అమెరికా అధ్యక్షుడు ఒబామా నుంచి ఏపీకి చెందిన విద్యార్థికి ఆహ్వానం పంపించారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన ‘నేషనల్ బ్రాడ్ కామ్ మాస్టర్స్ సైన్స్ కాంపిటేషన్స్’లో తెలుగు విద్యార్థి రాజీవ్ మొవ్వ సత్తాచాటాడు. కాలిఫోర్నియాలోని హార్కర్ స్కూల్ తొమ్మిదో తరగత చదువుతున్న ఇతడు లెక్కల్లో మొదటి ర్యాంకు సాధించాడు. దీంతో ఒబామా ఇతన్ని ఇతర విభాగాల విజేతలతో పాటు శ్వేత సౌధానికి ఆహ్వానించి అభినందించారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా,గుంటూరు జిల్లాలకు చెందిన తండ్రి డాక్టర్ ఆంజనేయప్రసాద్ మొవ్వ, తల్లి శ్రీలక్ష్మిలీల శాన్ జోస్ లో ఉంటున్నారు. ఆంజనేయప్రసాద్ కైసర్ గ్రూఫ్ ఆఫ్ హాస్పిటల్స్ పెయిన్ మేనేజ్ మెంట్ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్నారు. లీల ఇంటెల్ లో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్నారు
Tuesday, November 4, 2014
ధ్యానంతో రొమ్ము క్యాన్సర్ బాధితులకు లబ్ధి.....
కెనడాలోని కాల్గరీ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు రొమ్ము క్యాన్సర్ బారిన పడి కోలుకుంటున్న వారికి ధ్యానంతో మంచి ఫలితాలు లభిస్తాయని తెలిపారు. 88మంది రొమ్ము క్యాన్సర్ బాధితులపై అధ్యయనం చేశారు. వీరి సగటు వయసు 55ఏళ్లు. వీరికి వారానికి గంటన్నర చొప్పున 8వారాల పాటు ధ్యానం, హఠయోగాలో శిక్షణ ఇచ్చారు. ఈ పరిశోధనలో క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేసే వారిలో ‘టెలోమీర్’ల పొడవు తగ్గిపోవటం లేదని వీరు గుర్తించారు. క్రోమోజోముల చివరన ఉండే ప్రొటీన్ సమ్మేళనాలనే టెలోమీర్లు అంటారు. ఇవి పొట్టిగా ఉండటం అన్నది పలు వ్యాధులకు సంకేతమని, పొడవుగా ఉంటే ఆరోగ్యానికి చిహ్నమని భావిస్తున్నారు. అంతే కాకుండా ఓ వైపు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూనే వీరందరికీ ఎప్పటికప్పుడు రక్తపరీక్షలు నిర్వహించారు. దీని ద్వారా వారి ఆరోగ్యపరిస్థతి మెరుగైందని వెల్లడైంది
ప్రాణాయామం
ప్రాణాయామం (Pranayama) అంటే ప్రాణశక్తిని విసరింపజేసి అదుపులో ఉంచడం. ప్రాణాయామం మనస్సును ఏకాగ్రం చేయడానికి, శరీరాంతర్గత నాడీ శుద్ధికి తోడ్పడుతుంది. పతంజలి మహర్షి ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలను అదుపులో ఉంచడం ప్రాణాయామమని నిర్వచించారు.
ప్రాణశక్తి ముఖ్యంగా ఐదు రకాలుగా పనిచేస్తుంది. ఇవి 1. ప్రాణం, 2. అపానం, 3. సమానం, 4. ఉదానం మరియు వ్యానం.
ముఖ్యమైన దశలు
1. పూరకం: ఊపిరితిత్తుల నిండా మెల్లగా గాలిని పీల్చడాన్ని పూరకమంటారు.
2. కుంభకం: పూరకం తర్వాత గాలిని లోపలే ఆపి ఉంచడం 'అంతఃకుంభకం' అవుతుంది. అలాగే రేచకం తర్వాత గాలిని లోపలికి పీల్చకుండా ఆపి ఉంచడం 'బాహ్యకుంభకం' అవుతుంది.
3. రేచకం: ఊపిరితిత్తుల నుండి గాలిని మెల్లగా బయటకు పంపించడాన్ని రేచకమంటారు.
ప్రాణాయామ పద్ధతులు
ప్రాణాయామం ముఖ్యంగా ఎనిమిది రకాలు. ఇవి అష్టకుంభకాలు.
1. ఉజ్జాయి:
2. సూర్యభేద:
3. భస్త్రిక:
4. శీతలి:
5. సీత్కారి:
6. భ్రామరి:
7. మూర్ఛ:
8. ప్లావని:
మరింత సమాచారం
ప్రాణాయామము : ప్రాణము అనగా జీవనము , ఆయామము అనగా పొడిగించుట. ( పెంచుట ).
స్వామీ ఘోరకనాథ్ శిష్యుడు యోగి స్వత్మరామ సంస్కృతములో రచించిన హఠయోగ ప్రదీపిక నందు మరియు పాతంజలి యొగశాస్త్రం నందు కూడ ప్రాణాయామం చెప్పబడెను.
8 రకముల ప్రాణాయామ పద్ధతులుకలవు :
సూర్య భేదనం ఉజ్జాయి శీతలి శీత్కారి భస్తిరిక భ్రామరి ప్లావని మూర్ఛ ఇతి అష్త కుమ్భకాని -
సూర్య భేదనం అనగా సూర్య నాడిని ఉద్ద్దీపన చేయుట. యడం ముక్కును మూసి కుడి ముక్కుతొ పదెపదె గాలిని పీల్చుట ( సూర్య భెదనము మరియు భస్త్రిక ప్రాణాయామాల వలన శరీరమందలి శీతల సంబంధిత రోగములు తొలగును. లొ.బి.పి. కి మంచిది.)
ఉజ్జాయి అనగ ఛిన్నపిల్లల గురక ద్వణి లాగ గాలిని ముక్కుద్వారా తీసుకొనువలెను.ఆసమయములొ గొంతుక వద్ద ద్వని నెమ్మదిగ చేయవలెను. ( స్వరమునకు మంచిది.కపము తగ్గును.)
శీతలి అనగా చల్లదనము. నాలికను కాకి ముక్కు వలెనె చేసి గాలిని నాలిక ద్వారా పీల్ఛుకొనవలెను. పిదప ముక్కుతో వదలవలెను.
శీత్కారి అనగా చల్లదనము . గాలిని నొటిలొని పల్లమధ్యనుండి లొనికి పీలుచుకొనవలెను. ( శీతలి మరియు శీత్కారీ ప్రాణాయామాల వలన హ్హె.బి.పి. తగ్గును.చక్కగ నిద్రపట్టును.)
భస్త్రిక అనగ తొలుతిత్తి. గాలిని వెగముగ ముక్కుద్వారా తీసి వదులుట కమ్మరి వాని తొలుతిత్తి వలెనె చెయవలెను.
భ్రామరి అనగా తుమ్మెద . తుమ్మెద ద్వనివలెనె నాసాగృము ద్వారా గాలిని బయిటకు వదలవలెను. (బ్రామరి ప్రాణాయామ సాదన వలన మనస్సుకు శాంతి కలుగును.నిదుర పట్టును.)
ప్లావని అనగా తేలుట . పెదవులను కాకిముక్కు వలెనె చేసి గాలిని లోనికి పూర్తిగా పొట్ట నిండు వరకు పీలుచుకొనవలెను. (ఈ ప్రాణాయామము వలన వాయువులలొని త్రిదొషములు తొలగును.)
మూర్ఛ అనగా మతిభ్రమించుట. గాలిని ముక్కుద్వారా లొనికి తీసుకొని వదులునపుడు-
ఆగాలి మెదడుకు దిగువన గల పిట్య్టటరి గృందికి తకునట్లుగ ఉన్డవలెను.( దీనివలన మెదడుకు శాంతి కలుగును.)
పాతంజలి యొగములొ - శ్వాస ప్రశ్వాసొగతివిఛెదా ప్రాణ్ణాయామ అని చెప్పబడినది.
అనులొమ విలొమ ప్రాణాయామము ముఖ్యమగు ప్రాణాయామము.
ఎడమ నాసగ్రము ద్వారా గాలిని లొనికి తీసుకొని కుడి నాసాగ్రము ద్వారా గాలిని వదల వలెను.
పిదప గాలిని అదె కుడి నాసగ్రము ద్వారా తీసుకొని ఎడమ నాసాగ్రము నుండి వదల వలెను.ఈ ప్రకారముగా పలుమారులు సాదన చేయ వలెను. ( జీవించినంత కాలము ఈప్రాణాయామ సాదన చాల ఉపకరించును.సకల రొగములు తొలగును.)
ద్యానము చేయుసమయములొ నాసాగ్రమునందు ద్రుష్తిని నిలిపి గాలి గమనాగమనములను గమనించుటచె మనసు కుదుటపడి ఎకాగ్రత కలుగును.
దీనినె విపాసనాద్యానం అని కూడ అందురు.
ఈప్రాణ్ణాయామం గురించి స్వరశాస్త్రమంజరిలొ వివరముగ వివరించబడినది. స్వరమె పరమాత్మ అని కూడ పెద్దలు చెప్పెదరు.
ప్రాణశక్తి ముఖ్యంగా ఐదు రకాలుగా పనిచేస్తుంది. ఇవి 1. ప్రాణం, 2. అపానం, 3. సమానం, 4. ఉదానం మరియు వ్యానం.
ముఖ్యమైన దశలు
1. పూరకం: ఊపిరితిత్తుల నిండా మెల్లగా గాలిని పీల్చడాన్ని పూరకమంటారు.
2. కుంభకం: పూరకం తర్వాత గాలిని లోపలే ఆపి ఉంచడం 'అంతఃకుంభకం' అవుతుంది. అలాగే రేచకం తర్వాత గాలిని లోపలికి పీల్చకుండా ఆపి ఉంచడం 'బాహ్యకుంభకం' అవుతుంది.
3. రేచకం: ఊపిరితిత్తుల నుండి గాలిని మెల్లగా బయటకు పంపించడాన్ని రేచకమంటారు.
ప్రాణాయామ పద్ధతులు
ప్రాణాయామం ముఖ్యంగా ఎనిమిది రకాలు. ఇవి అష్టకుంభకాలు.
1. ఉజ్జాయి:
2. సూర్యభేద:
3. భస్త్రిక:
4. శీతలి:
5. సీత్కారి:
6. భ్రామరి:
7. మూర్ఛ:
8. ప్లావని:
మరింత సమాచారం
ప్రాణాయామము : ప్రాణము అనగా జీవనము , ఆయామము అనగా పొడిగించుట. ( పెంచుట ).
స్వామీ ఘోరకనాథ్ శిష్యుడు యోగి స్వత్మరామ సంస్కృతములో రచించిన హఠయోగ ప్రదీపిక నందు మరియు పాతంజలి యొగశాస్త్రం నందు కూడ ప్రాణాయామం చెప్పబడెను.
