Thursday, March 26, 2015

శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవం




శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవం కు ఏర్పాట్లు పూర్తి 


శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే |

సహస్రనామ తత్యుల్యం రామనామవరాననే ||


 రెబ్బెన : మార్చి 15(వుదయం ప్రతినిధి) ఈ నెల 28న జరిగే  శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవం  గనంగా జరపుటకు ఆలయ కమటి భారి ఏర్పాట్లు చేస్తుంది అని ఇటివల ఏర్పడిన నూతన ఆలయ కమిటి అధ్యక్షులు ఎల్.గంటుమేర గారు తెలిపారు, ఆలయానికి శాస్వత చందాదారులను ఏర్పాటు చేసుకొని ధూప దీప నైవేద్యాలను ప్రతి రోజు జరుపుటకు నిర్ణయించినది, ఈ  నెల 28 న జరిగే స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి మండలం లోని భక్తులు బారీగా తరలివచ్చే ఆవకాశం ఉన్నట్టు, వచ్చే భక్తుల కోసం అన్నదాన   కార్యక్రమం తదితర ఏర్పాట్లు చేస్తునట్టు ఆలయ ప్రధాన కార్యదర్శి శ్రీ మోడెం సుధర్శన గౌడ్ గారు తెలిపారు.


   

Monday, March 16, 2015

శ్రీలంక క్రికెట్టీం కు మేలుకువులు నేర్పిన అ దేశ ప్రాదని


వన్డే వరల్డ్ కప్ క్రికెట్ లో లీగ్ దశ ముగిసి నాకౌట్ కు చేరుకుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆడే దేశాల అభిమానులు, దేశాదినేతలు తమ దేశజట్టు బాగా ఆడి విజయం సాధించాలని కోరుకుంటున్నారు . అయితే అందుకు విరుద్ధంగా శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే మాత్రం లంక క్రికెటర్లకు హెచ్చరికలు జారీచేశారు.
మార్చి 18వ తేదీన తొలి క్వార్టర్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో శ్రీలంక తలపడనుంది. ఆ రోజు జరిగే మ్యాచ్ పై దృష్టి పెట్టాలని విక్రమ్ సింఘే హెచ్చరిక చేశారు. ముఖ్యంగా భీకరమైన ఫామ్ లో ఉన్న దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ఎంత తొందరగా పెవిలియన్ కు పంపిస్తే అంతమంచిది అని హెచ్చరించాడు. అతనిపై శ్రీలంక ఆటగాళ్ల దృష్టి పెట్టాలని సూచన చేశాడు
దక్షిణాఫ్రికాను ఓడించే సత్తా శ్రీలంకకు ఉందని రణిల్ విక్రమ్ పునరుద్గాటించారు.

Sunday, March 15, 2015

వ్యవసాయం లో తెలంగాణా రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలుస్తుంది: పార్లమెంటరీ సెక్రెటరీ కోవా లక్ష్మి


వ్యవసాయం లో తెలంగాణా రాష్ట్రం  దేశంలో అగ్రగామిగా నిలుస్తుంది: పార్లమెంటరీ  సెక్రెటరీ  కోవా లక్ష్మి 
 రెబ్బెన : మార్చి 15(వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల గోలేటి లో గల "మన్నేపల్లి చెరువు" ను మిషన్ కాకతీయలో బాగంగా  పనులను ఆదివారం పార్లమెంట్ సెక్రెటరి కోవా లక్ష్మి ప్రారంబిచారు ఈ చెరువు వలన సుమారు 130 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది దీనికోసం రూ.  39.40 లక్షల నిధులు మంజూరు అయినట్టు ఆమె తెలిపారు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెపడుతూన్న మిషన్ కాకతీయ పథకం వలన తెలంగాణా రాష్ట్రం వ్యవసయంగా దేశం లో అగ్రగామిగా, పయనిస్తూ పేదరికం లో మగ్గుతున్న రైతులకు జీవనొపాది కలిగించడమే  దీని ముఖ్యోదేసం అని ఆమె తెలిపారు, కోవా లక్ష్మి వెంట ఆదిలాబాద్ తూర్పు జిల్లా టి.అర్.ఎస్. అద్యక్షులు పురాణం సతీష్, జెడ్.పి.టి. సి. అజ్మీర బాబురావు ఏం.పి.పి. సంజీవ్ కుమార్ గోలేటి సర్పంచ్ తోట లక్ష్మణ్ తోపాటు మండలం లోని ఇతర సర్పంచులు మరియు ఎం.పి.టి.సి,లు కూడా పాల్గొన్నారు.