Wednesday, April 15, 2015

మధ్యహ్న భోజన పథకం నూతన వంటశాల

                                                 మధ్యహ్న  భోజన పథకం నూతన వంటశాల 


రెబ్బెన: ఏప్రిల్ 15 (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలకేంద్రంలోయూ.పి.యస్. పాటశాల లో  మధ్యహ్న  
భోజన పథకం కింద నూతన వంటశాల ను ఈ  రోజు రెబ్బెన సర్పంచ్  పెసరు వెంకటమ్మ  ప్రారంబించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్ వైస్ యం.పి.పి.గోదిసేలా రేణుక, చైర్మన్ బొంగు లక్ష్మి, సోమషేకర్ ,శ్రీనివాస్, మాజీ యం.పి.టి.సి. బొంగు నర్సింగరావు,వెంకటేశ్వర్ గౌడ్,దీకొండ సంజీవ్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు. 




రిలయన్స్ నుంచి సరికొత్త మొబైల్ యాప్

వాట్సాప్‌కి పోటీగా జీయో విత్.. సరికొత్త యాప్

- రిలయన్స్ నుంచి సరికొత్త మొబైల్ యాప్
- ఆడియో, వీడియా షేరింగ్ ఆప్షన్
- న్యూస్ అప్‌డేట్స్ సైతం..ఆసక్తి చూపుతున్న యూత్


Whats App Vs jio chat

స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాక ఎస్‌ఎంఎస్‌లు, ఈ మెయిల్స్ కంటే సోషల్ మీడియా మాధ్యమాలకు క్రేజ్ పెరిగింది. మార్కెట్‌లోకి రోజుకో మొబైల్ యాప్ వస్తోంది. టెక్స్ మెసేజ్‌లకే పరిమితమైన జనానికి ఆడియోలు, వీడియోలు సైతం షేర్ చేసుకునే అవకాశాన్ని కల్పించాయి. అక్కడితో ఆగిపోకుండా ఫ్రీ కాల్స్ ఆప్షన్‌ను కూడా అందించాయి. అలా.. వాట్సప్, వైబర్, వియ్‌చాట్, హైక్ వంటి యాప్స్ కోట్లాది మంది వినియోగదారులను ఆకర్షించాయి. ఇప్పుడు సరికొత్తగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల ముందుకు జియో చాట్ వచ్చింది. రిలయెన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ ఇటీవలే విడుదల చేసిన ఈ ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ పట్ల ఇప్పుడు యూత్ ఆసక్తి కనబరుస్తున్నారు.

నమస్తే తెలంగాణ : ఆండ్రాయిడ్ మొబైల్స్ చాటింగ్ కోసం వినియోగిస్తున్న వాట్సప్, లైన్, వైబర్, హైక్ వంటి అప్లికేషన్స్ సరసన సరికొత్తగా జియోచాట్ వచ్చి చేరింది. వాట్సప్ మాదిరి ఉచితంగా మీ ఆత్మీయులతో సంభాషించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇటీవలే రిలయెన్స్ విడుదల చేసిన ఈ మొబైల్ యాప్‌లో ఆడియో, వీడియో చాట్‌తో గ్రూప్ చాటింగ్‌కి కూడా అవకాశం ఉండడం విశేషం. ఇప్పటివరకు యూత్‌ని ఆకట్టుకుంటున్న వాట్సప్ వంటి యాప్స్‌కి దీటుగా మార్కెట్‌లోకి వచ్చిన జియోలో ఫ్రీ కాలింగ్ ఆప్షన్ కూడా ఉంది. చుట్టుపక్కల ఉన్న మిత్రులతోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్నేహితులతో సైతం జియో మొబైల్ యాప్ ద్వారా సంభాషించవచ్చు.

మల్టీ ఆప్షన్స్..
జియో చాట్ ద్వారా పంపే సందేశాలను ఎస్‌ఎంఎస్ ఫార్మెట్‌లో కూడా పంపించవచ్చు. ఎలాంటి చార్జీలు లేకుండా ఉచితంగా ఎస్‌ఎంఎస్‌లు పంపే అవకాశం ఉండడం వల్ల ఎక్కువమంది వినియోగదారులు జియో యాప్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. కేవలం టెక్స్ మెసేజ్‌లే కాదు.. ఆడియోలు, వీడియోలు కూడా పంపించవచ్చు. ఒకేసారి ఎక్కువమందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం కూడా కల్పిస్తుంది జియో. ఇక వాట్సప్ మాదిరి గ్రూప్ చాటింగ్‌లో.. ఆకర్షణీయమైన స్టిక్కర్, ఎమోషన్స్, డూడెల్స్ పంపించుకోవచ్చు. మీడియో, లొకేషన్ కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంది.

న్యూస్ అప్‌డేట్స్..
జియో చాట్‌లో న్యూస్ అప్‌డేట్స్ కూడా తెలుసుకోవచ్చు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌తో పాటు సెలబ్రెటీల సమాచారాన్ని సైతం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అందుకు జియో చాట్ చానల్స్ కనెక్ట్ అయితే చాలు. స్నేహితులు, ఆత్మీయులతో అప్‌డేట్స్‌ని షేర్ చేసుకోవచ్చు కూడా. రిలయెన్స్ జియో త్వరలో 4జీ సర్వీస్‌కి ప్లాన్ చేస్తోంది. ఒకేసారి వందమందికి మెసేజ్‌లు పంపవచ్చు. అంతేకాదు.. మొబైల్ ఫోన్‌లోని కాంటాక్ట్‌ని ఆటోమెటిక్‌గా జియో సింక్రనైజ్ చేసుకుంటుంది. ఫ్రీ చాట్ ఆప్లికేషన్ పట్ల ఇప్పటికే భారతీయ వినియోగదారులు అమితాసక్తిని కనబరుస్తున్నారు. ఈ యాప్‌ని play.google.com నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంక మీరూ జియోతో హ్యాపీగా జీవించవచ్చు.

వాట్సాప్‌కి పోటీగా..