8 రకముల ప్రాణాయామ పద్ధతులుకలవు :
సూర్య భేదనం ఉజ్జాయి శీతలి శీత్కారి భస్తిరిక భ్రామరి ప్లావని మూర్ఛ ఇతి అష్త కుమ్భకాని -
సూర్య భేదనం అనగా సూర్య నాడిని ఉద్ద్దీపన చేయుట. యడం ముక్కును మూసి కుడి ముక్కుతొ పదెపదె గాలిని పీల్చుట ( సూర్య భెదనము మరియు భస్త్రిక ప్రాణాయామాల వలన శరీరమందలి శీతల సంబంధిత రోగములు తొలగును. లొ.బి.పి. కి మంచిది.)
ఉజ్జాయి అనగ ఛిన్నపిల్లల గురక ద్వణి లాగ గాలిని ముక్కుద్వారా తీసుకొనువలెను.ఆసమయములొ గొంతుక వద్ద ద్వని నెమ్మదిగ చేయవలెను. ( స్వరమునకు మంచిది.కపము తగ్గును.)
శీతలి అనగా చల్లదనము. నాలికను కాకి ముక్కు వలెనె చేసి గాలిని నాలిక ద్వారా పీల్ఛుకొనవలెను. పిదప ముక్కుతో వదలవలెను.
శీత్కారి అనగా చల్లదనము . గాలిని నొటిలొని పల్లమధ్యనుండి లొనికి పీలుచుకొనవలెను. ( శీతలి మరియు శీత్కారీ ప్రాణాయామాల వలన హ్హె.బి.పి. తగ్గును.చక్కగ నిద్రపట్టును.)
భస్త్రిక అనగ తొలుతిత్తి. గాలిని వెగముగ ముక్కుద్వారా తీసి వదులుట కమ్మరి వాని తొలుతిత్తి వలెనె చెయవలెను.
భ్రామరి అనగా తుమ్మెద . తుమ్మెద ద్వనివలెనె నాసాగృము ద్వారా గాలిని బయిటకు వదలవలెను. (బ్రామరి ప్రాణాయామ సాదన వలన మనస్సుకు శాంతి కలుగును.నిదుర పట్టును.)
ప్లావని అనగా తేలుట . పెదవులను కాకిముక్కు వలెనె చేసి గాలిని లోనికి పూర్తిగా పొట్ట నిండు వరకు పీలుచుకొనవలెను. (ఈ ప్రాణాయామము వలన వాయువులలొని త్రిదొషములు తొలగును.)
మూర్ఛ అనగా మతిభ్రమించుట. గాలిని ముక్కుద్వారా లొనికి తీసుకొని వదులునపుడు-
ఆగాలి మెదడుకు దిగువన గల పిట్య్టటరి గృందికి తకునట్లుగ ఉన్డవలెను.( దీనివలన మెదడుకు శాంతి కలుగును.)
పాతంజలి యొగములొ - శ్వాస ప్రశ్వాసొగతివిఛెదా ప్రాణ్ణాయామ అని చెప్పబడినది.
అనులొమ విలొమ ప్రాణాయామము ముఖ్యమగు ప్రాణాయామము.
ఎడమ నాసగ్రము ద్వారా గాలిని లొనికి తీసుకొని కుడి నాసాగ్రము ద్వారా గాలిని వదల వలెను.
పిదప గాలిని అదె కుడి నాసగ్రము ద్వారా తీసుకొని ఎడమ నాసాగ్రము నుండి వదల వలెను.ఈ ప్రకారముగా పలుమారులు సాదన చేయ వలెను. ( జీవించినంత కాలము ఈప్రాణాయామ సాదన చాల ఉపకరించును.సకల రొగములు తొలగును.)
ద్యానము చేయుసమయములొ నాసాగ్రమునందు ద్రుష్తిని నిలిపి గాలి గమనాగమనములను గమనించుటచె మనసు కుదుటపడి ఎకాగ్రత కలుగును.
దీనినె విపాసనాద్యానం అని కూడ అందురు.
ఈప్రాణ్ణాయామం గురించి స్వరశాస్త్రమంజరిలొ వివరముగ వివరించబడినది. స్వరమె పరమాత్మ అని కూడ పెద్దలు చెప్పెదరు.
మరణించే తేదీని కనిపెట్టే ఆప్.....
వ్యక్తి జీవనశైలి, ఎత్తు, బీపీ, నిద్ర, వ్యాయామం వంటి అంశాల ఆధారంగా ఒక ఆప్ విడుదలైంది. ‘జిస్ట్ ఎల్ఎల్ సీ’ అనే కంపెనీ తయారు చేసిన ఆప్ లో మరణించే తేదీని తెలియజేస్తుంది. దీనికి ‘డెడ్ లైన్’ అని పేరు పెట్టారు. ఇది ఐఫోన్ హెల్త్ కిట్ తో కలిసి పని చేస్తుంది. హెల్త్ కిట్ వినియోగదారుడి ఎత్తును, బీపీని నిద్రపోయే సమయాన్ని, ఒక్కరోజుల్లో ఎక్కే మెట్లను లెక్కించి ఆ సమాచారాన్ని రికార్డు చేస్తుంది. ఈ సమాచారంతో పాటు , వ్యక్తం జీవన శైలికి సంబంధించిన వివరాల్ని కొన్ని ప్రశ్నల ద్వారా సేకరిస్తుంది. ఈ విధంగా ఆ వ్యక్తి ఇంకా ఎంతకాలం జీవించే అవకాశం ఉందో లెక్కించి...మరణతేదీని, సమయాన్ని వెల్లడిస్తుంది.
Wednesday, October 29, 2014
నీళ్లతో అందమైన ఆరోగ్యం
నీళ్లతో అందమైన ఆరోగ్యం
మనలో చాలా మందికి నీటివిలువ, మన ఆరోగ్యంపై నీటి ప్రభావం ఎంత అనేది తెలియదు. కాబట్టి దప్పికైతే తప్ప నీరు తాగరు. నీరు మన ఆరోగ్య పరిరక్షణలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో తెలుసుకుందాం.
