Saturday, July 19, 2014

నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి.....భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి. పశ్చిమ రాజస్థాన్, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలకు విస్తరించిన రుతుపవనాలు.. రెండు రోజులు ఆలస్యంగా ఉత్తర అరేబియా సముద్ర ప్రాంతానికి చేరుకున్నాయి. దీంతో దేశమంతా నైరుతి రుతుపవనాలు విస్తరించినట్టేనని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
రుతుపవనాల విస్తరణతో దేశంలోని ఉత్తరాది ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఎండ వేడిమి, ఉక్కపోత నుంచి ఢిల్లీ వాసులకు ఉపశమనం కలిగింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో.. భారీ వర్షాలు పడొచ్చనే హెచ్చరికలతో అధికారులు కేదార్ నాథ్ తో పాటు బద్రీనాథ్ యాత్రను నిలిపివేశారు.
మరోవైపు ఒడిషా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో రెండు మూడు రోజుల పాలు వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణాలోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. రెండు రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
రుతుపవనాల విస్తరణతో అనేక సమస్యలు తీరనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీరనుందని తెలిపారు.

చార్ థామ్ యాత్ర నిలిపివేత.............,


చార్ ధామ్ యాత్రను అధికారులు నిలిపివేశారు. వర్షాలు కురవడంతో, వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. మొత్తం ఆరు ఎన్ డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో తలమునకలయ్యాయి. గౌరీకుండ్ వద్ద చిక్కుకున్న 165 మంది యాత్రీకులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. కేదార్ నాథ్, బద్రీనాథ్ లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు ఎన్ డీఆర్ఎఫ్ చర్యలు తీసుకుంటోంది. 

అల్లు వారి వారసుడు అల్లు అయాన్......


తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ హాస్యనటుడు పద్మశ్రీ డా.అల్లురామలింగయ్య ఎన్నో వందల చిత్రాల్లో నటించి నవ్వుకు కేరాఫ్ అడ్రస్ గా మారిన విషయం తెలిసిందే. ఆయన వారసుడిగా పరిచయమై ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మిస్తూ తన నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ సంస్థ ప్రతిష్టను భారతదేశమంతా చాటిచెప్పారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. అల్లు వారి నట వారసుడిగా పరిచయమై తన స్టైలిష్ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్టైలిష్ స్టార్ గా చిరస్థాయిగా నిలబడిన అల్లు అర్జున్ ఇటీవలే తండ్రి అయిన విషయం  తెలిసిందే. అల్లు అర్జున్స్నేహా రెడ్డిల ముద్దుల తనయుడి పేరు అల్లు అయాన్. అభిమానులతో పాటు మీడియా కూడా అయాన్ ని చూసేందుకు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. రేసుగుర్రం ఆల్ టైం రికార్డ్స్ లో టాప్ చిత్రంగా నిలబడడంతో అభిమానులు పండగ చేసుకుంటున్న సందర్భంలో హీరో అల్లు అర్జున్ మెగాభిమానులకు స్పెషల్ గిఫ్ట్ గా అయాన్ ఫొటోను విడుదల చేశారు.

నేడే దక్షిణాఫ్రికా మహాత్ముడి జయంతి ....


నల్లసూరీడు, మడీబా.. నెల్సన్ మండేలా 96వ జన్మదినం నేడే...దక్షిణాఫ్రికాలో జాతివివక్షకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసిన నాయకుడు. ఆ దేశంలో ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నేత, దక్షిణాఫ్రికా మహాత్ముడు నెల్సన్ మండేలా...స్వాతంత్రపోరాటంలో ఓ మారణకాండకు సంబంధించి 27 సంవత్సరాల పాటు రోబెన్ అనే ద్వీపంలో జైలు శిక్షను అనుభవించారు. 20వ శతాబ్దపు అత్యంత సుప్రసిద్ద వరల్డ్ లీడర్స్ లో మండెలా ఒకరు. వర్ణ సమానత కోసం ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కుని తన జీవితాన్నే పణంగా పెట్టిన నేత నెల్సన్ మండేలా...శాంతియుత ఉద్యమంతో అనుకున్నది సాధించిన మడీబాకు 1993లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. గాంధేయ మార్గంలో జీవితాన్ని మలుచుకున్న తీరు  ఆయనకు దక్షిణాఫ్రికా గాంధీ అన్న గొప్పపేరు సాధించిపెట్టింది.