మేడ్ ఇన్ ఇండియా యాప్ జియోకి ఫుల్ రేటింగ్
మోర్ ఆప్షన్స్- మోర్ అట్రాక్టివ్

రిలయెన్స్ ఇన్ఫోకమ్ విడుదల చేసిన జియో మెసేజింగ్ యాప్ ఇప్పుడు వాట్సప్‌కి పోటీగా నిలవనుందా? అవుననే సమాధానం వెలువడుతోంది. దేశీయ మార్కెట్ నుంచి వెలువడిన ప్రత్యామ్నాయ వేదికగా చూస్తున్న జనం ఇప్పుడు జియో పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నెలా 700 మిలియన్ల వినియోగదారులు వాట్సప్‌ని వాడుతుండడంతో.. ఒకదశలో వాట్సప్‌ని రీచ్ అవడం సాధ్యమా అనే సందేహం కలిగేది. మొదట్లో ప్రపంచ వ్యాప్తంగా ఎవరితోనైనా ఉచితంగా అనుసంధానం చేసేందుకు వాట్సప్ ఏకైక యాప్ ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని జియో భర్తీ చేస్తూ ముందుకు వచ్చింది.

ఆండ్రాయిడ్, ఐఎస్‌ఓ డివైస్‌ల్లో పనిచేసేలా రూపొందించిన ఈ మొబైల్ అప్లిషన్ తక్కువ సమయంలోనే వినియోగదారుల మన్ననలు పొందింది. ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్‌లో 4. 5ప్లస్ రేటింగ్ సాధించడం విశేషం. వాట్సప్‌తో పోల్చితే జియో అదనపు ఆప్షన్స్ ఉండడం విశేషం. అంతేకాదు.. ఇంటర్‌ఫేస్ వాట్సప్‌తో పోల్చితే మరింత క్లారిటీ ఉండడం గమనార్హం. అన్నింటికంటే.. మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్ కలిగి ఉండడం వల్ల భారతీయ వినియోగదారులు ఎక్కువగా ఇప్పుడు జియో వైపు ఆసక్తి చూపుతున్నారు.

ఘనంగా డా. బి. ఆర్‌. అంబేడ్కర్‌ 124వ జయంతి వేడుకలు

ఘనంగా డా. బి. ఆర్‌. అంబేడ్కర్‌ 124వ జయంతి వేడుకలు

రెబ్బెన లో డా. బిఆర్‌ అంబేడ్కర్‌ 124వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల 
కేంద్రంలోని తహసీల్ధార్‌ కార్యాలయంలో మంగళవారం డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. 
అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో తహసీల్ధార్‌ జగదీశ్వరి  ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

రెబ్బెన గ్రామ పంచాయితీడా. బిఆర్‌ అంబేడ్కర్‌ 124వ జయంతి వేడుక

రెబ్బెన గ్రామ పంచాయితీలో జరిగిన కార్యక్రమంలో రెబ్బెన గ్రామ సర్పంచ్ పెసరి వెంకటమ్మ, ఉప సర్పంచ్ బొమ్మినేని  శ్రీధర్, బొంగు శ్రీనివాస్, శ్రీధర్, శంకర్, శారద, తిరుపతమ్మమరియు  గ్రామస్తులు పాల్గొన్నారు.

నారాయణపూర్ యువజన సంఘం అధ్వర్యంలో ఘనంగా  ర్యాలీ 
డా. బిఆర్‌ అంబేడ్కర్‌ 124వ జయంతి వేడుకల సందర్భంగా నారాయణపూర్ యువజన సంఘం సభ్యులు నారాయణపూర్ నుండి రెబ్బెన మండల కేంద్రం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. తర్వాత మండల కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసారు. ఈ కార్యక్రమంలో నారాయణపూర్ యువజన సంఘం అద్యక్షులు దుర్గం మొండయ్య,రెబ్బెన మాజీ సర్పంచ్ దుర్గం హన్మంతు,దుర్గం లింగయ్య, పెరుగు తిరుపతి, శివ, రాజేశ్వర్, రవి, వెంకటేష్, మల్లేష్,సాయి కుమార్, సతీష్, మహేందర్,రామ్ చందర్,లక్ష్మన్,జడి శంకర్,జడి నారాయణ,మల్లక్క, శాలక్క, ప్రశాంత్, తుకారం, శ్యాం రావు, బాల కృష్ణ, మరియు సంఘం సభ్యులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

సంచలనం రేపిన యువతి దారుణ హత్య ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

సంచలనం రేపిన యువతి దారుణ హత్య ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన 


రెబ్బెన మండలం లోని  పాసిగాం  గ్రామానికి చెందిన వసాక శ్యామల (18) ఊరి చివర ఆటవీప్రాంతంలో దారుణ హత్యకు గురైయిందని తాండూర్  సి.ఐ రమేష్ బాబు సోమవారం తెలిపారు.  పాసిగామకు చెందిన శ్యామల గత నెల 28న రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో బయటకు వెళ్ళింది, తిరిగి ఇంటికి రాకపోయేసరికి ఆమె తండ్రి విజ్జు మేర ఇరుగు పొరుగు ఇళ్ళలో ఆరాతీసిన  తన జాడ తెలియకపోయేసరికి  31 న కుటుoబ సభ్యులు రెబ్బెన  పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశారని  తెలిపారు. సోమవారం పాసిగంకి రెండు కిలోమీటర్ల దూరంలోగల సుద్ద క్వారీ గుంతల సమీపంలో మేకల కాపర్లు దుర్వాసనని గమనించి స్థానిక సర్పంచ్ కి సమాచారమిచ్చారు. సర్పంచ్ గ్రామస్థులతో చూడగా యువతి మృతదేహం కనిపించింది. మృతదేహం ఫై ఉన్న దుస్తులతో విజ్జుమేర తన కూతురుదేనని గుర్తించారు. వెంటనే సర్పంచ్ పోలీసులకు సమాచారమందిచారు. దీంతో బెల్లంపల్లి డి ఎస్ ఫై  రమణా రెడ్డి, తాండూర్ సి ఐ రమేష్ బాబు, రెబ్బెన ఎస్ ఐ హనోక్ సంఘటనా స్థలికి చేరుకొని యువతి తండ్రిని,స్థానికులను అడిగి తెలుసుకున్నారు.  శ్యామలను ఓణి తో ఉరేసి చంపి ముఖం ఏర్పడకుండా పెద్ద రాయితో కొట్టి ఉంటారనే ఆనవాళ్ళు ఉన్నాయి. సంఘటనా స్థలాన్ని డాగ్ స్క్వాడ్ బృందం, క్లూస్ టీంలు వచ్చాయి. కేసు దర్యాప్తు చేస్తునాట్లు  తాండూర్ సి ఐ రమేష్ బాబు తెలిపారు . 

