Monday, October 6, 2014

వర్మ ‘సావిత్రి’ పై వివాదం..!

savitriసంచలనాలకు, వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ పై మరో వివాదం మొదలైంది. ఈసారి సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందే, కేవలం పోస్టర్ రిలీజ్ తో దుమారం లేస్తోంది. తన చిన్ననాటి జీవితానుభవంతో ఓ సినిమా చేయాలనుకున్నాడు వర్మ. చిన్నప్పుడు తాను స్కూల్ లో చదువుకుంటున్నప్పుడు తమ ఇంగ్లీష్ టీచర్ అంటే తనకు పిచ్చెక్కేదని, అందుకే అప్పటి అనుభవంతో ఒరిజినల్ పేరు మార్చి ‘సావిత్రి’ అనే పేరుతో సినిమా తీయాలనుకున్నాడు. అంతేకాకుండా, ప్రతి ఒక్కరి జీవితంలో సావిత్రి టీచర్ ఉండే ఉంటుందని చెప్పారు. పక్కింటి ఆంటీనో, స్కూల్ లో టీచరో, ట్యూషన్ టీచరో, అక్క ఫ్రెండో…ఇలా ఉంటారని చెప్పారు. అంతటితో ఆగకుండా ‘మీ సావిత్రి ఎవరు?’ అని ఓ కాంటెస్ట్ కూడా పెట్టారు.ఈ సినిమాకి సంబంధించి ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చిన్న పిల్లాడు.. టీచర్ అందాలను తొంగి తొంగి చూస్తున్నట్లు చూపించాడు. దీంతో, పెద్ద దుమారమే మొదలైంది. బాలల హక్కుల కమిషన్ ఈ పోస్టర్ ని సుమోటో గా తీసుకొని నోటిసులు జారి చేసింది. మహిళా సంఘాలు, స్టూడెంట్ యూనియన్స్… వర్మకు మతి పోయిందని, మానసిక స్థితి సరిగాలేదని మండిపడుతున్నాయి.

No comments:

Post a Comment