మనశరీరంలో 60-70 శాతం ఉన్నది నీరే. మెదడు, కండరాలు, ఊపిరితిత్తులు, రక్తంలో ప్రధానభాగం నీరే. మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రణ చేసేది నీరే. మన శరీరంలోని అన్ని భాగాలకూ న్యూట్రియట్స్‌ను పంపేది నీరే. శరీరంలోని మలినాలను తొలగించేది, జీర్ణక్రియకు తోడ్పడేది, రక్తం, మూత్రం తయారీల్లో ప్రముఖపాత్ర వహిస్తోంది నీరు. శరీరంలో నీటిశాతం తగ్గితే, డీ హైడ్రేషన్ రకరకాల తలనొప్పులు, కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు ప్రారంభం అవుతాయి. సరైన మంచినీరు శరీరానికి మీరు అందించకపోతే, మలబద్దకం ఏర్పడి అనేక రుగ్మతలకు దారితీస్తుంది.
- ప్రతి మనిషీ రోజుకు 5,6 లీటర్ల నీరు తాగాలి.
- మంచి నీరు సమయానికి అందకపోతే డీహైడ్రేషన్‌కు గురై అదే సమయంలో మెటడాలిజం రేటు మూడు శాతం తగ్గిపోతుంది.
- మంచినీరు శరీరానికి అందకపోతే శరీరం నీరసించిపోతుంది. ఏకాగ్రత లోపిస్తుంది. ఏ పనిచేయలేరు. కళ్లుబైర్లు కమ్ముతాయి.
- ప్రతిరోజూ విధిగా 8,10 గ్లాసులు నీరు తక్కువ కాకుండా తాగేవారికి బ్లాడర్ కేన్సర్ సంభవించే అవకాశం తక్కువ.
- శరీరానికి నీటి శాతం తగ్గితే శరీర కాంతి కోల్పోతుంది. ముడతలు పడుతుంది. చర్మం వదులుగా అయిపోతుంది.
- కాఫీ తాగే అలవాటున్న వారు అదనంగా రెండు కప్పుల నీరు తాగాలి. కారణం కాఫీలోని కెఫైన్ కారణంగా మూత్రం అధికంగా వచ్చి శరీరం డీహైడ్రేషన్‌కు దారితీసే అవకాశం ఉంది. ఓ రకమైన తలనొప్పి కూడా వస్తుంది.
- మీ గుండె ఆరోగ్యంగా పనిచేయాలన్నా తప్పక పదిగ్లాసుల నీరు తాగాల్సిందే. అశ్రద్ధ చేయకండి.
- ఆహారం తిన్న రెండు గంటల అనంతరం నీరు తాగాలి.
- ఆహారంతో పాటు, ముద్ద ముద్దకూ నీరు తాగడం మంచి పద్ధతి కాదు.
గోళ్లు, జుట్టు, శరీరం అన్ని భాగాలూ ఆరోగ్యంగా ఉండాలంటే తగినన్ని మంచినీరు తాగాల్సిందే.
కిడ్నీలో రాళ్ళతో బాధపడేవారు ఎంత ఎక్కువగా నీరు తాగితే అంత మంచిది.
- మంచినీటిని పరిశుభ్రంగా ఉన్న ప్రదేశం నుండి వడకట్టి తాగడం మంచి పద్ధతి.
ఎక్కడ పడితే అక్కడ నీరును తాగకూడదు. ఆహారం వండటానికి, స్నానానికి పరిశుభ్రమైన నీటిని మాత్రమే వాడాలని గుర్తుపెట్టుకోండి.
మనశరీరంలో 60-70 శాతం ఉన్నది నీరే. మెదడు, కండరాలు, ఊపిరితిత్తులు, రక్తంలో ప్రధానభాగం నీరే. మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రణ చేసేది నీరే. మన శరీరంలోని అన్ని భాగాలకూ న్యూట్రియట్స్‌ను పంపేది నీరే. శరీరంలోని మలినాలను తొలగించేది, జీర్ణక్రియకు తోడ్పడేది, రక్తం, మూత్రం తయారీల్లో ప్రముఖపాత్ర వహిస్తోంది నీరు. శరీరంలో నీటిశాతం తగ్గితే, డీ హైడ్రేషన్ రకరకాల తలనొప్పులు, కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు ప్రారంభం అవుతాయి. సరైన మంచినీరు శరీరానికి మీరు అందించకపోతే, మలబద్దకం ఏర్పడి అనేక రుగ్మతలకు దారితీస్తుంది.
- ప్రతి మనిషీ రోజుకు 5,6 లీటర్ల నీరు తాగాలి.
- మంచి నీరు సమయానికి అందకపోతే డీహైడ్రేషన్‌కు గురై అదే సమయంలో మెటడాలిజం రేటు మూడు శాతం తగ్గిపోతుంది.
- మంచినీరు శరీరానికి అందకపోతే శరీరం నీరసించిపోతుంది. ఏకాగ్రత లోపిస్తుంది. ఏ పనిచేయలేరు. కళ్లుబైర్లు కమ్ముతాయి.
- ప్రతిరోజూ విధిగా 8,10 గ్లాసులు నీరు తక్కువ కాకుండా తాగేవారికి బ్లాడర్ కేన్సర్ సంభవించే అవకాశం తక్కువ.
- శరీరానికి నీటి శాతం తగ్గితే శరీర కాంతి కోల్పోతుంది. ముడతలు పడుతుంది. చర్మం వదులుగా అయిపోతుంది.
- కాఫీ తాగే అలవాటున్న వారు అదనంగా రెండు కప్పుల నీరు తాగాలి. కారణం కాఫీలోని కెఫైన్ కారణంగా మూత్రం అధికంగా వచ్చి శరీరం డీహైడ్రేషన్‌కు దారితీసే అవకాశం ఉంది. ఓ రకమైన తలనొప్పి కూడా వస్తుంది.
- మీ గుండె ఆరోగ్యంగా పనిచేయాలన్నా తప్పక పదిగ్లాసుల నీరు తాగాల్సిందే. అశ్రద్ధ చేయకండి.
- ఆహారం తిన్న రెండు గంటల అనంతరం నీరు తాగాలి.
- ఆహారంతో పాటు, ముద్ద ముద్దకూ నీరు తాగడం మంచి పద్ధతి కాదు.
గోళ్లు, జుట్టు, శరీరం అన్ని భాగాలూ ఆరోగ్యంగా ఉండాలంటే తగినన్ని మంచినీరు తాగాల్సిందే.
కిడ్నీలో రాళ్ళతో బాధపడేవారు ఎంత ఎక్కువగా నీరు తాగితే అంత మంచిది.
- మంచినీటిని పరిశుభ్రంగా ఉన్న ప్రదేశం నుండి వడకట్టి తాగడం మంచి పద్ధతి.
ఎక్కడ పడితే అక్కడ నీరును తాగకూడదు. ఆహారం వండటానికి, స్నానానికి పరిశుభ్రమైన నీటిని మాత్రమే వాడాలని గుర్తుపెట్టుకోండి.
Tuesday, October 21, 2014
Monday, October 6, 2014
8న సంపూర్ణ చంద్రగ్రహణం
8న సంపూర్ణ చంద్రగ్రహణం
ఈ నెల 8న సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించబోతోంది. ఆ రోజు మధ్యాహ్నం 2.44 గంటలకు మొదలయ్యే గ్రహణం సాయంత్రం 6.04 గంటల వరకూ కొనసాగుతుందని ఉజ్జయిని అబ్జర్వేటరీ అధికారులు ప్రకటించారు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖపైకి రానున్న ఆ సమయంలో దాదాపు 23 నిమిషాలపాటు చంద్రుడు కనుమరుగవుతాడు. సూర్య చంద్రులకు మధ్యలో భూమి రావడంతో ఏర్పడే ఈ అరుదైన అద్భుతాన్ని ఈశాన్య రాష్ట్రాల్లోని కోహిమా, దిబ్రూగఢ్, ఇంఫాల్ నగరాల ప్రజలు స్పష్టంగా చూడవచ్చు. ఈ ఏడాది ఇది రెండో చంద్రగ్రహణం కావడం విశేషం. ఏప్రిల్ 15న తొలి చంద్రగ్రహణం వచ్చిన సంగతి తెలిసిందే.
వర్మ ‘సావిత్రి’ పై వివాదం..!
Thursday, September 4, 2014
‘ఆగడు’లో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’… అంటున్న మహేష్
‘మీలో ఎవరు కోటీశ్వరుడు’… అంటున్న మహేష్
‘మీలోఎవరు కోటీశ్వరుడు’… టెలివిజన్ పరిశ్రమలోనే అత్యంత ప్రేక్షకాదరణ సాధించిన షో. ఈ షోను నాగార్జునకు బదులు మహేష్ బాబు నిర్వహిస్తే ఎలా ఉంటుంది? అవును.. ఇది జరిగింది. కానీ నిజంగా మాత్రం కాదండోయ్.. ఆగడు సినిమాలోనట. వేడివేడి తాజా కబుర్లన్నింటినీ తన సినిమాల్లో సరదాగా నవ్వుకోడానికి అద్భుతంగా పండించే అలవాటున్న దర్శకుడు శ్రీను వైట్ల ఆగడు చిత్రంలో ఈ ప్రయోగం చేశాడని సమాచారం.
నాగార్జునకు బదులు మహేష్ బాబు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ లాంటి షో నిర్వహిస్తాడని, అది కూడా ఏదో సరదా సన్నివేశంలా కాకుండా.. సినిమాకు చాలా ఉపయోగపడే అత్యంత కీలక సన్నివేశంలోనని సినిమా వర్గలు చెబుతున్నాయి. ‘దూకుడు’ సినిమాలో నాగార్జున నిర్వహించే రియాల్టీ షో కోసం పెన్ను కెమెరాను చూస్తూ బ్రహ్మానందం చెప్పే డైలాగును ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. ఇక ‘ఆగడు’లో ఈ కోటీశ్వరుడు షో ఇంకెంత సందడి చేస్తుందోనని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అది తెలియాలంటే మాత్రం మరొక్క 15 రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే, ఆగడు చిత్రం సెప్టెంబర్ 19వ తేదీన విడుదల అవుతుందని స్వయంగా మహేష్ బాబే ఆ చిత్ర ఆడియో రిలీజ్ సందర్భంగా వేదికపై ప్రకటించారు.
Tuesday, August 26, 2014
BSNL లో ఉద్యోగాలు
BSNL లో ఉద్యోగాలు
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ జూనియర్ టెలికం ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
1. జూనియర్ టెలికం ఆఫీసర్
దరఖాస్తు : అభ్యర్థులు దరఖాస్తులను నుంచి డౌన్‌లోడ్ చేయాలి.
చివరి తేదీ : 5. 9. 2014
దరఖాస్తు : అభ్యర్థులు దరఖాస్తులను నుంచి డౌన్‌లోడ్ చేయాలి.
చివరి తేదీ : 5. 9. 2014
మరిన్నివివరాలకు:
www.haryana.bsnl.co.in/hrybsnl/JTO_SRD.pdf
www.haryana.bsnl.co.in/hrybsnl/JTO_SRD.pdf
Friday, August 22, 2014
ప్లాస్టిక్ నోట్లు వచ్చేస్తున్నాయి......ప్లాస్టిక్ నోట్లు వచ్చేస్తున్నాయి.......
ప్లాస్టిక్ నోట్లు వచ్చేస్తున్నాయి
కరెన్సీ నోట్ల జీవితకాలాన్ని పెంచడానికి, నకిలీ నోట్లను అరికట్టడానికి వీలుగా వచ్చే సంవత్సరం నుంచి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని రిజర్వు బ్యాంకు భావిస్తోంది. మధ్యవర్తుల వ్యవస్థను పూర్తిగా అరికట్టేలా ప్రయత్నాలు చేస్తుంది. దీని కోసం కొత్తగా జాతీయ బిల్లుల చెల్లింపు వ్యవస్థను ఏర్పాటుచేయాలని కూడా యోచిస్తోంది. కరెన్సీ నోట్ల జీవిత కాలాన్ని పెంచాలని రిజర్వు బ్యాంకు భావిస్తున్నట్లు బ్యాంకు వార్షిక నివేదికలో పేర్కొన్నారు. ప్లాస్టిక్ నోట్లపై కొన్నేళ్లుగా చర్చలు జరిగిన తర్వాత.. గత జనవరిలోనే రిజర్వు బ్యాంకు టెండర్లు పిలిచింది. ముందుగా చేసే ప్రయోగం విజయవంతం అయితే వచ్చే ఏడాదికల్లా విస్తృతంగా వీటిని ఉపయోగంలోకి తేవాలని అనుకుంటున్నారు.
ప్లాస్లిక్ నోట్లు వచ్చేస్తున్నాయని, వంద కోట్ల నోట్లకు సంబంధించి టెండరు బిడ్లు వచ్చాయని , ముందుగా ఐదు నగరాల్లో ప్రయోగాత్మకంగా వీటిని ప్రవేశపెడతామని రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. ప్లాస్టిక్ నోట్ల మీద ఎలాంటి మరకలు పడవు, తొందరగా చిరిగిపోవు. ఇప్పటికే పలు దేశాల్లో పాలిమర్ కరెన్సీ నోట్లను ఉపయోగిస్తున్నారు. ఇవి ఇప్పుడున్న నోట్ల కంటే ఖరీదైనవే అయినా.. జీవితకాలం ఎక్కువ కావడంతో వీటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. విభిన్న వాతావరణ పరిస్థితులు ఉండే కొచ్చి, మైసూర్, జైపూర్, భువనేశ్వర్, సిమ్లా నగరాల్లో ముందుగా ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెడతారు. ముందుగా తక్కువ డినామినేషన్ ఉన్న నోట్లను తేవాలని యోచిస్తున్నారు.
Tuesday, August 19, 2014
బాహుబలి’ చిత్రం విడుదలకు ముందే రికార్డులు ‘రోబో’ ను దాటుతున్న’బాహుబలి’…!
రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘బాహుబలి’ చిత్రం విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. దక్షిణాదిలో ప్రఖ్యాత దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘రోబో’ చిత్రాన్ని తలదన్నడం ఖాయమని సినీవర్గాలు భావిస్తున్నాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న బాహుబలి సినిమా నిర్మాణదశలోనే భారీ బిజినెస్ చేస్తోందని వినవస్తోంది. ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాలకు జరిగిన బిజినెస్ 79 కోట్ల రూపాయలు దాటిపోయిందని సమాచారం. ఇంకా మరికొన్ని ఏరియాల హక్కులు అమ్ముడు కావాలసి ఉంది. అన్ని కలిపితే ఒక్క థియేటర్ హక్కులే 105 కోట్ల రూపాయల వరకు వస్తాయని అంచనా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి బాహుబలి చిత్రానికి రైట్స్ రూపంలో 77 కోట్ల రూపాయలలు వచ్చినట్లు అంచనా. కర్నాటక నుంచి 9 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ మరో 9 కోట్ల రూపాయలు వసూలు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
ఇవేకాకుండా, శాలిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ రూపంలో మరో 10 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు తమిళం, హిందీ భాషల థియేటర్రైట్స్ బిజినెస్ జరుగాల్సి ఉంది. వీటి ద్వారా 30 నుంచి 40 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరుగుతుందని అంచనా. దీంతో పాటు ఇతర భాషల్లోనూ సినిమా విడుదలవుతోంది. అన్ని కలిపితే ‘బాహుబలి’ విడుదలకు ముందు బిజినెస్ ‘రోబో’ బిజినెస్ క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
తెలుగు ప్రేక్షకులతోపాటు తమిళ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేసే అవకాశం ఉంది
Saturday, July 19, 2014
నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి.....భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి. పశ్చిమ రాజస్థాన్, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలకు విస్తరించిన రుతుపవనాలు.. రెండు రోజులు ఆలస్యంగా ఉత్తర అరేబియా సముద్ర ప్రాంతానికి చేరుకున్నాయి. దీంతో దేశమంతా నైరుతి రుతుపవనాలు విస్తరించినట్టేనని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
రుతుపవనాల విస్తరణతో దేశంలోని ఉత్తరాది ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఎండ వేడిమి, ఉక్కపోత నుంచి ఢిల్లీ వాసులకు ఉపశమనం కలిగింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో.. భారీ వర్షాలు పడొచ్చనే హెచ్చరికలతో అధికారులు కేదార్ నాథ్ తో పాటు బద్రీనాథ్ యాత్రను నిలిపివేశారు.