కింగ్ కోబ్రా సంరక్షణలో చంటిపాప...


ఒక్క కాటు పడితే పై ప్రాణాలు పైనే లేచిపోతాయి. అంతటి విషం కలిగిన కింగ్ కోబ్రా నాగరాజులు ఆ పాపపై పడగ విప్పి రక్షణ కలిగిస్తున్నాయి. దృశ్యం చూస్తే బెదిరిపోయేలా చేస్తుంది. కానీ ఏకారణంగానో ఆపాపను నాలుగు కింగ్ కోబ్రాలు రక్షిస్తున్నాయి. పాపను చక్కగా కాపలా కాస్తున్నాయింటే సరిగ్గా సరిపోతుంది. ఎవరయినా కాస్త ముందుకు వస్తే కాటేసేందుకు రెడీగా ఉన్నాయి. అవి ఎందుకలా చేస్తున్నాయో తెలియదు. భారత్ లో కనిపించే అయిదు మీటర్ల పొడవుండే కింగ్ కోబ్రాపాములని మాత్రం తెలుసు... ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో రాజ్యమేలుతోంది.

Sunday, July 13, 2014

పురుషులకు కూడా తప్పని లైగింక వేధింపులు


ఈ సంఘటన మిగిలిన అన్ని సంఘటల కంటే భిన్నమైంది. కార్పోరేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై వారి బాసులు లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు ఈ మధ్య కాలంలో తరచూ వెలుగు చూస్తున్నాయి. కాని ఇలా మహిళా బాసులు కూడా వేధింపులకు గురిచేస్తారు అన్న విషయం అందరికి షాక్ కు గురిచేస్తుంది. అందుకు నిదర్శనమే తాజాగా యాహూ సంస్థలో జరిగిన ఈ సంఘటన. తన మహిళా బాసు కోరికను తీర్చలేదన్న కారణంగా తనను వేధింపులకు గురి చేయడమే కాక తన ప్రోగ్రెస్ రిపోర్టులను కూడా నీరుగార్చేసిందని సంస్థకు చెందిన ఓ మహిళా ఉద్యోగి కాలిఫొర్నియా కోర్టులో కేసు దాఖలు చేసింది. వివరాల్లోకి వెళితే... అలైక్ అనే మొబైల్ కంపెనీని ప్రారంభించిన మారియా ఝాంగ్, ఆ తర్వాత తన కంపెనీని యాహూకు విక్రయించడంతో పాటు యాహూ మొబైల్ లో సీనియర్ డైరెక్టర్ గా విధుల్లో చేరిపోయారు. మారియా విభాగంలోనే ప్రిన్సిపల్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న నాన్ షిపై లైంగిక వేధింపులకు దిగారట. తనతో ఓరల్ సెక్స్ చేయాల్సిందిగా మారియా బలవంతపెట్టేదని, దీనిపై పర్సనల్ డిపార్ట్ మెంట్ కు ఫిర్యాదు చేసినా, సంస్థ పట్టించుకున్న పాపాన పోలేదని షి కోర్టుకు విన్నవించారు. ఇదిలా ఉంటే, మారియాపై వచ్చిన ఆరోపణలు సత్యదూరమని సంస్థ ప్రతినిధి కొట్టిపారేశారు. మారియా తరఫున న్యాయ పోరాటం సాగిస్తామని కూడా సంస్థ తెలిపింది. తన కోరిక తీర్చని కారణంగా మారియా 2013లో రెండు, మూడు త్రైమాసికాలకు సంబంధించిన తన ప్రోగ్రెస్ రిపోర్టులను నీరుగార్చిందని కూడా షి తన ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు దీర్ఘకాలం పాటు సెలవులో వెళ్లిన షి ని కంపెనీ ఆమె స్థానం నుంచి తప్పించింది.