అభయహస్తం పించన్ల పంపిణి

                                          అభయహస్తం పించన్ల పంపిణి


 రెబ్బెన  మండలంలోని   అభయహస్తం పించన్ల  17 మందికి  రెబ్బెన జి పి కార్యాలయంలోని  యం పి పి  సంజీవ్ కుమార్  జెడ్ పి టి సి  అజ్మీర బాబురావు  సర్పంచ్ పెసరు వెంకటమ్మ  ఆధ్వర్యంలో నెలకు 500/- చొప్పున మొత్తం 3000/- రూ  17 మందికి   అభయహస్తం పించన్ల   పంపిణి చేసారు ఈ  కార్యక్రమంలో యం.పి.డి.ఓ.  యం. ఏ.  హలీమ్ వైస్  యం.పి. పి. గోడిసేలా రేణుక ఉప సర్పంచ్ శ్రీధర్ ఏ.పి.యం. రాజ్ కుమార్ సింగిల్ విండో డైరెక్టర్ మదునయ్య సెక్రటరీ రవి లు పాల్గొన్నారు.  
  

మాదిగల నిరసన పోరు పోస్టర్ ఆవిష్కరణ

మాదిగల నిరసన పోరు పోస్టర్ ఆవిష్కరణ 



రెబ్బెన : ఏప్రిల్ 12 (వుదయం ప్రతినిధి) రెబ్బన మండలంలోని మాదిగల నిరసన పోరు ఏప్రిల్ 5 నుండి ఏప్రిల్ 14 వరకు జరుగు నిరసన ప్రదర్శన - ధర్నాలు-రాస్తారోకోలు సంభందించిన పోస్టర్ను          యం అర్ పి స్  మండల అద్యక్షుడు బొంగు నరసింగ రావు, మండల కార్యదర్శి   నర్సింహులు, మండల అధికార  ప్రతినిధి గోగార్ల రాజేష్, గ్రామా అధ్యక్షులు రొడ్డ శంకర్ వారి పోస్టర్ ను ఆవిష్కరించారు.
 దళితున్ని ముఖ్యమంత్రి   చేయాలి, మాదిగలకు, మాలలకు మంత్రి వర్గంలో ప్రాతినిద్యం కల్పించాలి, దళితుల సంక్షేమాన్ని చూసే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి
దళితులకు భూ పంపిణి చేయాలి,  అంబేద్కార్,జగ్జీవన్ రామ్ ల జయంతి ఉత్సవాల కమిటి చైర్మన్  గా  దళితున్ని నియమించాలి డిమాండ్‌ చేశారు. కార్యక్రమం లో   యం అర్ పి స్ కార్యకర్తలు పి . వినెయ్, పి ఆయిలు, జి నగేష్,  రమేష్ , గణేష, తుఖరం రాజిఖ సంఘ అద్యక్షుడు శంకర్,  తే ధ పా నాయకులూ మోడం రాజ గౌడ్  నాగరాజు  నాయాకులు మద్దత్తు  తెలిపారు  

నంబల శివాలాయం లో హైకోర్ట్ న్యాయమూర్తుల ప్రత్యేక పూజలు

నంబల  శివాలాయం లో హైకోర్ట్ న్యాయమూర్తుల  ప్రత్యేక పూజలు


రెబ్బెన: ఏప్రిల్ 11 (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల నంబల గ్రామం లోని ప్రసన్న పరమేశ్వర శివాలయంను శనివారం రోజు హైకోర్ట్ న్యాయమూర్తులు  జస్టిస్ జి. చంద్రయ్య , జస్టిస్ ఎమ్. సీతారామ మూర్తి, జిల్లాన్యాయమూర్తి జస్టిస్ గ్రంది గోపాలకృష్ణ మూర్తి గార్లు  దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆస్సిసులు అందుకొన్నారు .   ఈ సందర్భంగా ఆలయ కమిటి సభ్యులు  నంబల గ్రామా సర్పంచ్ శ్రీమతి జి.సుశీల పూలమాల తో  వారికి ఘన స్వాగతం పలికారు, దేవాలయ అభివృద్ధి కొరకు ఒక వినతి పత్రం అందజేసారు, ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ సబ్-కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, బెల్లంపల్లి డి.ఎస్.పి. రమణా రెడ్డి రెబ్బెన సబ్ ఇనస్పెక్టర్ హనుక్ మరియు మండల నాయకులూ మోడెమ్ సుదర్శన్ గౌడ్, బొమ్మినేని శ్రీధర్ కుమార్, కొవ్వూరి శ్రీనివాస్ ,పాలుగోన్నారు  



ట్రాక్టర్ బోల్తాపడి ఒకరి  మృతి 

రెబ్బెన: ఏప్రిల్ 11 (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రం లోని జూనియర్ కళాశాల దగ్గర శనివారం ఉదయం ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడి ఇటుక బట్టిలో పని చేస్తున కూలి బట్టి మహేందర్ (30) పెగడపల్లి వాసి అక్కడిక్కడే మృతి చెందాడు మరియు ట్రాక్టర్ డ్రైవర్ రాజు కు తీవ్రగాయాలు అయ్యాయి,  ట్రాక్టర్ డ్రైవర్ ఎదురుగా వస్తున్నా లారీని  తప్పియ్య బోయి అనుకోకుండా ట్రాలీ లిఫ్ట్ జాక్ పైకి లేవడం తో ప్రమాదం జరిగినట్టు రెబ్బెన ఎస్.ఐ. హనుక్ తెలిపారు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్.ఐ. హనుక్ తెలిపారు.  

