వాట్సాప్‌కి పోటీగా జీయో విత్.. సరికొత్త యాప్
- రిలయన్స్ నుంచి సరికొత్త మొబైల్ యాప్
- ఆడియో, వీడియా షేరింగ్ ఆప్షన్
- న్యూస్ అప్‌డేట్స్ సైతం..ఆసక్తి చూపుతున్న యూత్
స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాక ఎస్‌ఎంఎస్‌లు, ఈ మెయిల్స్ కంటే సోషల్ మీడియా మాధ్యమాలకు క్రేజ్ పెరిగింది. మార్కెట్‌లోకి రోజుకో మొబైల్ యాప్ వస్తోంది. టెక్స్ మెసేజ్‌లకే పరిమితమైన జనానికి ఆడియోలు, వీడియోలు సైతం షేర్ చేసుకునే అవకాశాన్ని కల్పించాయి. అక్కడితో ఆగిపోకుండా ఫ్రీ కాల్స్ ఆప్షన్‌ను కూడా అందించాయి. అలా.. వాట్సప్, వైబర్, వియ్‌చాట్, హైక్ వంటి యాప్స్ కోట్లాది మంది వినియోగదారులను ఆకర్షించాయి. ఇప్పుడు సరికొత్తగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల ముందుకు జియో చాట్ వచ్చింది. రిలయెన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ ఇటీవలే విడుదల చేసిన ఈ ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ పట్ల ఇప్పుడు యూత్ ఆసక్తి కనబరుస్తున్నారు.
నమస్తే తెలంగాణ : ఆండ్రాయిడ్ మొబైల్స్ చాటింగ్ కోసం వినియోగిస్తున్న వాట్సప్, లైన్, వైబర్, హైక్ వంటి అప్లికేషన్స్ సరసన సరికొత్తగా జియోచాట్ వచ్చి చేరింది. వాట్సప్ మాదిరి ఉచితంగా మీ ఆత్మీయులతో సంభాషించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇటీవలే రిలయెన్స్ విడుదల చేసిన ఈ మొబైల్ యాప్‌లో ఆడియో, వీడియో చాట్‌తో గ్రూప్ చాటింగ్‌కి కూడా అవకాశం ఉండడం విశేషం. ఇప్పటివరకు యూత్‌ని ఆకట్టుకుంటున్న వాట్సప్ వంటి యాప్స్‌కి దీటుగా మార్కెట్‌లోకి వచ్చిన జియోలో ఫ్రీ కాలింగ్ ఆప్షన్ కూడా ఉంది. చుట్టుపక్కల ఉన్న మిత్రులతోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్నేహితులతో సైతం జియో మొబైల్ యాప్ ద్వారా సంభాషించవచ్చు.
మల్టీ ఆప్షన్స్..
జియో చాట్ ద్వారా పంపే సందేశాలను ఎస్‌ఎంఎస్ ఫార్మెట్‌లో కూడా పంపించవచ్చు. ఎలాంటి చార్జీలు లేకుండా ఉచితంగా ఎస్‌ఎంఎస్‌లు పంపే అవకాశం ఉండడం వల్ల ఎక్కువమంది వినియోగదారులు జియో యాప్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. కేవలం టెక్స్ మెసేజ్‌లే కాదు.. ఆడియోలు, వీడియోలు కూడా పంపించవచ్చు. ఒకేసారి ఎక్కువమందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం కూడా కల్పిస్తుంది జియో. ఇక వాట్సప్ మాదిరి గ్రూప్ చాటింగ్‌లో.. ఆకర్షణీయమైన స్టిక్కర్, ఎమోషన్స్, డూడెల్స్ పంపించుకోవచ్చు. మీడియో, లొకేషన్ కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంది.
న్యూస్ అప్‌డేట్స్..
జియో చాట్‌లో న్యూస్ అప్‌డేట్స్ కూడా తెలుసుకోవచ్చు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌తో పాటు సెలబ్రెటీల సమాచారాన్ని సైతం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అందుకు జియో చాట్ చానల్స్ కనెక్ట్ అయితే చాలు. స్నేహితులు, ఆత్మీయులతో అప్‌డేట్స్‌ని షేర్ చేసుకోవచ్చు కూడా. రిలయెన్స్ జియో త్వరలో 4జీ సర్వీస్‌కి ప్లాన్ చేస్తోంది. ఒకేసారి వందమందికి మెసేజ్‌లు పంపవచ్చు. అంతేకాదు.. మొబైల్ ఫోన్‌లోని కాంటాక్ట్‌ని ఆటోమెటిక్‌గా జియో సింక్రనైజ్ చేసుకుంటుంది. ఫ్రీ చాట్ ఆప్లికేషన్ పట్ల ఇప్పటికే భారతీయ వినియోగదారులు అమితాసక్తిని కనబరుస్తున్నారు. ఈ యాప్‌ని play.google.com నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంక మీరూ జియోతో హ్యాపీగా జీవించవచ్చు.
వాట్సాప్‌కి పోటీగా..
మేడ్ ఇన్ ఇండియా యాప్ జియోకి ఫుల్ రేటింగ్
మోర్ ఆప్షన్స్- మోర్ అట్రాక్టివ్
రిలయెన్స్ ఇన్ఫోకమ్ విడుదల చేసిన జియో మెసేజింగ్ యాప్ ఇప్పుడు వాట్సప్‌కి పోటీగా నిలవనుందా? అవుననే సమాధానం వెలువడుతోంది. దేశీయ మార్కెట్ నుంచి వెలువడిన ప్రత్యామ్నాయ వేదికగా చూస్తున్న జనం ఇప్పుడు జియో పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నెలా 700 మిలియన్ల వినియోగదారులు వాట్సప్‌ని వాడుతుండడంతో.. ఒకదశలో వాట్సప్‌ని రీచ్ అవడం సాధ్యమా అనే సందేహం కలిగేది. మొదట్లో ప్రపంచ వ్యాప్తంగా ఎవరితోనైనా ఉచితంగా అనుసంధానం చేసేందుకు వాట్సప్ ఏకైక యాప్ ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని జియో భర్తీ చేస్తూ ముందుకు వచ్చింది.
ఆండ్రాయిడ్, ఐఎస్‌ఓ డివైస్‌ల్లో పనిచేసేలా రూపొందించిన ఈ మొబైల్ అప్లిషన్ తక్కువ సమయంలోనే వినియోగదారుల మన్ననలు పొందింది. ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్‌లో 4. 5ప్లస్ రేటింగ్ సాధించడం విశేషం. వాట్సప్‌తో పోల్చితే జియో అదనపు ఆప్షన్స్ ఉండడం విశేషం. అంతేకాదు.. ఇంటర్‌ఫేస్ వాట్సప్‌తో పోల్చితే మరింత క్లారిటీ ఉండడం గమనార్హం. అన్నింటికంటే.. మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్ కలిగి ఉండడం వల్ల భారతీయ వినియోగదారులు ఎక్కువగా ఇప్పుడు జియో వైపు ఆసక్తి చూపుతున్నారు.

No comments:
Post a Comment