Wednesday, October 29, 2014

నీళ్లతో అందమైన ఆరోగ్యం


మనలో చాలా మందికి నీటివిలువ, మన ఆరోగ్యంపై నీటి ప్రభావం ఎంత అనేది తెలియదు. కాబట్టి దప్పికైతే తప్ప నీరు తాగరు. నీరు మన ఆరోగ్య పరిరక్షణలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో తెలుసుకుందాం.
మనశరీరంలో 60-70 శాతం ఉన్నది నీరే. మెదడు, కండరాలు, ఊపిరితిత్తులు, రక్తంలో ప్రధానభాగం నీరే. మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రణ చేసేది నీరే. మన శరీరంలోని అన్ని భాగాలకూ న్యూట్రియట్స్‌ను పంపేది నీరే. శరీరంలోని మలినాలను తొలగించేది, జీర్ణక్రియకు తోడ్పడేది, రక్తం, మూత్రం తయారీల్లో ప్రముఖపాత్ర వహిస్తోంది నీరు. శరీరంలో నీటిశాతం తగ్గితే, డీ హైడ్రేషన్‌ రకరకాల తలనొప్పులు, కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు ప్రారంభం అవుతాయి. సరైన మంచినీరు శరీరానికి మీరు అందించకపోతే, మలబద్దకం ఏర్పడి అనేక రుగ్మతలకు దారితీస్తుంది.
- ప్రతి మనిషీ రోజుకు 5,6 లీటర్ల నీరు తాగాలి.
- మంచి నీరు సమయానికి అందకపోతే డీహైడ్రేషన్‌కు గురై అదే సమయంలో మెటడాలిజం రేటు మూడు శాతం తగ్గిపోతుంది.
- మంచినీరు శరీరానికి అందకపోతే శరీరం నీరసించిపోతుంది. ఏకాగ్రత లోపిస్తుంది. ఏ పనిచేయలేరు. కళ్లుబైర్లు కమ్ముతాయి.
- ప్రతిరోజూ విధిగా 8,10 గ్లాసులు నీరు తక్కువ కాకుండా తాగేవారికి బ్లాడర్‌ కేన్సర్‌ సంభవించే అవకాశం తక్కువ.
- శరీరానికి నీటి శాతం తగ్గితే శరీర కాంతి కోల్పోతుంది. ముడతలు పడుతుంది. చర్మం వదులుగా అయిపోతుంది.
- కాఫీ తాగే అలవాటున్న వారు అదనంగా రెండు కప్పుల నీరు తాగాలి. కారణం కాఫీలోని కెఫైన్‌ కారణంగా మూత్రం అధికంగా వచ్చి శరీరం డీహైడ్రేషన్‌కు దారితీసే అవకాశం ఉంది. ఓ రకమైన తలనొప్పి కూడా వస్తుంది.
- మీ గుండె ఆరోగ్యంగా పనిచేయాలన్నా తప్పక పదిగ్లాసుల నీరు తాగాల్సిందే. అశ్రద్ధ చేయకండి.
- ఆహారం తిన్న రెండు గంటల అనంతరం నీరు తాగాలి.
- ఆహారంతో పాటు, ముద్ద ముద్దకూ నీరు తాగడం మంచి పద్ధతి కాదు.
గోళ్లు, జుట్టు, శరీరం అన్ని భాగాలూ ఆరోగ్యంగా ఉండాలంటే తగినన్ని మంచినీరు తాగాల్సిందే.
కిడ్నీలో రాళ్ళతో బాధపడేవారు ఎంత ఎక్కువగా నీరు తాగితే అంత మంచిది.
- మంచినీటిని పరిశుభ్రంగా ఉన్న ప్రదేశం నుండి వడకట్టి తాగడం మంచి పద్ధతి.
ఎక్కడ పడితే అక్కడ నీరును తాగకూడదు. ఆహారం వండటానికి, స్నానానికి పరిశుభ్రమైన నీటిని మాత్రమే వాడాలని గుర్తుపెట్టుకోండి.

Monday, October 6, 2014

8న సంపూర్ణ చంద్రగ్రహణం

ఈ నెల 8న సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించబోతోంది. ఆ రోజు మధ్యాహ్నం 2.44 గంటలకు మొదలయ్యే గ్రహణం సాయంత్రం 6.04 గంటల వరకూ కొనసాగుతుందని ఉజ్జయిని అబ్జర్వేటరీ అధికారులు ప్రకటించారు.  సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖపైకి రానున్న ఆ సమయంలో దాదాపు 23 నిమిషాలపాటు చంద్రుడు కనుమరుగవుతాడు. సూర్య చంద్రులకు మధ్యలో భూమి రావడంతో ఏర్పడే ఈ అరుదైన అద్భుతాన్ని ఈశాన్య రాష్ట్రాల్లోని కోహిమా, దిబ్రూగఢ్, ఇంఫాల్ నగరాల ప్రజలు స్పష్టంగా చూడవచ్చు. ఈ ఏడాది ఇది రెండో చంద్రగ్రహణం కావడం విశేషం. ఏప్రిల్ 15న తొలి చంద్రగ్రహణం వచ్చిన సంగతి తెలిసిందే.

వర్మ ‘సావిత్రి’ పై వివాదం..!

savitriసంచలనాలకు, వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ పై మరో వివాదం మొదలైంది. ఈసారి సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందే, కేవలం పోస్టర్ రిలీజ్ తో దుమారం లేస్తోంది. తన చిన్ననాటి జీవితానుభవంతో ఓ సినిమా చేయాలనుకున్నాడు వర్మ. చిన్నప్పుడు తాను స్కూల్ లో చదువుకుంటున్నప్పుడు తమ ఇంగ్లీష్ టీచర్ అంటే తనకు పిచ్చెక్కేదని, అందుకే అప్పటి అనుభవంతో ఒరిజినల్ పేరు మార్చి ‘సావిత్రి’ అనే పేరుతో సినిమా తీయాలనుకున్నాడు. అంతేకాకుండా, ప్రతి ఒక్కరి జీవితంలో సావిత్రి టీచర్ ఉండే ఉంటుందని చెప్పారు. పక్కింటి ఆంటీనో, స్కూల్ లో టీచరో, ట్యూషన్ టీచరో, అక్క ఫ్రెండో…ఇలా ఉంటారని చెప్పారు. అంతటితో ఆగకుండా ‘మీ సావిత్రి ఎవరు?’ అని ఓ కాంటెస్ట్ కూడా పెట్టారు.ఈ సినిమాకి సంబంధించి ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చిన్న పిల్లాడు.. టీచర్ అందాలను తొంగి తొంగి చూస్తున్నట్లు చూపించాడు. దీంతో, పెద్ద దుమారమే మొదలైంది. బాలల హక్కుల కమిషన్ ఈ పోస్టర్ ని సుమోటో గా తీసుకొని నోటిసులు జారి చేసింది. మహిళా సంఘాలు, స్టూడెంట్ యూనియన్స్… వర్మకు మతి పోయిందని, మానసిక స్థితి సరిగాలేదని మండిపడుతున్నాయి.