మహాత్మా జ్యోతి రావు పులే 189వ  జయంతి 
రెబ్బెన: ఏప్రిల్ 11 (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రం లో ని మండల పరిషద్ కార్యాలయములో  మహాత్మా జ్యోతి రావు పులే 189వ  జయంతి ని ఘనంగా జరిపారు, ఈ కార్యక్రమం లో జెడ్.పి.టి.సి. బాబురావు ఎమ్.పి.పి. సంజీవ్ కుమార్  సర్పంచ్ పెసర వెంకటమ్మ,  ఎమ్.పి.టి.సి.లు గోడిసేలా రేణుక, కొవ్వూరి శ్రీనివాస్, వనజ మరియు ఇతర నాయకులూ మదనయ్య, చిరంజీవి పాలుగోన్నారు.     


రాష్ట్ర మేదరి మహాసభలను గోడా పత్రిక విడుదల

రాష్ట్ర మేదరి మహాసభలను గోడా పత్రిక విడుదల 

 రెబ్బెన : ఏప్రిల్ 9 (వుదయం ప్రతినిధి) తెలంగాణా రాష్ట్ర మేదరి సంఘం రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారిగా నిర్వహిస్తున మహాసభ కు సంబదించిన గోడా పత్రిక ను రెబ్బెన మండలం లోని మేదరి కుల సంఘం  నాయకులూ గురువారం రోజు  విడుదల చేసారు,  ఈ  నెల 19వ తేది ఆదివారం నాడు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగు భారీ మహాసభను విజయవంతం చేయాలనీ, మరియు అనేక సవత్సరముల నుండి గత ప్రభుత్వాలకు తమ  సమస్యలను విన్నవించుకొవడమైనదని, కానీ స్వల్ప సంఖ్యాకులమైన తమని ఏ ప్రభుత్వము కూడా గుర్తించలేదు తమ డిమాండ్ల పరిష్కారానికి ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్టు మండల మేదరి కుల సంఘం అధ్యక్షుడు అలిపిరెడ్డి రాజమల్లు చెప్పారు, వారితో పాటు  రాజ కనకయ్య, సత్తయ్య, శ్రీనివాస్, తిరుపతి, లక్ష్మినరయన, చంద్రమోహన్ మరియు తదితర నాయకులూ ఈ కార్యక్రమం లో పాలుగోన్నారు, 

తెలంగాణా అమరావీరునునికి ఘానా నివాళి

తెలంగాణా అమరావీరునునికి ఘానా నివాళి 

రెబ్బెన మండల కేంద్రం లోని తల్లపెల్లి వేణుకుమార్ గౌడ్ తెలంగాణా కోసం ఆత్మ బలిదానం చేసుకొని మూడు  సంవత్సరాలు గడిచిన సందర్బంగా, ఆ  అమరావీరుని 3వ వర్ధంతిని రెబ్బెన తెలంగాణా ఐ.కా.స. సంఘం వారు గణంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులకు పండ్లూ పంపిణి చేశారు,  పాలువురు నాయకులూ వేణుకుమార్ గౌడ్ తెలంగాణా కోసం ప్రాణ త్యాగం చేసుకోవడాన్ని గుర్తుచేసుకొని కంట తడిపెట్టుకున్నారు,  ఈ కార్యక్రమంలో రెబ్బెన మండల తహసిల్దార్ జగదీశ్వరి, రెబ్బెన మండల అధ్యకుడు సంజీవ్ కుమార్, రెబ్బెన సర్పంచ్ వెంకటమ్మ, ఉప-సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్, తె.రా.స.  నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ జైస్వాల్ కుమార్, వెంకటేశ్వర్ గౌడ్, చిరంజీవి గౌడ్, శంకరమ్మ,వేకన్నగౌడ్, తే.ద.పా. నాయకులూ మోడెమ్ సుదర్శన్ గౌడ్,  రాజగౌడ్ , నరసింగరావు, కాంగ్రెస్ నాయకుడు  దుర్గం హన్మంతు మరియు వేణు కుమార్ గౌడ్ తండ్రి  ప్రభాకర్ గౌడ్ పాలుగోన్నారు. 


మిషన్ కాకతీయ లో ఎల్లమ్మ చెరువు ముంపు భాదితుల ఆవేదన

మిషన్ కాకతీయ లో ఎల్లమ్మ చెరువు ముంపు భాదితుల ఆవేదన 

 రెబ్బెన : ఏప్రిల్ 7 (వుదయం ప్రతినిధి) మిషన్ కాకతీయ లో భాగంగా రెబ్బెన మండలంలోని ఎల్లమ్మ చెరువు పునరుద్ధరణ కార్యక్రమం వలన ముంపునకు దాదాపు 15 కుటుంబాల చిన్నకారు రైతులు తమ పట్టా భూములను కోల్పోతున్నారు. ఈ కుటుంబాలకు వ్యవసాయమే ప్రధానధారం. ఈ రోజు ఈ రైతు కుటుంబాల వారందరూ తమ భాదను రెబ్బెన మండల తహసిల్దారుకి వినతి పత్రం రూపంలో సమర్పించారు. తమకు ఈ భూమే జీవనాధారమని రెబ్బెన లో భూముల ధరలు చాల ఎక్కువ ఉన్నాయని అందువల్ల తమకు మార్కెట్ ధరల ప్రకారం నష్ట పరిహారం ఇప్పించాలని వారు ఈ వినతి పత్రంలో తెలియచేసారు. వినతి పత్రం సమర్పించిన వారిలో మోడెం సుదర్శన్ గౌడ్, మోడెం  సర్వేశ్వర్ గౌడ్, మోడెం వెంకటేశ్వర గౌడ్, మోడెం తిరుపతి గౌడ్ తదితరులు ఉన్నారు. 

ఉపాదీ హామీ చట్ట రక్షణకోసం జీపు యాత్ర

                        ఉపాదీ హామీ చట్ట రక్షణకోసం జీపు యాత్ర  
                                                         
 

రెబ్బెన : ఏప్రిల్ 5 (వుదయం ప్రతినిధి): ఉపాధి హామీ పతకాన్ని పకడ్బందిగా అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన  జీపు జాత  ఆదివారం రెబ్బెన కు చేరుకుంది స్థానిక రెబ్బెన ఆర్&బి  భవనం వద్ద వ్యవసాయ శాక జిల్లా కార్యదర్శి ఎస్. సత్యనారాయణ ఉపన్యాసం ఇచ్చారు ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుందన్నారు పని దినాలు 200 రోజులకు ప్రతి రోజు రూ. 300 ఇవ్వాలని, ఉపాధి మెట్లకు పారితోషికం రూ . 6 ఇవ్వాలి ఉపాధి సిబ్బందికి వేతనాలు పెంచాలి ఉద్యోగ భద్రత కల్పించాలి  పోడు భూములకు పట్టలివ్వాలి ఈ భూముల అభివృద్ధి ఉపాధి నిధులు కేటాయించాలి ఉపాధిలో అవినీతి చర్యలు అరికట్టాలి ఉపాధి చట్టాన్ని బలహీనపరిచే కేంద్ర బి.జే.పి.ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించాలి ఉపాధి కొందరికే కాదు అందరికి ఇవ్వాలి. అని డిమాండ్ చేసారు ఈ యాత్ర ఏప్రిల్ 4 నుంచి 11 వరకు కొనసాగుతుంది ఈ నెల 11 న హైదరాబాద్ లో భారి ధర్నా కొనసాగుతుంది.అని  వ్యవసాయ శాక జిల్లా కార్యదర్శి ఎస్. సత్యనారాయణ తెలిపారు.ఆయనతో పాటు ఆసిఫాబాద్ డివిసన్ కార్యదర్శి బి.ప్రకాష్,వినోద్,ప్రణయి,తదితరులు పాల్గొన్నారు. 

ఘనంగా బాబు జగజ్జీవన్ జయంతి

                          ఘనంగా బాబు  జగజ్జీవన్ జయంతి


1, బాబు  జగజ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాలలు వేస్తున్న యం.పి.పి. సంజీవ్ కుమార్
 


2, తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా బాబు  జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. 





                                       ఘనంగా బాబు  జగజ్జీవన్ జయంతి 
మాజి ఉప ప్రధాని బాబు  జగజ్జీవన్ రామ్   108 వ జయంతి నీ పునస్కరించుకుని ఆదివారం రోజు  యం.పి.డి.ఓ మరియు తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు అవి పేదరిక దళిత కుటుంబాలలో పుట్టి భారత ఉప ప్రధాని స్థాయి వరకు ఎదిగి దళితులకు ఎన్నో సేవలు అందించిన ఆయన చిరస్మరనియుడు కొనియాడారు ముందుగా యం.పి. డి.  ఓ.  కార్యాలయంలో యం.పి.పి. సంజీవ్ కుమార్ బాబు  జగజ్జీవన్ రామ్  చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా  నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జగదీశ్వరి, యం.పి.డి.ఓ. యం ఏ  హలీమ్, సర్పంచ్ పెసరు వెంకటమ్మ, ఉప సర్పంచ్ శ్రీధర్, సింగిల్ విండో డైరెక్టర్ మదునయ్య, ఏ.పి.యం.  రాజకుమార్,  సయ్యద్ జాకీర్, టీ.డి.పి.  మండల అధ్యక్షుడు మోడెం సుదర్శన్ గౌడ్, టి.అర్.ఏస్,తూర్పు జిల్లా అధ్యక్షుడు నవీన్ జైస్వాల్, మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ, వెంకటేశ్వర్ గౌడ్, యం.ఆర్.పి.యస్. మండల అధ్యక్షుడు బొంగు నర్సింగరావు,వెంకటరాజం, ఏ. ఐ. స్.ఫ్ డివిజన్ ప్రెసిడెంట్ గోగార్ల రాజేష్ ,  దుర్గందేవాజి, చిరంజీవి,  పట్టణ అధ్యక్షుడు రాపర్తి అశోక్, సాక్షర భారత్ మండల కో ఆర్డినేటర్ సాయి బాబా లతో పాటు పలువురు పాల్గొన్నారు 



హనుమాన్ జయంతి సందర్బంగా స్వీట్స్ పండ్ల పంపిణి

        హనుమాన్ జయంతి సందర్బంగా స్వీట్స్ పండ్ల పంపిణి 

రెబ్బెన : ఏప్రిల్ 4 (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రం లోగంగాపూర్ యందు  కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం  లో   బాలికలకి స్వీట్లు పండ్లు పంపిణి హనుమాన్ జయంతి స్సందర్బంగా గంగాపూర్  యందు స్వీట్లు పండ్లు పంపిణి చేయడం జరిగింది హనుమాన్ యూత్  అద్వర్యం లో జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు  తహసిల్దార్ జగదీశ్వర ఎమ్.పి.డి. ఓ.  ఎమ్.ఎ. హలీమ యం.ఇ.ఒ   మహేశ్వర్ రెడ్డి ,మోడెమ్ సుదర్శన్ గౌడ్, జాకీర్ ఉస్మని, తోట రమేష్,   ఏ. ఐ. స్.ఫ్  డివిజన్ ప్రెసిడెంట్ గోగార్ల రాజేష్ , ప్రిన్సిపాల్ సుమలత విద్యర్దినిలు  పాల్గొన్నారు  



ఇంద్ర ధనుష్ ఫై అవగాహన

ఇంద్ర ధనుష్ ఫై అవగాహన  
ఇంద్ర ధనుష్ ఫై అవగాహన  
రెబ్బెన : ఏప్రిల్ 2 (వుదయం ప్రతినిధి) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంద్ర ధనుష్, ఆర్మీ రిక్రూట్ మెంట్ పారిశుద్యo  పై   పథకాలఫై వైద్య,ఆరోగ్య శాఖ సిబ్బంది కృషి చేయాలని  ఎమ్.పి.డి. ఓ.  ఎమ్.ఎ. హలీమ్, తహసిల్దార్ జగదీశ్వరి లు అన్నారు.  బుధవారం ఎమ్.పి.డి. ఓ. కార్యాలయం లో అంగన్ వాడి, ఐ.కె.పి.  సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్స్ లకు ఇంద్రధనుష్, ఆర్మీ రిక్రూట్ మెంట్ ఫై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏప్రిల్ 7 న ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని ప్రారంభించనుందన్నారు.  0 నుంచి రెండేళ్లలోపు చిన్నారులను పలు రకాల ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడడానికి ఇమ్యునైజేషన్ చేపట్టాలన్నారు. ఈ అవగాహన సదస్సులో ఎమ్.పి.డి. ఓ.  ఎమ్.ఎ. హలీమ్, తహసిల్దార్ జగదీశ్వరి,ఎ.పి.ఎమ్. రాజ్ కుమార్, ఎ.ఓ. మంజుల, వైద్య,ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్ వాడి, ఐ.కె.పి.  సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు. 

రెబ్బెన లో ఆంధ్రాబ్యాంక్ నుతనశాఖ ప్రారంభం.

రెబ్బెన లో ఆంధ్రాబ్యాంక్ నుతనశాఖ ప్రారంభం. 
 రెబ్బెన : మార్చి 30(వుదయం ప్రతినిధి)    ఆంధ్రాబ్యాంక్ కరీంనగర్ జోన్ లో ఆంధ్రాబ్యాంక్ 93వ శాఖను రెబ్బెన మండల కేంద్రం లో సోమవారం రోజు ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు, పార్లమెంటరి సెక్రెటరి శ్రీమతి కోవా లక్ష్మి గారు మరియు బెల్లంపల్లి శాసన సభ్యులు దుర్గం చిన్నయ్య గారు,  ఆదిలాబాద్ తూర్పు జిల్లా టి.అర్.ఎస్. అద్యక్షులు పురాణం సతీష్గారు, ప్రారంభించారు, ఈ సంధర్బంగా జోనల మేనేజర్ శ్రీ ఎ. సత్యనారాయణ గారు మాట్లాడుతూ కరీంనగర్ జోన్ లో ఆంధ్రాబ్యాంక్ బ్యాంక్   93 శాఖలతో విస్తరించిదని,  కరీంనగర్ జోన్ లో రూ . 6300 కోట్లతో వ్యాపారం చేస్తునట్లు, 100 శాఖలు గా విస్తరించి రూ . 8000 కోట్ల వ్యాపారం లక్ష్యాని సాదించడానికి కృషి చేస్తునట్లు చెప్పారు. 

              పార్లమెంటరి సెక్రెటరి / వ్యవసాయ శాఖా సహాయ మంత్రి శ్రీమతి కోవా లక్ష్మి గారు మాట్లాడుతూ రైతులకు వడ్డి లేని రుణాలను మరియు మహిళలకు పావలా  వడ్డీకి డ్వాక్ర రుణాలు మంజూరు చెయ్యాలని బ్యాంక్ మానేజర్ గారిని కోరారు.  బెల్లంపల్లి శాసన సభ్యులుదుర్గం చిన్నయ్య గారు మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాది అవకాశాల కొరకు రుణ సదుపాయం చెయ్యాలని కోరారు.  
రెబ్బెన తహసిల్దార్ జగదీశ్వరి గారు , M P T O,A P M , రెబ్బెన సర్పంచ్ పెసరి వెంకటమ్మ , మండల వైస్ ప్రసిడెంట్ గొడిసెల రేణుక,,  మరియు ఇతర టి.అర్.ఎస్. నాయకులు ,మండలం లోని ఇతర సర్పంచులు మరియు ఎం.పి.టి.సి,లు కూడా   తదితరులు పాలుగొన్నరు

ల్యాబ్ టెక్నీషియన్ కి పోస్టులు బర్తికి దరకస్తులు ఆహ్వానం

                        ల్యాబ్ టెక్నీషియన్ కి పోస్టులు బర్తికి దరకస్తులు ఆహ్వానం                                                                                                                                                                                                                                    గోల్లేటి మరియు బెల్లంపల్లి, మాదారం  ప్రాంతంలో  నివసించే కార్మికుల నిరుద్యోగ యువతీ,యువకులు కాంట్రాక్టు పద్దతిలో  ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేయుటకు ఆసక్తి అర్హత కలిగిన అబ్యర్థులు ఈ నెల 16 వరకు   జీ యం  కార్యాలయంలో పర్సనల్ డిపార్టుమెంటు సెక్షన్ లో తమ విద్యర్యత సర్టిఫికేట్ లతో జత చేసిన దరకస్తులు అందచేయాలి  డి యు మ్ చిత్త  రంజన్ కుమార్ పెర్సనల్ ప్రకటన తెలిపారు విద్యర్యతలు  యస్. యస్. సి.  పాసయి ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. 

వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణం

వైభవంగా  శ్రీ సీతారామ కళ్యాణం 
శ్రీ రామ నవమిని పురస్కరించుకొని రెబ్బెన మండల కేంద్రంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శనివారం సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా జరిగింది . ముందుగా  దుర్గాదేవి ఆలయం నుండి ఉత్సవ విగ్రహాలు కమిటీ అధ్యక్షులు  గంటుమేర అధ్యక్షతన ఊరేగింపుగా  సీతారామ ఆలయంలోనికి తీసుకువచ్చి కళ్యాణోత్సవం జరిపించారు. ఈ కళ్యాణోత్సవానికి గ్రామ పంచాయత్ సర్పంచ్ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకలు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామునుంచే  భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.  ఆలయ కమిటీ  ఆద్వ్యర్యంలో  అన్నదానం ఏర్పాటు చేశారు.

ఆలయ అభివృద్దికి  తోడ్పడుతా
రెబ్బెన మండలకేంద్రంలో గల సీతారామంజనేయ స్వామి ఆలయ అభివృద్దికి తనవంతు  సహకారం అందిస్తానని ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు మరియు పార్లమెంటరీ కార్యదర్శి శ్రీమతి కోవా లక్ష్మి గారు తెలియచెసారు. శనివారం  శ్రీ రామనవమిని పురష్కరించుకొని రెబ్బెనకు వచ్చి శ్రీ సీతారామ కళ్యాణోత్సవంలో  పాల్గొని ప్రత్యేక పూజలు జరిపించిన తర్వాత ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. 

గంగాపుర్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా...
రెబ్బెన మండలం లోని గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి మాఘ శుద్ధ పౌర్ణమి నాడు భారీ ఎత్తున జాతర జరుగుతుంది ఇంత ఘన చరిత్ర కల్గిన గంగాపూర్ అభివృద్దిలో వెనకబడింది.దీని చరిత్ర గురించి ముఖ్యమంత్రికి వివరించి ఆయనను గంగాపూర్ కు తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని మరో తిరుపతిగా  తీర్చిదిద్దేందుకు తన శక్తిమేరకు కృషి చేస్తానని స్థానిక శాసన సభ్యురాలు కోవా లక్ష్మి గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో   ఎం.పి.పి.   సంజీవ్,  వైస్ ఎం.పి.పి. గుడిసెల రేణుక, సర్పంచ్ పెసర వెంకటమ్మ, ఉప సర్పంచ్  బొమ్మినేని శ్రీధర్, జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ జైస్వాల్, ఆలయ కమిటి సభ్యులు గంటుమేర, శంకరమ్మ, సుదర్శన్ గౌడ్, సోమ శేఖర్, మరియు నాయకులు మోడెం  చిరంజీవి గౌడ్, వెంకటేశ్వర గౌడ్, ప్రవీణ్ కుమార్, కార్నాథం పెంటయ్య   గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మిషన్ కాకతీయతో చేరువుల అభివృద్ధి

మిషన్ కాకతీయతో చేరువుల  అభివృద్ధి 

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం తో చెరువులు అభివృద్ది చేసేందుకు కంకణం కట్టుకున్నది రెబ్బెన జెద్.పి.టి. సి. బాబురావు, రెబ్బెన ఎమ్.పి.పి. సంజీవ్ కుమార్ అన్నారు. బుదవారం రెబ్బెన మండలం లోని నంబాల, పులికుంట, కొమరవెల్లి, జక్కులపల్లి గ్రామంలోని  చెరువుల మరమత్తులకు మిషన్ కాకతీయ నిధులతో చేపట్టనున్న, టి. ఆర్. ఎస్ .  రైతుల సంక్షేమం కోసం చెరువుల అభివృద్ధి పూర్తి చేసే లక్షముతో నిధులు మంజూరు చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో నంబాల సర్పంచ్ గజ్జెల సుశీల, ఎమ్.పి.టి.సి. శ్రీనివాస్,ఎమ్.పి.టి.సి మంగ, సింగల్ విండో చైర్మన్ సత్యనారాయణ,సోమశేఖర్,భీమేశ్,శ్రీధర్ రెడ్డి, డి.ఈ. సాయి బాబా, ఎ.ఈ.ఈ.రాజులతో  పాటు పలువురు నాయకులు ప్రజలు పాల్గొన్నారు. 

వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణం

వైభవంగా  శ్రీ సీతారామ కళ్యాణం 
శ్రీ రామ నవమిని పురస్కరించుకొని రెబ్బెన మండల కేంద్రంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శనివారం సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా జరిగింది . ముందుగా  దుర్గాదేవి ఆలయం నుండి ఉత్సవ విగ్రహాలు కమిటీ అధ్యక్షులు  గంటుమేర అధ్యక్షతన ఊరేగింపుగా  సీతారామ ఆలయంలోనికి తీసుకువచ్చి కళ్యాణోత్సవం జరిపించారు. ఈ కళ్యాణోత్సవానికి గ్రామ పంచాయత్ సర్పంచ్ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకలు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామునుంచే  భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.  ఆలయ కమిటీ  ఆద్వ్యర్యంలో  అన్నదానం ఏర్పాటు చేశారు. 

ఆలయ అభివృద్దికి  తోడ్పడుతా
రెబ్బెన మండలకేంద్రంలో గల సీతారామంజనేయ స్వామి ఆలయ అభివృద్దికి తనవంతు  సహకారం అందిస్తానని ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు మరియు పార్లమెంటరీ కార్యదర్శి శ్రీమతి కోవా లక్ష్మి గారు తెలియచెసారు. శనివారం  శ్రీ రామనవమిని పురష్కరించుకొని రెబ్బెనకు వచ్చి శ్రీ సీతారామ కళ్యాణోత్సవంలో  పాల్గొని ప్రత్యేక పూజలు జరిపించిన తర్వాత ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. 

గంగాపుర్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా...
రెబ్బెన మండలం లోని గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి మాఘ శుద్ధ పౌర్ణమి నాడు భారీ ఎత్తున జాతర జరుగుతుంది ఇంత ఘన చరిత్ర కల్గిన గంగాపూర్ అభివృద్దిలో వెనకబడింది.దీని చరిత్ర గురించి ముఖ్యమంత్రికి వివరించి ఆయనను గంగాపూర్ కు తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని మరో తిరుపతిగా  తీర్చిదిద్దేందుకు తన శక్తిమేరకు కృషి చేస్తానని స్థానిక శాసన సభ్యురాలు కోవా లక్ష్మి గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో   ఎం.పి.పి.   సంజీవ్,  వైస్ ఎం.పి.పి. గుడిసెల రేణుక, సర్పంచ్ పెసర వెంకటమ్మ, ఉప సర్పంచ్  బొమ్మినేని శ్రీధర్, జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ జైస్వాల్, ఆలయ కమిటి సభ్యులు గంటుమేర, శంకరమ్మ, సుదర్శన్ గౌడ్, సోమ శేఖర్, మరియు నాయకులు మోడెం  చిరంజీవి గౌడ్, వెంకటేశ్వర గౌడ్, ప్రవీణ్ కుమార్, కార్నాథం పెంటయ్య   గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

  

కొత్తగా నిర్మిస్తున్నా సైడ్ డ్రైనెజ్

కొత్తగా నిర్మిస్తున్నా సైడ్ డ్రైనెజ్
రెబ్బెన : మార్చి 27(వుదయం ప్రతినిధి) ్రెబ్బెన మండలంలొని ఎన్.టి.అర్. నగర్ లొ కొత్తగా నిర్మిస్తున్నా సైడ్ డ్రైనెజ్ పనులకు రెబ్బెన సర్పంచ్ పెసరి వెంకటమ్మ భుమి పూజ నిర్వహించారు, అమె వెంట మండల వైస్ ప్రసిడెంట్ గొడిసెల రేణుక, రెబ్బెన ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కూమర్, టి.అర్.ఎస్. జిల్లా ఉప అధ్యక్షుడు నవిన్ కూమర్ మరియు ఇతర టి.అర్.ఎస్. నాయకులు మదనయ్య, చిరంజీవి, ప్రవీన్ కూమర్ తదితరులు పాలుగొన్నరు.

Thursday, March 26, 2015

శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవం




శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవం కు ఏర్పాట్లు పూర్తి 


శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే |

సహస్రనామ తత్యుల్యం రామనామవరాననే ||


 రెబ్బెన : మార్చి 15(వుదయం ప్రతినిధి) ఈ నెల 28న జరిగే  శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవం  గనంగా జరపుటకు ఆలయ కమటి భారి ఏర్పాట్లు చేస్తుంది అని ఇటివల ఏర్పడిన నూతన ఆలయ కమిటి అధ్యక్షులు ఎల్.గంటుమేర గారు తెలిపారు, ఆలయానికి శాస్వత చందాదారులను ఏర్పాటు చేసుకొని ధూప దీప నైవేద్యాలను ప్రతి రోజు జరుపుటకు నిర్ణయించినది, ఈ  నెల 28 న జరిగే స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి మండలం లోని భక్తులు బారీగా తరలివచ్చే ఆవకాశం ఉన్నట్టు, వచ్చే భక్తుల కోసం అన్నదాన   కార్యక్రమం తదితర ఏర్పాట్లు చేస్తునట్టు ఆలయ ప్రధాన కార్యదర్శి శ్రీ మోడెం సుధర్శన గౌడ్ గారు తెలిపారు.


   

Monday, March 16, 2015

శ్రీలంక క్రికెట్టీం కు మేలుకువులు నేర్పిన అ దేశ ప్రాదని


వన్డే వరల్డ్ కప్ క్రికెట్ లో లీగ్ దశ ముగిసి నాకౌట్ కు చేరుకుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆడే దేశాల అభిమానులు, దేశాదినేతలు తమ దేశజట్టు బాగా ఆడి విజయం సాధించాలని కోరుకుంటున్నారు . అయితే అందుకు విరుద్ధంగా శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే మాత్రం లంక క్రికెటర్లకు హెచ్చరికలు జారీచేశారు.
మార్చి 18వ తేదీన తొలి క్వార్టర్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో శ్రీలంక తలపడనుంది. ఆ రోజు జరిగే మ్యాచ్ పై దృష్టి పెట్టాలని విక్రమ్ సింఘే హెచ్చరిక చేశారు. ముఖ్యంగా భీకరమైన ఫామ్ లో ఉన్న దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ఎంత తొందరగా పెవిలియన్ కు పంపిస్తే అంతమంచిది అని హెచ్చరించాడు. అతనిపై శ్రీలంక ఆటగాళ్ల దృష్టి పెట్టాలని సూచన చేశాడు
దక్షిణాఫ్రికాను ఓడించే సత్తా శ్రీలంకకు ఉందని రణిల్ విక్రమ్ పునరుద్గాటించారు.

Sunday, March 15, 2015

వ్యవసాయం లో తెలంగాణా రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలుస్తుంది: పార్లమెంటరీ సెక్రెటరీ కోవా లక్ష్మి


వ్యవసాయం లో తెలంగాణా రాష్ట్రం  దేశంలో అగ్రగామిగా నిలుస్తుంది: పార్లమెంటరీ  సెక్రెటరీ  కోవా లక్ష్మి 
 రెబ్బెన : మార్చి 15(వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల గోలేటి లో గల "మన్నేపల్లి చెరువు" ను మిషన్ కాకతీయలో బాగంగా  పనులను ఆదివారం పార్లమెంట్ సెక్రెటరి కోవా లక్ష్మి ప్రారంబిచారు ఈ చెరువు వలన సుమారు 130 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది దీనికోసం రూ.  39.40 లక్షల నిధులు మంజూరు అయినట్టు ఆమె తెలిపారు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెపడుతూన్న మిషన్ కాకతీయ పథకం వలన తెలంగాణా రాష్ట్రం వ్యవసయంగా దేశం లో అగ్రగామిగా, పయనిస్తూ పేదరికం లో మగ్గుతున్న రైతులకు జీవనొపాది కలిగించడమే  దీని ముఖ్యోదేసం అని ఆమె తెలిపారు, కోవా లక్ష్మి వెంట ఆదిలాబాద్ తూర్పు జిల్లా టి.అర్.ఎస్. అద్యక్షులు పురాణం సతీష్, జెడ్.పి.టి. సి. అజ్మీర బాబురావు ఏం.పి.పి. సంజీవ్ కుమార్ గోలేటి సర్పంచ్ తోట లక్ష్మణ్ తోపాటు మండలం లోని ఇతర సర్పంచులు మరియు ఎం.పి.టి.సి,లు కూడా పాల్గొన్నారు.