నల్లమచ్చలతో భారీగా ఉన్న ఈ చేప పేరు బొగ్గు సొర. బుధవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మత్స్యకారుల వలకు చిక్కింది. సుమారు 12 టన్నుల ఉన్న ఈ చేపను ఒడ్డుకు తీసుకువస్తే కేవలం రూ.15 వేలు మాత్రమే వచ్చిందని వారు వాపోతున్నారు మూడేళ్ల క్రితం ఈ చేపను అంతరించి పోతున్న మత్స్యజాతుల్లో చేర్చారు. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద ఈ చేపను వేటాడితే సుమారు ఏడేళ్ల జైలు శిక్ష భారీగా జరిమాన విధిస్తారు. దీనిపై మత్స్యకారులకు అవగాహన లేకపోవడంతో ఎంతో కొంత ధర వస్తుందని ఇలా వడ్డుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికైనా సంబంధితా అధికారులు వారిలో చైతన్యం కలిగించాల్సివుంది
No comments:
Post a Comment