Friday, July 11, 2014

టీఆర్ఎస్.. బిల్లు ఆమోదంపై అసంతృప్తి వ్యక్తం.......మా గొంతు నొక్కేశారు KCR



ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో సవరణలు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది. తెలంగాణఒడిషాచత్తీస్ గఢ్ ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపినా.. మూజువాణి పద్దతిలో బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు ఆమోదం లభ్యం కావడంతో.. పోలవరం ముంపు ప్రాంతాల్లోని 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ లో కలవనున్నాయి. భద్రాచలం మండలంలో భద్రాచలం పట్టణం మినహా అన్ని గ్రామాలు ఏపీలో కలవనున్నాయి.
 పోలవరం ఆర్డినెన్స్ ను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్.. బిల్లు ఆమోదంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రప్రభుత్వం మొండిగా వ్యవహరించిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. పోలవరం డిజైన్ మార్చాలని.. తాను గతంలోనే కేంద్రప్రభుత్వాన్ని కోరానని.. అయినా పట్టించుకోలేదన్నారు.
తమ ఎంపీలు ఎంత పోరాటం చేసినా కేంద్రం త‌మ‌కు ఉన్న మందబ‌లంతో త‌మ గొంతు నొక్కేసింద‌ని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం తో పాటు గా ఒరిస్సాచ‌త్తీస్ గ‌డ్ రాష్ట్రాల ప్ర‌జ‌ల ప్ర‌భుత్వాల మ‌నోభావాలను ప‌ట్టించుకోలేద‌ని అన్నారు.  తమ రాష్ట్ర హ‌క్కుల‌ను కాలరాశార‌ని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
 బిల్లుకు పార్లమెంట్ లో ఆమోదం లభించినప్పటికీ.. 7 మండలాలను కాపాడుకునేందుకు కార్యాచరణను ప్రభుత్వ పరంగా ఆలోచిస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. న్యాయ నిపుణులురాజ్యాంగ నిపుణులతో చర్చించి.. సుప్రీంకోర్టుకేళ్లే విషయంపై.. మంతనాలు జరుపుతున్నారు

Thursday, July 10, 2014

24 గంటల విద్యుత్ సరఫరా...ఆంధ్రప్రదేశ్ కు



కేంద్రం ప్రకటించిన 24 గంటల విద్యుత్ సరఫరా పథకంలో ఆంధ్రప్రదేశ్ ను ఎంపిక చేసినట్లు మంత్రి పల్లెరఘునాథరెడ్డి తెలిపారు. అలాగే ఈ ఏడాది కేంద్రం ఏపీకి 2 వేల మెగావాట్ల విద్యత్ ను ఇవ్వనుందని చెప్పారు. ఇవాళ జరిగిన ఏపీ మంత్రి వర్గ సమావేశంలో రుణమాఫీతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. విజన్ 2020ను సవరించి విజన్ 2029గా మార్చే అంశంపై సమాలోచనలు జరిపారు. బోధనా రుసుం, ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ అంశాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ కు చంద్రబాబు లేఖ రాయనున్నారు. అలాగే ఎయిడెడ్ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయస్సును 60కి పెంచే అంశంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది

చేపను వేటాడితే జైలు శిక్ష


నల్లమచ్చలతో భారీగా ఉన్న  ఈ చేప పేరు బొగ్గు సొర. బుధవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మత్స్యకారుల వలకు చిక్కింది. సుమారు 12 టన్నుల ఉన్న ఈ చేపను ఒడ్డుకు తీసుకువస్తే కేవలం రూ.15 వేలు మాత్రమే వచ్చిందని వారు వాపోతున్నారు మూడేళ్ల క్రితం ఈ చేపను అంతరించి పోతున్న మత్స్యజాతుల్లో చేర్చారు. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద ఈ చేపను వేటాడితే సుమారు ఏడేళ్ల జైలు శిక్ష భారీగా జరిమాన విధిస్తారు. దీనిపై మత్స్యకారులకు అవగాహన లేకపోవడంతో ఎంతో కొంత ధర వస్తుందని ఇలా వడ్డుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికైనా సంబంధితా అధికారులు వారిలో చైతన్యం కలిగించాల్సివుంది

Monday, July 7, 2014

వాహ్.. కేసీఆర్.......


