కాపురాల్ని కూల్చేస్తాయి టీవీ సీరియల్స్..........
మీ వైవాహిక జీవితం ఆనందంగానే సాగుతోందా…లేక ఏమైనా సమస్యలున్నాయా? మీ జీవిత భాగస్వామిలో ఎవరైనా అదేపనిగా టీవీలో వచ్చే సీరియల్స్‌ను చూసేస్తున్నారా? మిమ్మల్ని వేధించుకుని తింటున్నారా? అయితే వెంటనే టీవీని బద్ధలు కొట్టేయండి. పుసుకున్న ఆ పని చేసేరు గనక. సదరు సీరియల్స్‌ను చూడ్డం మానేస్తే సరిపోతుంది. అసలు విషయం ఏంటంటే… దాంపత్య జీవితంలో సమస్యలకు సీరియల్స్‌తో సంబంధం ఉందని అంటున్నారు పరిశోధకులు.
ఆనందకరమైన జీవితంలో చిచ్చు రేపడానికి సీరియల్స్ కారణమని మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన పరిశోధనలో తేలిందంటున్నారు. ప్రతి రోజూ కచ్చితంగా సీరియల్‌ను చూసే అలవాటు కచ్చితంగా వాళ్ల వైవాహిక జీవతంపై ప్రభావం చూపుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. భార్యాభర్తలు ఆనందంగా ఉండాలంటే సీరియల్స్‌కు దూరంగా ఉండాలని పరిశోధకులు గట్టిగా సూచిస్తున్నారు. జీవిత భాగస్వామి సీరియల్స్ చూస్తూ ఉంటే మాత్రం అది మీ దాంపత్య జీవితాన్ని నాశనం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
No comments:
Post a Comment