ఇంద్ర ధనుష్ ఫై అవగాహన
రెబ్బెన : ఏప్రిల్ 2 (వుదయం ప్రతినిధి) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంద్ర ధనుష్, ఆర్మీ రిక్రూట్ మెంట్ పారిశుద్యo పై పథకాలఫై వైద్య,ఆరోగ్య శాఖ సిబ్బంది కృషి చేయాలని ఎమ్.పి.డి. ఓ. ఎమ్.ఎ. హలీమ్, తహసిల్దార్ జగదీశ్వరి లు అన్నారు. బుధవారం ఎమ్.పి.డి. ఓ. కార్యాలయం లో అంగన్ వాడి, ఐ.కె.పి. సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్స్ లకు ఇంద్రధనుష్, ఆర్మీ రిక్రూట్ మెంట్ ఫై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏప్రిల్ 7 న ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని ప్రారంభించనుందన్నారు. 0 నుంచి రెండేళ్లలోపు చిన్నారులను పలు రకాల ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడడానికి ఇమ్యునైజేషన్ చేపట్టాలన్నారు. ఈ అవగాహన సదస్సులో ఎమ్.పి.డి. ఓ. ఎమ్.ఎ. హలీమ్, తహసిల్దార్ జగదీశ్వరి,ఎ.పి.ఎమ్. రాజ్ కుమార్, ఎ.ఓ. మంజుల, వైద్య,ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్ వాడి, ఐ.కె.పి. సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment