నల్లసూరీడు, మడీబా.. నెల్సన్ మండేలా 96వ జన్మదినం నేడే...దక్షిణాఫ్రికాలో జాతివివక్షకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసిన నాయకుడు. ఆ దేశంలో ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నేత, దక్షిణాఫ్రికా మహాత్ముడు నెల్సన్ మండేలా...స్వాతంత్రపోరాటంలో ఓ మారణకాండకు సంబంధించి 27 సంవత్సరాల పాటు రోబెన్ అనే ద్వీపంలో జైలు శిక్షను అనుభవించారు. 20వ శతాబ్దపు అత్యంత సుప్రసిద్ద వరల్డ్ లీడర్స్ లో మండెలా ఒకరు. వర్ణ సమానత కోసం ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కుని తన జీవితాన్నే పణంగా పెట్టిన నేత నెల్సన్ మండేలా...శాంతియుత ఉద్యమంతో అనుకున్నది సాధించిన మడీబాకు 1993లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. గాంధేయ మార్గంలో జీవితాన్ని మలుచుకున్న తీరు ఆయనకు దక్షిణాఫ్రికా గాంధీ అన్న గొప్పపేరు సాధించిపెట్టింది.
No comments:
Post a Comment