ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రసంగించినా, ఆ పార్టీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా టివీ ఛానళ్ళలో కనిపించారు. జగన్ మాట్లాడినప్పుడల్లా మీరే కనిపిస్తున్నారేమిటీ? అని ఓ విలేఖరి ఎమ్మెల్యే రోజాను ప్రశ్నించగా, జగన్ మాట్లాడినప్పుడు తానూ టివీల్లో కనిపించేలా వెనక వరుసలోనే కూర్చుంటున్నానని ఆమె బదులిచ్చారు. టివీల్లో కనిపిస్తే మా ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉన్నారని అనుకుంటున్నారని, లేకపోతే అసెంబ్లీకి వెళ్ళలేదని నియోజకవర్గం ప్రజలు అనుకుంటారని ఆ విధంగా ప్రేమ్‌లోకి వచ్చేలా కూర్చున్నానని చెప్పారు. ఎంతైనా ఆర్టిస్టును కదా..కెమెరాలో ఎలా కనపడాలో ఆ మాత్రం తెలియదా? అని ఆమె అనడంతో అక్కడున్న మిగతా వారంతా గొల్లుమని నవ్వారు. అదీ ఒక ‘ఆర్టే’నని సదరు విలేఖరి అనడంతో రోజాతో సహా అందరూ మరోసారి నవ్వారు.
No comments:
Post a Comment