Wednesday, April 15, 2015

రెబ్బెన లో ఆంధ్రాబ్యాంక్ నుతనశాఖ ప్రారంభం.

రెబ్బెన లో ఆంధ్రాబ్యాంక్ నుతనశాఖ ప్రారంభం. 
 రెబ్బెన : మార్చి 30(వుదయం ప్రతినిధి)    ఆంధ్రాబ్యాంక్ కరీంనగర్ జోన్ లో ఆంధ్రాబ్యాంక్ 93వ శాఖను రెబ్బెన మండల కేంద్రం లో సోమవారం రోజు ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు, పార్లమెంటరి సెక్రెటరి శ్రీమతి కోవా లక్ష్మి గారు మరియు బెల్లంపల్లి శాసన సభ్యులు దుర్గం చిన్నయ్య గారు,  ఆదిలాబాద్ తూర్పు జిల్లా టి.అర్.ఎస్. అద్యక్షులు పురాణం సతీష్గారు, ప్రారంభించారు, ఈ సంధర్బంగా జోనల మేనేజర్ శ్రీ ఎ. సత్యనారాయణ గారు మాట్లాడుతూ కరీంనగర్ జోన్ లో ఆంధ్రాబ్యాంక్ బ్యాంక్   93 శాఖలతో విస్తరించిదని,  కరీంనగర్ జోన్ లో రూ . 6300 కోట్లతో వ్యాపారం చేస్తునట్లు, 100 శాఖలు గా విస్తరించి రూ . 8000 కోట్ల వ్యాపారం లక్ష్యాని సాదించడానికి కృషి చేస్తునట్లు చెప్పారు. 

              పార్లమెంటరి సెక్రెటరి / వ్యవసాయ శాఖా సహాయ మంత్రి శ్రీమతి కోవా లక్ష్మి గారు మాట్లాడుతూ రైతులకు వడ్డి లేని రుణాలను మరియు మహిళలకు పావలా  వడ్డీకి డ్వాక్ర రుణాలు మంజూరు చెయ్యాలని బ్యాంక్ మానేజర్ గారిని కోరారు.  బెల్లంపల్లి శాసన సభ్యులుదుర్గం చిన్నయ్య గారు మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాది అవకాశాల కొరకు రుణ సదుపాయం చెయ్యాలని కోరారు.  
రెబ్బెన తహసిల్దార్ జగదీశ్వరి గారు , M P T O,A P M , రెబ్బెన సర్పంచ్ పెసరి వెంకటమ్మ , మండల వైస్ ప్రసిడెంట్ గొడిసెల రేణుక,,  మరియు ఇతర టి.అర్.ఎస్. నాయకులు ,మండలం లోని ఇతర సర్పంచులు మరియు ఎం.పి.టి.సి,లు కూడా   తదితరులు పాలుగొన్నరు

No comments:

Post a Comment