8న సంపూర్ణ చంద్రగ్రహణం
ఈ నెల 8న సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించబోతోంది. ఆ రోజు మధ్యాహ్నం 2.44 గంటలకు మొదలయ్యే గ్రహణం సాయంత్రం 6.04 గంటల వరకూ కొనసాగుతుందని ఉజ్జయిని అబ్జర్వేటరీ అధికారులు ప్రకటించారు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖపైకి రానున్న ఆ సమయంలో దాదాపు 23 నిమిషాలపాటు చంద్రుడు కనుమరుగవుతాడు. సూర్య చంద్రులకు మధ్యలో భూమి రావడంతో ఏర్పడే ఈ అరుదైన అద్భుతాన్ని ఈశాన్య రాష్ట్రాల్లోని కోహిమా, దిబ్రూగఢ్, ఇంఫాల్ నగరాల ప్రజలు స్పష్టంగా చూడవచ్చు. ఈ ఏడాది ఇది రెండో చంద్రగ్రహణం కావడం విశేషం. ఏప్రిల్ 15న తొలి చంద్రగ్రహణం వచ్చిన సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment