Sunday, July 13, 2014

పురుషులకు కూడా తప్పని లైగింక వేధింపులు


ఈ సంఘటన మిగిలిన అన్ని సంఘటల కంటే భిన్నమైంది. కార్పోరేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై వారి బాసులు లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు ఈ మధ్య కాలంలో తరచూ వెలుగు చూస్తున్నాయి. కాని ఇలా మహిళా బాసులు కూడా వేధింపులకు గురిచేస్తారు అన్న విషయం అందరికి షాక్ కు గురిచేస్తుంది. అందుకు నిదర్శనమే తాజాగా యాహూ సంస్థలో జరిగిన ఈ సంఘటన. తన మహిళా బాసు కోరికను తీర్చలేదన్న కారణంగా తనను వేధింపులకు గురి చేయడమే కాక తన ప్రోగ్రెస్ రిపోర్టులను కూడా నీరుగార్చేసిందని సంస్థకు చెందిన ఓ మహిళా ఉద్యోగి కాలిఫొర్నియా కోర్టులో కేసు దాఖలు చేసింది. వివరాల్లోకి వెళితే... అలైక్ అనే మొబైల్ కంపెనీని ప్రారంభించిన మారియా ఝాంగ్, ఆ తర్వాత తన కంపెనీని యాహూకు విక్రయించడంతో పాటు యాహూ మొబైల్ లో సీనియర్ డైరెక్టర్ గా విధుల్లో చేరిపోయారు. మారియా విభాగంలోనే ప్రిన్సిపల్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న నాన్ షిపై లైంగిక వేధింపులకు దిగారట. తనతో ఓరల్ సెక్స్ చేయాల్సిందిగా మారియా బలవంతపెట్టేదని, దీనిపై పర్సనల్ డిపార్ట్ మెంట్ కు ఫిర్యాదు చేసినా, సంస్థ పట్టించుకున్న పాపాన పోలేదని షి కోర్టుకు విన్నవించారు. ఇదిలా ఉంటే, మారియాపై వచ్చిన ఆరోపణలు సత్యదూరమని సంస్థ ప్రతినిధి కొట్టిపారేశారు. మారియా తరఫున న్యాయ పోరాటం సాగిస్తామని కూడా సంస్థ తెలిపింది. తన కోరిక తీర్చని కారణంగా మారియా 2013లో రెండు, మూడు త్రైమాసికాలకు సంబంధించిన తన ప్రోగ్రెస్ రిపోర్టులను నీరుగార్చిందని కూడా షి తన ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు దీర్ఘకాలం పాటు సెలవులో వెళ్లిన షి ని కంపెనీ ఆమె స్థానం నుంచి తప్పించింది.

No comments:

Post a Comment