నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి. పశ్చిమ రాజస్థాన్, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలకు విస్తరించిన రుతుపవనాలు.. రెండు రోజులు ఆలస్యంగా ఉత్తర అరేబియా సముద్ర ప్రాంతానికి చేరుకున్నాయి. దీంతో దేశమంతా నైరుతి రుతుపవనాలు విస్తరించినట్టేనని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
రుతుపవనాల విస్తరణతో దేశంలోని ఉత్తరాది ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఎండ వేడిమి, ఉక్కపోత నుంచి ఢిల్లీ వాసులకు ఉపశమనం కలిగింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో.. భారీ వర్షాలు పడొచ్చనే హెచ్చరికలతో అధికారులు కేదార్ నాథ్ తో పాటు బద్రీనాథ్ యాత్రను నిలిపివేశారు.
మరోవైపు ఒడిషా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో రెండు మూడు రోజుల పాలు వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణాలోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. రెండు రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
రుతుపవనాల విస్తరణతో అనేక సమస్యలు తీరనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీరనుందని తెలిపారు.
No comments:
Post a Comment