Wednesday, April 15, 2015

మధ్యహ్న భోజన పథకం నూతన వంటశాల

                                                 మధ్యహ్న  భోజన పథకం నూతన వంటశాల 


రెబ్బెన: ఏప్రిల్ 15 (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలకేంద్రంలోయూ.పి.యస్. పాటశాల లో  మధ్యహ్న  
భోజన పథకం కింద నూతన వంటశాల ను ఈ  రోజు రెబ్బెన సర్పంచ్  పెసరు వెంకటమ్మ  ప్రారంబించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్ వైస్ యం.పి.పి.గోదిసేలా రేణుక, చైర్మన్ బొంగు లక్ష్మి, సోమషేకర్ ,శ్రీనివాస్, మాజీ యం.పి.టి.సి. బొంగు నర్సింగరావు,వెంకటేశ్వర్ గౌడ్,దీకొండ సంజీవ్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు. 




రిలయన్స్ నుంచి సరికొత్త మొబైల్ యాప్

వాట్సాప్‌కి పోటీగా జీయో విత్.. సరికొత్త యాప్

- రిలయన్స్ నుంచి సరికొత్త మొబైల్ యాప్
- ఆడియో, వీడియా షేరింగ్ ఆప్షన్
- న్యూస్ అప్‌డేట్స్ సైతం..ఆసక్తి చూపుతున్న యూత్


Whats App Vs jio chat

స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాక ఎస్‌ఎంఎస్‌లు, ఈ మెయిల్స్ కంటే సోషల్ మీడియా మాధ్యమాలకు క్రేజ్ పెరిగింది. మార్కెట్‌లోకి రోజుకో మొబైల్ యాప్ వస్తోంది. టెక్స్ మెసేజ్‌లకే పరిమితమైన జనానికి ఆడియోలు, వీడియోలు సైతం షేర్ చేసుకునే అవకాశాన్ని కల్పించాయి. అక్కడితో ఆగిపోకుండా ఫ్రీ కాల్స్ ఆప్షన్‌ను కూడా అందించాయి. అలా.. వాట్సప్, వైబర్, వియ్‌చాట్, హైక్ వంటి యాప్స్ కోట్లాది మంది వినియోగదారులను ఆకర్షించాయి. ఇప్పుడు సరికొత్తగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల ముందుకు జియో చాట్ వచ్చింది. రిలయెన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ ఇటీవలే విడుదల చేసిన ఈ ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ పట్ల ఇప్పుడు యూత్ ఆసక్తి కనబరుస్తున్నారు.

నమస్తే తెలంగాణ : ఆండ్రాయిడ్ మొబైల్స్ చాటింగ్ కోసం వినియోగిస్తున్న వాట్సప్, లైన్, వైబర్, హైక్ వంటి అప్లికేషన్స్ సరసన సరికొత్తగా జియోచాట్ వచ్చి చేరింది. వాట్సప్ మాదిరి ఉచితంగా మీ ఆత్మీయులతో సంభాషించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇటీవలే రిలయెన్స్ విడుదల చేసిన ఈ మొబైల్ యాప్‌లో ఆడియో, వీడియో చాట్‌తో గ్రూప్ చాటింగ్‌కి కూడా అవకాశం ఉండడం విశేషం. ఇప్పటివరకు యూత్‌ని ఆకట్టుకుంటున్న వాట్సప్ వంటి యాప్స్‌కి దీటుగా మార్కెట్‌లోకి వచ్చిన జియోలో ఫ్రీ కాలింగ్ ఆప్షన్ కూడా ఉంది. చుట్టుపక్కల ఉన్న మిత్రులతోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్నేహితులతో సైతం జియో మొబైల్ యాప్ ద్వారా సంభాషించవచ్చు.

మల్టీ ఆప్షన్స్..
జియో చాట్ ద్వారా పంపే సందేశాలను ఎస్‌ఎంఎస్ ఫార్మెట్‌లో కూడా పంపించవచ్చు. ఎలాంటి చార్జీలు లేకుండా ఉచితంగా ఎస్‌ఎంఎస్‌లు పంపే అవకాశం ఉండడం వల్ల ఎక్కువమంది వినియోగదారులు జియో యాప్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. కేవలం టెక్స్ మెసేజ్‌లే కాదు.. ఆడియోలు, వీడియోలు కూడా పంపించవచ్చు. ఒకేసారి ఎక్కువమందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం కూడా కల్పిస్తుంది జియో. ఇక వాట్సప్ మాదిరి గ్రూప్ చాటింగ్‌లో.. ఆకర్షణీయమైన స్టిక్కర్, ఎమోషన్స్, డూడెల్స్ పంపించుకోవచ్చు. మీడియో, లొకేషన్ కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంది.

న్యూస్ అప్‌డేట్స్..
జియో చాట్‌లో న్యూస్ అప్‌డేట్స్ కూడా తెలుసుకోవచ్చు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌తో పాటు సెలబ్రెటీల సమాచారాన్ని సైతం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అందుకు జియో చాట్ చానల్స్ కనెక్ట్ అయితే చాలు. స్నేహితులు, ఆత్మీయులతో అప్‌డేట్స్‌ని షేర్ చేసుకోవచ్చు కూడా. రిలయెన్స్ జియో త్వరలో 4జీ సర్వీస్‌కి ప్లాన్ చేస్తోంది. ఒకేసారి వందమందికి మెసేజ్‌లు పంపవచ్చు. అంతేకాదు.. మొబైల్ ఫోన్‌లోని కాంటాక్ట్‌ని ఆటోమెటిక్‌గా జియో సింక్రనైజ్ చేసుకుంటుంది. ఫ్రీ చాట్ ఆప్లికేషన్ పట్ల ఇప్పటికే భారతీయ వినియోగదారులు అమితాసక్తిని కనబరుస్తున్నారు. ఈ యాప్‌ని play.google.com నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంక మీరూ జియోతో హ్యాపీగా జీవించవచ్చు.

వాట్సాప్‌కి పోటీగా..

మేడ్ ఇన్ ఇండియా యాప్ జియోకి ఫుల్ రేటింగ్
మోర్ ఆప్షన్స్- మోర్ అట్రాక్టివ్

రిలయెన్స్ ఇన్ఫోకమ్ విడుదల చేసిన జియో మెసేజింగ్ యాప్ ఇప్పుడు వాట్సప్‌కి పోటీగా నిలవనుందా? అవుననే సమాధానం వెలువడుతోంది. దేశీయ మార్కెట్ నుంచి వెలువడిన ప్రత్యామ్నాయ వేదికగా చూస్తున్న జనం ఇప్పుడు జియో పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నెలా 700 మిలియన్ల వినియోగదారులు వాట్సప్‌ని వాడుతుండడంతో.. ఒకదశలో వాట్సప్‌ని రీచ్ అవడం సాధ్యమా అనే సందేహం కలిగేది. మొదట్లో ప్రపంచ వ్యాప్తంగా ఎవరితోనైనా ఉచితంగా అనుసంధానం చేసేందుకు వాట్సప్ ఏకైక యాప్ ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని జియో భర్తీ చేస్తూ ముందుకు వచ్చింది.

ఆండ్రాయిడ్, ఐఎస్‌ఓ డివైస్‌ల్లో పనిచేసేలా రూపొందించిన ఈ మొబైల్ అప్లిషన్ తక్కువ సమయంలోనే వినియోగదారుల మన్ననలు పొందింది. ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్‌లో 4. 5ప్లస్ రేటింగ్ సాధించడం విశేషం. వాట్సప్‌తో పోల్చితే జియో అదనపు ఆప్షన్స్ ఉండడం విశేషం. అంతేకాదు.. ఇంటర్‌ఫేస్ వాట్సప్‌తో పోల్చితే మరింత క్లారిటీ ఉండడం గమనార్హం. అన్నింటికంటే.. మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్ కలిగి ఉండడం వల్ల భారతీయ వినియోగదారులు ఎక్కువగా ఇప్పుడు జియో వైపు ఆసక్తి చూపుతున్నారు.

ఘనంగా డా. బి. ఆర్‌. అంబేడ్కర్‌ 124వ జయంతి వేడుకలు

ఘనంగా డా. బి. ఆర్‌. అంబేడ్కర్‌ 124వ జయంతి వేడుకలు

రెబ్బెన లో డా. బిఆర్‌ అంబేడ్కర్‌ 124వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల 
కేంద్రంలోని తహసీల్ధార్‌ కార్యాలయంలో మంగళవారం డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. 
అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో తహసీల్ధార్‌ జగదీశ్వరి  ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

రెబ్బెన గ్రామ పంచాయితీడా. బిఆర్‌ అంబేడ్కర్‌ 124వ జయంతి వేడుక

రెబ్బెన గ్రామ పంచాయితీలో జరిగిన కార్యక్రమంలో రెబ్బెన గ్రామ సర్పంచ్ పెసరి వెంకటమ్మ, ఉప సర్పంచ్ బొమ్మినేని  శ్రీధర్, బొంగు శ్రీనివాస్, శ్రీధర్, శంకర్, శారద, తిరుపతమ్మమరియు  గ్రామస్తులు పాల్గొన్నారు.

నారాయణపూర్ యువజన సంఘం అధ్వర్యంలో ఘనంగా  ర్యాలీ 
డా. బిఆర్‌ అంబేడ్కర్‌ 124వ జయంతి వేడుకల సందర్భంగా నారాయణపూర్ యువజన సంఘం సభ్యులు నారాయణపూర్ నుండి రెబ్బెన మండల కేంద్రం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. తర్వాత మండల కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసారు. ఈ కార్యక్రమంలో నారాయణపూర్ యువజన సంఘం అద్యక్షులు దుర్గం మొండయ్య,రెబ్బెన మాజీ సర్పంచ్ దుర్గం హన్మంతు,దుర్గం లింగయ్య, పెరుగు తిరుపతి, శివ, రాజేశ్వర్, రవి, వెంకటేష్, మల్లేష్,సాయి కుమార్, సతీష్, మహేందర్,రామ్ చందర్,లక్ష్మన్,జడి శంకర్,జడి నారాయణ,మల్లక్క, శాలక్క, ప్రశాంత్, తుకారం, శ్యాం రావు, బాల కృష్ణ, మరియు సంఘం సభ్యులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

సంచలనం రేపిన యువతి దారుణ హత్య ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

సంచలనం రేపిన యువతి దారుణ హత్య ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన 


రెబ్బెన మండలం లోని  పాసిగాం  గ్రామానికి చెందిన వసాక శ్యామల (18) ఊరి చివర ఆటవీప్రాంతంలో దారుణ హత్యకు గురైయిందని తాండూర్  సి.ఐ రమేష్ బాబు సోమవారం తెలిపారు.  పాసిగామకు చెందిన శ్యామల గత నెల 28న రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో బయటకు వెళ్ళింది, తిరిగి ఇంటికి రాకపోయేసరికి ఆమె తండ్రి విజ్జు మేర ఇరుగు పొరుగు ఇళ్ళలో ఆరాతీసిన  తన జాడ తెలియకపోయేసరికి  31 న కుటుoబ సభ్యులు రెబ్బెన  పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశారని  తెలిపారు. సోమవారం పాసిగంకి రెండు కిలోమీటర్ల దూరంలోగల సుద్ద క్వారీ గుంతల సమీపంలో మేకల కాపర్లు దుర్వాసనని గమనించి స్థానిక సర్పంచ్ కి సమాచారమిచ్చారు. సర్పంచ్ గ్రామస్థులతో చూడగా యువతి మృతదేహం కనిపించింది. మృతదేహం ఫై ఉన్న దుస్తులతో విజ్జుమేర తన కూతురుదేనని గుర్తించారు. వెంటనే సర్పంచ్ పోలీసులకు సమాచారమందిచారు. దీంతో బెల్లంపల్లి డి ఎస్ ఫై  రమణా రెడ్డి, తాండూర్ సి ఐ రమేష్ బాబు, రెబ్బెన ఎస్ ఐ హనోక్ సంఘటనా స్థలికి చేరుకొని యువతి తండ్రిని,స్థానికులను అడిగి తెలుసుకున్నారు.  శ్యామలను ఓణి తో ఉరేసి చంపి ముఖం ఏర్పడకుండా పెద్ద రాయితో కొట్టి ఉంటారనే ఆనవాళ్ళు ఉన్నాయి. సంఘటనా స్థలాన్ని డాగ్ స్క్వాడ్ బృందం, క్లూస్ టీంలు వచ్చాయి. కేసు దర్యాప్తు చేస్తునాట్లు  తాండూర్ సి ఐ రమేష్ బాబు తెలిపారు . 

అభయహస్తం పించన్ల పంపిణి

                                          అభయహస్తం పించన్ల పంపిణి


 రెబ్బెన  మండలంలోని   అభయహస్తం పించన్ల  17 మందికి  రెబ్బెన జి పి కార్యాలయంలోని  యం పి పి  సంజీవ్ కుమార్  జెడ్ పి టి సి  అజ్మీర బాబురావు  సర్పంచ్ పెసరు వెంకటమ్మ  ఆధ్వర్యంలో నెలకు 500/- చొప్పున మొత్తం 3000/- రూ  17 మందికి   అభయహస్తం పించన్ల   పంపిణి చేసారు ఈ  కార్యక్రమంలో యం.పి.డి.ఓ.  యం. ఏ.  హలీమ్ వైస్  యం.పి. పి. గోడిసేలా రేణుక ఉప సర్పంచ్ శ్రీధర్ ఏ.పి.యం. రాజ్ కుమార్ సింగిల్ విండో డైరెక్టర్ మదునయ్య సెక్రటరీ రవి లు పాల్గొన్నారు.  
  

మాదిగల నిరసన పోరు పోస్టర్ ఆవిష్కరణ

మాదిగల నిరసన పోరు పోస్టర్ ఆవిష్కరణ 



రెబ్బెన : ఏప్రిల్ 12 (వుదయం ప్రతినిధి) రెబ్బన మండలంలోని మాదిగల నిరసన పోరు ఏప్రిల్ 5 నుండి ఏప్రిల్ 14 వరకు జరుగు నిరసన ప్రదర్శన - ధర్నాలు-రాస్తారోకోలు సంభందించిన పోస్టర్ను          యం అర్ పి స్  మండల అద్యక్షుడు బొంగు నరసింగ రావు, మండల కార్యదర్శి   నర్సింహులు, మండల అధికార  ప్రతినిధి గోగార్ల రాజేష్, గ్రామా అధ్యక్షులు రొడ్డ శంకర్ వారి పోస్టర్ ను ఆవిష్కరించారు.
 దళితున్ని ముఖ్యమంత్రి   చేయాలి, మాదిగలకు, మాలలకు మంత్రి వర్గంలో ప్రాతినిద్యం కల్పించాలి, దళితుల సంక్షేమాన్ని చూసే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి
దళితులకు భూ పంపిణి చేయాలి,  అంబేద్కార్,జగ్జీవన్ రామ్ ల జయంతి ఉత్సవాల కమిటి చైర్మన్  గా  దళితున్ని నియమించాలి డిమాండ్‌ చేశారు. కార్యక్రమం లో   యం అర్ పి స్ కార్యకర్తలు పి . వినెయ్, పి ఆయిలు, జి నగేష్,  రమేష్ , గణేష, తుఖరం రాజిఖ సంఘ అద్యక్షుడు శంకర్,  తే ధ పా నాయకులూ మోడం రాజ గౌడ్  నాగరాజు  నాయాకులు మద్దత్తు  తెలిపారు  

నంబల శివాలాయం లో హైకోర్ట్ న్యాయమూర్తుల ప్రత్యేక పూజలు

నంబల  శివాలాయం లో హైకోర్ట్ న్యాయమూర్తుల  ప్రత్యేక పూజలు


రెబ్బెన: ఏప్రిల్ 11 (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల నంబల గ్రామం లోని ప్రసన్న పరమేశ్వర శివాలయంను శనివారం రోజు హైకోర్ట్ న్యాయమూర్తులు  జస్టిస్ జి. చంద్రయ్య , జస్టిస్ ఎమ్. సీతారామ మూర్తి, జిల్లాన్యాయమూర్తి జస్టిస్ గ్రంది గోపాలకృష్ణ మూర్తి గార్లు  దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆస్సిసులు అందుకొన్నారు .   ఈ సందర్భంగా ఆలయ కమిటి సభ్యులు  నంబల గ్రామా సర్పంచ్ శ్రీమతి జి.సుశీల పూలమాల తో  వారికి ఘన స్వాగతం పలికారు, దేవాలయ అభివృద్ధి కొరకు ఒక వినతి పత్రం అందజేసారు, ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ సబ్-కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, బెల్లంపల్లి డి.ఎస్.పి. రమణా రెడ్డి రెబ్బెన సబ్ ఇనస్పెక్టర్ హనుక్ మరియు మండల నాయకులూ మోడెమ్ సుదర్శన్ గౌడ్, బొమ్మినేని శ్రీధర్ కుమార్, కొవ్వూరి శ్రీనివాస్ ,పాలుగోన్నారు  



ట్రాక్టర్ బోల్తాపడి ఒకరి  మృతి 

రెబ్బెన: ఏప్రిల్ 11 (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రం లోని జూనియర్ కళాశాల దగ్గర శనివారం ఉదయం ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడి ఇటుక బట్టిలో పని చేస్తున కూలి బట్టి మహేందర్ (30) పెగడపల్లి వాసి అక్కడిక్కడే మృతి చెందాడు మరియు ట్రాక్టర్ డ్రైవర్ రాజు కు తీవ్రగాయాలు అయ్యాయి,  ట్రాక్టర్ డ్రైవర్ ఎదురుగా వస్తున్నా లారీని  తప్పియ్య బోయి అనుకోకుండా ట్రాలీ లిఫ్ట్ జాక్ పైకి లేవడం తో ప్రమాదం జరిగినట్టు రెబ్బెన ఎస్.ఐ. హనుక్ తెలిపారు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్.ఐ. హనుక్ తెలిపారు.  

మహాత్మా జ్యోతి రావు పులే 189వ  జయంతి 
రెబ్బెన: ఏప్రిల్ 11 (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రం లో ని మండల పరిషద్ కార్యాలయములో  మహాత్మా జ్యోతి రావు పులే 189వ  జయంతి ని ఘనంగా జరిపారు, ఈ కార్యక్రమం లో జెడ్.పి.టి.సి. బాబురావు ఎమ్.పి.పి. సంజీవ్ కుమార్  సర్పంచ్ పెసర వెంకటమ్మ,  ఎమ్.పి.టి.సి.లు గోడిసేలా రేణుక, కొవ్వూరి శ్రీనివాస్, వనజ మరియు ఇతర నాయకులూ మదనయ్య, చిరంజీవి పాలుగోన్నారు.