మరోవైపు ఒడిషా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో రెండు మూడు రోజుల పాలు వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణాలోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. రెండు రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
రుతుపవనాల విస్తరణతో అనేక సమస్యలు తీరనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీరనుందని తెలిపారు.
చార్ థామ్ యాత్ర నిలిపివేత.............,
చార్ ధామ్ యాత్రను అధికారులు నిలిపివేశారు. వర్షాలు కురవడంతో, వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. మొత్తం ఆరు ఎన్ డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో తలమునకలయ్యాయి. గౌరీకుండ్ వద్ద చిక్కుకున్న 165 మంది యాత్రీకులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. కేదార్ నాథ్, బద్రీనాథ్ లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు ఎన్ డీఆర్ఎఫ్ చర్యలు తీసుకుంటోంది.
అల్లు వారి వారసుడు అల్లు అయాన్......
తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ హాస్యనటుడు పద్మశ్రీ డా.అల్లురామలింగయ్య ఎన్నో వందల చిత్రాల్లో నటించి నవ్వుకు కేరాఫ్ అడ్రస్ గా మారిన విషయం తెలిసిందే. ఆయన వారసుడిగా పరిచయమై ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మిస్తూ తన నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ సంస్థ ప్రతిష్టను భారతదేశమంతా చాటిచెప్పారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. అల్లు వారి నట వారసుడిగా పరిచయమై తన స్టైలిష్ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్టైలిష్ స్టార్ గా చిరస్థాయిగా నిలబడిన అల్లు అర్జున్ ఇటీవలే తండ్రి అయిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల ముద్దుల తనయుడి పేరు అల్లు అయాన్. అభిమానులతో పాటు మీడియా కూడా అయాన్ ని చూసేందుకు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. రేసుగుర్రం ఆల్ టైం రికార్డ్స్ లో టాప్ 4 చిత్రంగా నిలబడడంతో అభిమానులు పండగ చేసుకుంటున్న సందర్భంలో హీరో అల్లు అర్జున్ మెగాభిమానులకు స్పెషల్ గిఫ్ట్ గా అయాన్ ఫొటోను విడుదల చేశారు.
నేడే దక్షిణాఫ్రికా మహాత్ముడి జయంతి ....
నల్లసూరీడు, మడీబా.. నెల్సన్ మండేలా 96వ జన్మదినం నేడే...దక్షిణాఫ్రికాలో జాతివివక్షకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసిన నాయకుడు. ఆ దేశంలో ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నేత, దక్షిణాఫ్రికా మహాత్ముడు నెల్సన్ మండేలా...స్వాతంత్రపోరాటంలో ఓ మారణకాండకు సంబంధించి 27 సంవత్సరాల పాటు రోబెన్ అనే ద్వీపంలో జైలు శిక్షను అనుభవించారు. 20వ శతాబ్దపు అత్యంత సుప్రసిద్ద వరల్డ్ లీడర్స్ లో మండెలా ఒకరు. వర్ణ సమానత కోసం ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కుని తన జీవితాన్నే పణంగా పెట్టిన నేత నెల్సన్ మండేలా...శాంతియుత ఉద్యమంతో అనుకున్నది సాధించిన మడీబాకు 1993లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. గాంధేయ మార్గంలో జీవితాన్ని మలుచుకున్న తీరు ఆయనకు దక్షిణాఫ్రికా గాంధీ అన్న గొప్పపేరు సాధించిపెట్టింది.
కింగ్ కోబ్రా సంరక్షణలో చంటిపాప...
ఒక్క కాటు పడితే పై ప్రాణాలు పైనే లేచిపోతాయి. అంతటి విషం కలిగిన కింగ్ కోబ్రా నాగరాజులు ఆ పాపపై పడగ విప్పి రక్షణ కలిగిస్తున్నాయి. దృశ్యం చూస్తే బెదిరిపోయేలా చేస్తుంది. కానీ ఏకారణంగానో ఆపాపను నాలుగు కింగ్ కోబ్రాలు రక్షిస్తున్నాయి. పాపను చక్కగా కాపలా కాస్తున్నాయింటే సరిగ్గా సరిపోతుంది. ఎవరయినా కాస్త ముందుకు వస్తే కాటేసేందుకు రెడీగా ఉన్నాయి. అవి ఎందుకలా చేస్తున్నాయో తెలియదు. భారత్ లో కనిపించే అయిదు మీటర్ల పొడవుండే కింగ్ కోబ్రాపాములని మాత్రం తెలుసు... ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో రాజ్యమేలుతోంది.
Sunday, July 13, 2014
పురుషులకు కూడా తప్పని లైగింక వేధింపులు
ఈ సంఘటన మిగిలిన అన్ని సంఘటల కంటే
భిన్నమైంది. కార్పోరేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై వారి బాసులు
లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు ఈ మధ్య కాలంలో తరచూ వెలుగు
చూస్తున్నాయి. కాని ఇలా మహిళా బాసులు కూడా వేధింపులకు గురిచేస్తారు అన్న
విషయం అందరికి షాక్ కు గురిచేస్తుంది. అందుకు నిదర్శనమే తాజాగా యాహూ
సంస్థలో జరిగిన ఈ సంఘటన. తన మహిళా బాసు కోరికను తీర్చలేదన్న కారణంగా తనను
వేధింపులకు గురి చేయడమే కాక తన ప్రోగ్రెస్ రిపోర్టులను కూడా
నీరుగార్చేసిందని సంస్థకు చెందిన ఓ మహిళా ఉద్యోగి కాలిఫొర్నియా కోర్టులో
కేసు దాఖలు చేసింది. వివరాల్లోకి వెళితే... అలైక్ అనే మొబైల్ కంపెనీని
ప్రారంభించిన మారియా ఝాంగ్, ఆ తర్వాత తన కంపెనీని యాహూకు విక్రయించడంతో
పాటు యాహూ మొబైల్ లో సీనియర్ డైరెక్టర్ గా విధుల్లో చేరిపోయారు. మారియా
విభాగంలోనే ప్రిన్సిపల్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న నాన్ షిపై
లైంగిక వేధింపులకు దిగారట. తనతో ఓరల్ సెక్స్ చేయాల్సిందిగా మారియా
బలవంతపెట్టేదని, దీనిపై పర్సనల్ డిపార్ట్ మెంట్ కు ఫిర్యాదు చేసినా, సంస్థ
పట్టించుకున్న పాపాన పోలేదని షి కోర్టుకు విన్నవించారు. ఇదిలా ఉంటే,
మారియాపై వచ్చిన ఆరోపణలు సత్యదూరమని సంస్థ ప్రతినిధి కొట్టిపారేశారు.
