వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణం
శ్రీ రామ నవమిని పురస్కరించుకొని రెబ్బెన మండల కేంద్రంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శనివారం సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా జరిగింది . ముందుగా దుర్గాదేవి ఆలయం నుండి ఉత్సవ విగ్రహాలు కమిటీ అధ్యక్షులు గంటుమేర అధ్యక్షతన ఊరేగింపుగా సీతారామ ఆలయంలోనికి తీసుకువచ్చి కళ్యాణోత్సవం జరిపించారు. ఈ కళ్యాణోత్సవానికి గ్రామ పంచాయత్ సర్పంచ్ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకలు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామునుంచే భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆద్వ్యర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.
ఆలయ అభివృద్దికి తోడ్పడుతా
రెబ్బెన మండలకేంద్రంలో గల సీతారామంజనేయ స్వామి ఆలయ అభివృద్దికి తనవంతు సహకారం అందిస్తానని ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు మరియు పార్లమెంటరీ కార్యదర్శి శ్రీమతి కోవా లక్ష్మి గారు తెలియచెసారు. శనివారం శ్రీ రామనవమిని పురష్కరించుకొని రెబ్బెనకు వచ్చి శ్రీ సీతారామ కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపించిన తర్వాత ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు.
గంగాపుర్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా...
రెబ్బెన మండలం లోని గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి మాఘ శుద్ధ పౌర్ణమి నాడు భారీ ఎత్తున జాతర జరుగుతుంది ఇంత ఘన చరిత్ర కల్గిన గంగాపూర్ అభివృద్దిలో వెనకబడింది.దీని చరిత్ర గురించి ముఖ్యమంత్రికి వివరించి ఆయనను గంగాపూర్ కు తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని మరో తిరుపతిగా తీర్చిదిద్దేందుకు తన శక్తిమేరకు కృషి చేస్తానని స్థానిక శాసన సభ్యురాలు కోవా లక్ష్మి గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.పి. సంజీవ్, వైస్ ఎం.పి.పి. గుడిసెల రేణుక, సర్పంచ్ పెసర వెంకటమ్మ, ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ జైస్వాల్, ఆలయ కమిటి సభ్యులు గంటుమేర, శంకరమ్మ, సుదర్శన్ గౌడ్, సోమ శేఖర్, మరియు నాయకులు మోడెం చిరంజీవి గౌడ్, వెంకటేశ్వర గౌడ్, ప్రవీణ్ కుమార్, కార్నాథం పెంటయ్య గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment