Friday, July 11, 2014

టీఆర్ఎస్.. బిల్లు ఆమోదంపై అసంతృప్తి వ్యక్తం.......మా గొంతు నొక్కేశారు KCR



ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో సవరణలు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది. తెలంగాణఒడిషాచత్తీస్ గఢ్ ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపినా.. మూజువాణి పద్దతిలో బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు ఆమోదం లభ్యం కావడంతో.. పోలవరం ముంపు ప్రాంతాల్లోని 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ లో కలవనున్నాయి. భద్రాచలం మండలంలో భద్రాచలం పట్టణం మినహా అన్ని గ్రామాలు ఏపీలో కలవనున్నాయి.
 పోలవరం ఆర్డినెన్స్ ను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్.. బిల్లు ఆమోదంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రప్రభుత్వం మొండిగా వ్యవహరించిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. పోలవరం డిజైన్ మార్చాలని.. తాను గతంలోనే కేంద్రప్రభుత్వాన్ని కోరానని.. అయినా పట్టించుకోలేదన్నారు.
తమ ఎంపీలు ఎంత పోరాటం చేసినా కేంద్రం త‌మ‌కు ఉన్న మందబ‌లంతో త‌మ గొంతు నొక్కేసింద‌ని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం తో పాటు గా ఒరిస్సాచ‌త్తీస్ గ‌డ్ రాష్ట్రాల ప్ర‌జ‌ల ప్ర‌భుత్వాల మ‌నోభావాలను ప‌ట్టించుకోలేద‌ని అన్నారు.  తమ రాష్ట్ర హ‌క్కుల‌ను కాలరాశార‌ని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
 బిల్లుకు పార్లమెంట్ లో ఆమోదం లభించినప్పటికీ.. 7 మండలాలను కాపాడుకునేందుకు కార్యాచరణను ప్రభుత్వ పరంగా ఆలోచిస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. న్యాయ నిపుణులురాజ్యాంగ నిపుణులతో చర్చించి.. సుప్రీంకోర్టుకేళ్లే విషయంపై.. మంతనాలు జరుపుతున్నారు

No comments:

Post a Comment