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలుకుని రెవెన్యూ డివిజన్ అధికారి వరకు పది జిల్లాల అధికార గణం మొత్తం కొలువు తీరిన వేదికలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన ప్రసంగంతో విస్మయ పరిచారు. గ్రామంలో డంప్ యార్డ్ మొదలుకొని తెలంగాణ వాతావరణం వరకు ప్రతి అంశంపై సాధికారికంగా ఆయన ప్రసంగించిన తీరు అధికారులను విస్తుపోయేట్టు చేసింది. సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరులు అభివృద్ధి కేంద్రంలో నవ తెలంగాణపై సమావేశం నిర్వహించారు. కేసిఆర్ అధికారులకు కొత్తేమీ కాదు. గత 13 ఏళ్ల నుంచి తెలంగాణ ఉద్యమ నాయకుడిగానే ఆయన వారిగా బాగా తెలుసు. ప్రత్యర్థులు, మీడియా ఆయనపై చేసిన ప్రచారం ఆధారంగా కేసిఆర్‌పై ఒక అంచనాకు వచ్చిన అధికారులు ఈ రోజు జరిగిన సమావేశంతో తమ ఆలోచనలను మార్చుకున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, జిల్లాల భౌగోళిక స్వరూపం, గ్రామాల్లో సమస్యలు విషయం ఏదైనా కావచ్చు సాధికారికంగా వాస్తవిక దృక్ఫథంతో ఆయన మాట్లాడిన తీరు అధికారులను ఆలోచనల్లో పడేసింది. ఉద్యమ నాయకుడు సరే పాలనపై ఆయను ఉన్న అనుభవం ఎంత? అవగాహన ఎంత? అనుకున్న కొందరు అధికారులు మా ఆలోచనలు మార్చే విధంగా కేసిఆర్ ఉపన్యాసం సాగిందని చెప్పుకొచ్చారు.

అంతర్జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ ఇక్రిసాట్ హైదరాబాద్‌లో ఉందనే విషయం అధికారులందరికీ తెలిసిందే? కానీ అది హైదరాబాద్‌లోనే ఎందుకు ఉందో కేసిఆర్ వివరించిన తీరు అధికారులను విస్మయపర్చింది. ఎర్రరేగడినేల,నల్లరేగడి నేల కలిసి ఉన్న అరుదైన ప్రాంతం అది, విత్తనాభివృద్ధికి ప్రపంచంలోనే అరుదైన ప్రాంతం. అందుకే ఇక్కడ ఆ కాలంలోనే ఇక్రిసాట్‌ను ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. పంచాయితీరాజ్ విధానాన్ని మనం నిర్వీర్యం చేశాం కానీ అసలైన లక్ష్యం ఏమిటో? అధికారులకు చెప్పుకొచ్చారు.స్వాతంత్య్రం లభించి ఆరు దశాబ్దాలు అవుతున్నా గ్రామానికి ఒక డంప్ యార్డ్ ఉండాలనే ఆలోచన మనకు కలగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్లు తమ వద్దకు వచ్చే గ్రామీణులతో, కింద స్థాయి ఉద్యోగులతో తెలుగులోనే మాట్లాడాలని సూచించారు. వినడానికి చిన్న మాటగానే కనిపించవచ్చు. కానీ ఇంగ్లీష్‌లో మీరు ఏదో మాట్లాడితే వారు మీ వద్దకు రావడానికే జంకుతారు.తమదైన భాషలో మాట్లాడితే మీపై నమ్మకం పెరుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు. బ్రీటీష్ కాలం నాటి కలెక్టర్లుగా ఉండొద్దని, ప్రజాస్వామ్యంలో ప్రజల కలెక్టర్‌గా నిలవాలని వివరించారు. పాలనలో ,ప్రణాళిక రూపకల్పనలో అన్నింటిలో తెలంగాణ ముద్ర ఉండాలని చెప్పుకొచ్చారు. కొన్ని లక్షల మంది వచ్చిన బహిరంగ సభలోనైనా కేసిఆర్ అరగంటకు మించి మాట్లాడరు. 15-20 నిమిషాల్లోనే ఉపన్యాసం ముగించిన సభలు కూడా ఉన్నాయి.

అలాంటిది ఆయన తొలి సమావేశంలో రెండున్నర గంటల పాటు మాట్లాడారు. 11గంటలకు ప్రారంభం అయిన సమావేశంలో మధ్యాహ్నాం రెండున్నర వరకు ప్రసంగించి, మనం టీ బ్రేక్ తీసుకుందాం అనగానే పక్కన ఉన్న వారు లంచ్ టైం అయిందని గుర్తు చేశారు. దానికి కేసిఆర్ నవ్వుతూ నేను ఎక్కువ సమయం తీసుకున్నాను, తెలంగాణ కోసం ఏం చేయాలని నేను కోరుకుంటున్నానో మీకు అర్ధం అయి ఉంటుందని అన్నారు. అంకెల కోసం కాగితాలను చూడకుండా అన్ని అంశాలపై అనర్ఘళంగా ప్రసంగించారు. ఇది ఉన్నతాధికారులకు తెలంగాణపై శిక్షణ కార్యక్రమంగా సాగింది. ముఖ్యమంత్రిగా కేసిఆర్ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఉన్నతాధికారులతో ఆయా శాఖల గురించి సమీక్షలు నిర్వహించడం తప్ప విస్తృతంగా సమావేశం నిర్వహించడం ఇదే మొదటి సారి. ఐఎఎస్ అధికారులు, ప్రభుత్వ సలహాదారులు, మంత్రులు, రెవెన్యూ డివిజన్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. కేసిఆర్ ఉపన్యాసం విన్నాక వాహ్ కేసిఆర్ వాహ్ అనుకోకుండా ఉండలేకపోయామని అధికారులు చెప్పుకొచ్చారు.


విద్యుత్ రంగంలో ఆంధ్రకు మహర్దశ


విద్యుత్ రంగంలో ఆంధ్రకు మహర్దశ పట్టనుంది. నిరంతర విద్యుత్ సరఫరాకు వీలుగా కేంద్రం ఎంపిక చేసిన రెండు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఈ క్రమంలో నిరంతర విద్యుత్ పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిరంతర సమీక్ష మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం పైసా వెచ్చించాల్సిన పని లేకుండానే ఈ పథకాన్ని కేంద్రం అమలుచేస్తుంది. తొలిదశలో వెయ్యి కోట్లు వెచ్చించేందుకు అపుడే కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. విద్యుత్ అదుపు- పొదుపుపై కేంద్రం నియమించిన త్రిసభ్య కమిటీ సోమవారం రాష్ట్రానికి చేరుకుంది. కమిటీకి ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసస్ లిమిటెడ్ చైర్మన్ సౌరభ్‌కుమార్ నాయకత్వం వహిస్తున్నారు. సోమవారం విద్యుత్ సౌదాలో సుదీర్ఘ సమీక్ష అనంతరం రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితులను మెరుగుపర్చేందుకు రానున్న రెండేళ్లలో వెయ్యి కోట్లు కేటాయించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. మరోపక్క ఈ బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పరిస్థితిని వివరించారు.

ఇదిలావుంటే, విద్యుత్ సంస్థలను ఆర్ధికంగా, సాంకేతికంగా బలోపేతం చేస్తూ వినియోగదారులకు నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్ అందించాలనే ధృడ సంకల్పంతో రాష్ట్రం ఉంది. కరెంటు పొదుపునకు అన్ని చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఎన్టీపిసి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇఆర్‌సి, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌ల భాగస్వామ్యంతో విద్యుత్ పొదుపు కమిటీ ఏర్పాటైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తక్కువ విద్యుత్‌తో ఎక్కువ ప్రయోజనం కలిగించే విధంగా ఎల్‌ఇడి విద్యుద్దీపాల వ్యవస్థను ఆధునీకరించడం, నాణ్యమైన పంపుసెట్లను వినియోగించడం ద్వారా విద్యుత్ వృథాను అరికట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. తొలిదశలో ఈ పథకాన్ని 24 మున్సిపాల్టీల్లో అమలు చేస్తారు.

భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, కాకినాడ, తుని, చీరాల, ఒంగోలు, నర్సారావుపేట, తెనాలి, నెల్లూరు, అనంతపురం, ధర్మవరం, గుంతకల్, తాడిపర్తి, హిందూపూర్, మదనపల్లి, తిరుపతి, కర్నూలు, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూర్, గుంటూరులో అమలు చేస్తారు. విద్యుత్ పరిస్థితిపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్షించారు. విద్యుత్ పొదుపు, సామర్థ్యం అంశాలపై కమిటీతో చర్చించి ప్రణాళికను ఖరారు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ముఖ్యమంత్రికి తెలిపారు. సమీక్షల్లో ముఖ్యమంత్రి కార్యదర్శి జి సాయిప్రసాద్, ముఖ్యకార్యదర్శి డి సాంబశివరావు, ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్, ఎండి కె విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.


రిలయన్స్ మీడియా, అంబానీల ఆలోచనల సామ్రాజ్యం

 రిలయన్స్ మీడియా, అంబానీల ఆలోచనల సామ్రాజ్యం 

relianceరిలయన్స్ ను నెట్ వర్స్ 18 మీడియా సంస్థల కంపెనీని నాలుగు వేల కోట్లు వెచ్చించి కైవసం చేసుకుంది. దీంతో టివి ఛానల్స్ డిజిటల్ మీడియా తో సహా అనేక ప్రసార మాధ్యమాలు రిలయన్స్ యాజమాన్యంలోకి వచ్చాయి. ఇందులో ఇంగ్లీషు, హిందీ ఛానల్స్ వున్నాయి. రాజకీయాలు ఆర్ధిక రంగం వినోదం ఇలా అనేక ప్రసారాలను ఇవిచేస్తాయి. ఈ పరిణామం తో అంబానీల చేతుల్లోకి వెళ్ళిన మీడియా సంస్థలు : IBNLIVE.COM, MONEYCONTROL.COM, FIRSTPOST.COM, CRICKETNEXT.IN, HOMESHOP18.COM, BOOKMYSHOW.COM; టీవీ ఛానల్స్: COLORS, CNNIBN, CNBC TV18, IBN7, CNBC AWAAZ.


ఫ్రేమ్‌లోకి రోజా..!



ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రసంగించినా, ఆ పార్టీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా టివీ ఛానళ్ళలో కనిపించారు. జగన్ మాట్లాడినప్పుడల్లా మీరే కనిపిస్తున్నారేమిటీ? అని ఓ విలేఖరి ఎమ్మెల్యే రోజాను ప్రశ్నించగా, జగన్ మాట్లాడినప్పుడు తానూ టివీల్లో కనిపించేలా వెనక వరుసలోనే కూర్చుంటున్నానని ఆమె బదులిచ్చారు. టివీల్లో కనిపిస్తే మా ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉన్నారని అనుకుంటున్నారని, లేకపోతే అసెంబ్లీకి వెళ్ళలేదని నియోజకవర్గం ప్రజలు అనుకుంటారని ఆ విధంగా ప్రేమ్‌లోకి వచ్చేలా కూర్చున్నానని చెప్పారు. ఎంతైనా ఆర్టిస్టును కదా..కెమెరాలో ఎలా కనపడాలో ఆ మాత్రం తెలియదా? అని ఆమె అనడంతో అక్కడున్న మిగతా వారంతా గొల్లుమని నవ్వారు. అదీ ఒక ‘ఆర్టే’నని సదరు విలేఖరి అనడంతో రోజాతో సహా అందరూ మరోసారి నవ్వారు.


విడిది గృహంలో యువతులు… రేప్ చేసిన ఇద్దరు పోలీసులు


rape eవిడిది గృహంలో జీవనం సాగిస్తున్న యువతులపై ఇద్దరు పోలీసులు అత్యాచారానికి పాల్పడి అడ్డువచ్చినవారిని చితకబాదిన తమ రాక్షస క్రీడను సాగించిన ఘటన చెన్నైలోని విరుగంబాకంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే… విరుగంబాక్కలో ఓ స్వచ్చంద సంస్థ నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో 20 మంది మహిళలు జీవనం సాగిస్తున్నారు.

 వీరిపై కన్నేసిన విరుగంబాక్కం పోలీసు స్టేషనుకు చెందిన 41 ఏళ్ల హెడ్ కానిస్టేబుల్ రాజా, 32 ఏళ్ల కానిస్టేబుల్ కుమరేషన్ బాగా మద్యం సేవించి యువతులపై అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న ఆశ్రమ నిర్వాహకురాలు అయేషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారని తెలుసుకున్న ఇద్దరూ పరారయ్యారు.


కాపురాల్ని కూల్చేస్తాయి టీవీ సీరియల్స్..........


మీ వైవాహిక జీవితం ఆనందంగానే సాగుతోందా…లేక ఏమైనా సమస్యలున్నాయా? మీ జీవిత భాగస్వామిలో ఎవరైనా అదేపనిగా టీవీలో వచ్చే సీరియల్స్‌ను చూసేస్తున్నారా? మిమ్మల్ని వేధించుకుని తింటున్నారా? అయితే వెంటనే టీవీని బద్ధలు కొట్టేయండి. పుసుకున్న ఆ పని చేసేరు గనక. సదరు సీరియల్స్‌ను చూడ్డం మానేస్తే సరిపోతుంది. అసలు విషయం ఏంటంటే… దాంపత్య జీవితంలో సమస్యలకు సీరియల్స్‌తో సంబంధం ఉందని అంటున్నారు పరిశోధకులు.

ఆనందకరమైన జీవితంలో చిచ్చు రేపడానికి సీరియల్స్ కారణమని మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన పరిశోధనలో తేలిందంటున్నారు. ప్రతి రోజూ కచ్చితంగా సీరియల్‌ను చూసే అలవాటు కచ్చితంగా వాళ్ల వైవాహిక జీవతంపై ప్రభావం చూపుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. భార్యాభర్తలు ఆనందంగా ఉండాలంటే సీరియల్స్‌కు దూరంగా ఉండాలని పరిశోధకులు గట్టిగా సూచిస్తున్నారు. జీవిత భాగస్వామి సీరియల్స్ చూస్తూ ఉంటే మాత్రం అది మీ దాంపత్య జీవితాన్ని నాశనం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.


Making of Baahubali - A Glimpse Into Our One Year Journ


Friday, July 4, 2014

ఎన్టీఆర్ డెసిషనే ఫైనల్



  • సాధారణంగా ఒక సినిమాకు ఎటువంటి క్యాస్ట్ అండ్ క్రూ కావాలన్నది డైరెక్టర్ నిర్ణయిస్తారు. కానీ ఈ లెక్క అన్ని సార్లూ నిజమవ్వదు. స్టార్ హీరోలను అప్పుడప్పుడే లైం లైట్ లోకి వస్తున్న డైరెక్టర్ లు డైరెక్ట్ చెయ్యాల్సి వచ్చినప్పుడు సదరు ఈ పెద్ద హీరోలే సినిమాలో ఎవరుంటే బాగుంటుంది, ఎవరిని తీసేస్తే హిట్ అవుతుంది వంటి విషయాలు చెప్పుకొస్తూ వుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఒక స్టార్ డైరెక్టర్ కి కూడా వచ్చింది.
  • ఎన్.టి.ఆర్ తో పూరి సినిమాకు పాపం పూరి అనుకున్నవి ఏవి సజావుగా సాగడంలేదు.కెరీర్ లో మొదటిసారి పూరి తన కధను కాకుండా వక్కంతం వంశీ రాసుకొచ్చిన కధను తెరకెక్కించే క్రమంలో వున్నాడు. ఇటీవలే ఈ సినిమాను 100 రోజుల్లో పూర్తి చేస్తాను, 2015 సంక్రాంతికి విడుదల చేస్తాను అంటూ స్టేట్మెంట్ లు ఇచ్చినందుకు సినిమానే మొదలుకాకుండా రిలీజ్ డేట్ లు ప్రకటించకు అంటూ నందమూరి వర్గం నుండి అక్షింతలు పడ్డాయట. ఇక తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ కోసం మరోసారి పూరి వెనక్కి తగ్గాల్సి వచ్చింది.సాధారణంగా కొత్త నాయికలను పరిచయం చేసే పూరి ఈ సినిమాతో ఆలియా భట్ ని తెలుగు తెరకు చూపిద్దాం అనుకున్నాడు. ఇటీవలే ఈ భామ చేసిన స్టేట్మెంట్ లు కూడా పాజిటీవ్ గా వుండడం తో తనని ఈ సినిమా నేపధ్యంలో కలిసాడని కూడా సమాచారం. అయితే మన బుడ్డోడికి ఈ భామ కంటే కాజల్ అయితేనే సినిమాకు బెస్ట్ అని తోచిందట. వేరే ఏ ఆలోచనలు పెట్టుకోకుండా కాజల్ ని ఫైనలయిజ్ చెయ్యమని దర్శకుడికి, నిర్మాత బండ్ల గణేష్ కి చెప్పాడని సినిమాలో హీరోయిన్ కాజలేనని కన్ఫర్మ్ అయినట్టు సమాచారం.


