటి ర్యాంకు సాధించాడు. దీంతో ఒబామా ఇతన్ని ఇతర విభాగాల విజేతలతో పాటు శ్వేత సౌధానికి  ఆహ్వానించి అభినందించారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా,గుంటూరు జిల్లాలకు చెందిన తండ్రి డాక్టర్ ఆంజనేయప్రసాద్ మొవ్వ, తల్లి శ్రీలక్ష్మిలీల శాన్ జోస్ లో ఉంటున్నారు. ఆంజనేయప్రసాద్ కైసర్ గ్రూఫ్ ఆఫ్ హాస్పిటల్స్ పెయిన్ మేనేజ్ మెంట్ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్నారు. లీల ఇంటెల్ లో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్నారు

No comments:

Post a Comment