Thursday, July 3, 2014

టార్గెట్ చేసిన పవర్ స్టార్


అస్సలు ఈ ఏడాది పవన్ కల్యాణ్ నుంచి ఒక్క సినిమా అయినా వస్తుందా రాదా అనే డౌట్స్ అందర్లో ఉన్నాయి. కానీ పవన్ కల్యాణ్ సినిమా ఈ ఏడాది వస్తోంది. వెంకటేష్ తో చేస్తున్న గోపాలా..గోపాలా సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. దీపావళి కానుకగా అక్టోబర్ 23న పవన్ సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది.

గతేడాది సెప్టెంబర్ 27న అత్తారింటికి దారేది సినిమాని విడుదలచేశాడు పవన్. సరిగ్గా మళ్లీ ఏడాది తర్వాత అక్టోబర్ 23న గోపాలా.గోపాలాని రిలీజ్ చేస్తున్నాడు. మళ్లీ ఏడాది గ్యాప్ తర్వాత గబ్బర్ సింగ్-2ని తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ గ్యాప్ లో మరోసారి రాజకీయాలపై దృష్టిపెట్టబోతున్నాడు పవర్ స్టార్. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున అభ్యర్థుల్ని బరిలోకి దింపడానికి ప్రయత్నిస్తున్నాడు.


మహేష్ ను. ‘క్రిష్ణమ్మ పిలిచింది’ .....



కెరీర్ లో ఇప్పటి వరకు గెస్ట్ రోల్ లో కనిపించలేదు సూపర్ స్టార్ మహేష్ బాబు. కానీ త్వరలోనే ఫ్యాన్స్ కు ఆ ముచ్చట తీర్చనున్నాడు. గెస్ట్ రోల్ లో నటించాల్సిందిగా మహేష్ ను ‘క్రిష్ణమ్మ పలిచింది’. అర్థం కాలేదా.. మహేష్ బావ సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క్రిష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. ఈ సినిమాలో బావ కోసం ఓ గెస్ట్ రోల్ చేస్తున్నాడంట మన ప్రిన్స్. మహేష్ కోసం ప్రత్యేకంగా మంచి సీన్ క్రియేట్ చేశారట. ప్రస్తుతం ‘ఆగడు’ మూవీ షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్న మహేష్.. షూటింగ్ పూర్తయిన వెంటనే సుధీర్ బాబు సినిమాలో చేరనున్నాడట.
ఇప్పటి వరకైతే మహేష్ కేమియో రోల్ లో నటించలేదు. కాకపోతే జల్సా, బాద్షా సినిమాలకు వాయిస్ ఓవర్ అందించాడు. అనుష్క నటిస్తున్న రుద్రమాదేవి లో గెస్ట్ రోల్ చేస్తాడని వార్తలొచ్చినా.. అది కుదరలేదు. తాజాగా సుధీర్ బాబు సినిమాలో నటిస్తుండటంతో ఫ్యాన్స్ కు పండగే. ఇక సుధీర్ బాబు సినిమాను కన్నడ డైరెక్టర్ చంద్రు తెరకెక్కిస్తున్నాడు. కన్నడంలో చార్మినార్ పేరుతో వచ్చిన ఈ సినిమాకు కూడా చంద్రే డైరెక్టర్. ఇక ఈ సినిమాలో సుధీర్ కు జోడిగా నందిత నటిస్తోంది. గిరిబాబు, ఎమ్.ఎస్.నారాయణ.. తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.