మారియా తరఫున న్యాయ పోరాటం సాగిస్తామని కూడా సంస్థ తెలిపింది. తన కోరిక
తీర్చని కారణంగా మారియా 2013లో రెండు, మూడు త్రైమాసికాలకు సంబంధించిన తన
ప్రోగ్రెస్ రిపోర్టులను నీరుగార్చిందని కూడా షి తన ఫిర్యాదులో పేర్కొంది.
మరోవైపు దీర్ఘకాలం పాటు సెలవులో వెళ్లిన షి ని కంపెనీ ఆమె స్థానం నుంచి
తప్పించింది.
Friday, July 11, 2014
టీఆర్ఎస్.. బిల్లు ఆమోదంపై అసంతృప్తి వ్యక్తం.......మా గొంతు నొక్కేశారు KCR
ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో సవరణలు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది. తెలంగాణ, ఒడిషా, చత్తీస్ గఢ్ ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపినా.. మూజువాణి పద్దతిలో బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు ఆమోదం లభ్యం కావడంతో.. పోలవరం ముంపు ప్రాంతాల్లోని 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ లో కలవనున్నాయి. భద్రాచలం మండలంలో భద్రాచలం పట్టణం మినహా అన్ని గ్రామాలు ఏపీలో కలవనున్నాయి.
పోలవరం ఆర్డినెన్స్ ను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్.. బిల్లు ఆమోదంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రప్రభుత్వం మొండిగా వ్యవహరించిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. పోలవరం డిజైన్ మార్చాలని.. తాను గతంలోనే కేంద్రప్రభుత్వాన్ని కోరానని.. అయినా పట్టించుకోలేదన్నారు.
తమ ఎంపీలు ఎంత పోరాటం చేసినా కేంద్రం తమకు ఉన్న మందబలంతో తమ గొంతు నొక్కేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తో పాటు గా ఒరిస్సా, చత్తీస్ గడ్ రాష్ట్రాల ప్రజల , ప్రభుత్వాల మనోభావాలను పట్టించుకోలేదని అన్నారు. తమ రాష్ట్ర హక్కులను కాలరాశారని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
బిల్లుకు పార్లమెంట్ లో ఆమోదం లభించినప్పటికీ.. 7 మండలాలను కాపాడుకునేందుకు కార్యాచరణను ప్రభుత్వ పరంగా ఆలోచిస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులతో చర్చించి.. సుప్రీంకోర్టుకేళ్లే విషయంపై.. మంతనాలు జరుపుతున్నారు
Thursday, July 10, 2014
24 గంటల విద్యుత్ సరఫరా...ఆంధ్రప్రదేశ్ కు
కేంద్రం ప్రకటించిన 24 గంటల విద్యుత్ సరఫరా పథకంలో ఆంధ్రప్రదేశ్ ను ఎంపిక చేసినట్లు మంత్రి పల్లెరఘునాథరెడ్డి తెలిపారు. అలాగే ఈ ఏడాది కేంద్రం ఏపీకి 2 వేల మెగావాట్ల విద్యత్ ను ఇవ్వనుందని చెప్పారు. ఇవాళ జరిగిన ఏపీ మంత్రి వర్గ సమావేశంలో రుణమాఫీతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. విజన్ 2020ను సవరించి విజన్ 2029గా మార్చే అంశంపై సమాలోచనలు జరిపారు. బోధనా రుసుం, ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ అంశాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ కు చంద్రబాబు లేఖ రాయనున్నారు. అలాగే ఎయిడెడ్ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయస్సును 60కి పెంచే అంశంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది
చేపను వేటాడితే జైలు శిక్ష
నల్లమచ్చలతో భారీగా ఉన్న ఈ చేప పేరు బొగ్గు సొర. బుధవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మత్స్యకారుల వలకు చిక్కింది. సుమారు 12 టన్నుల ఉన్న ఈ చేపను ఒడ్డుకు తీసుకువస్తే కేవలం రూ.15 వేలు మాత్రమే వచ్చిందని వారు వాపోతున్నారు మూడేళ్ల క్రితం ఈ చేపను అంతరించి పోతున్న మత్స్యజాతుల్లో చేర్చారు. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద ఈ చేపను వేటాడితే సుమారు ఏడేళ్ల జైలు శిక్ష భారీగా జరిమాన విధిస్తారు. దీనిపై మత్స్యకారులకు అవగాహన లేకపోవడంతో ఎంతో కొంత ధర వస్తుందని ఇలా వడ్డుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికైనా సంబంధితా అధికారులు వారిలో చైతన్యం కలిగించాల్సివుంది
Monday, July 7, 2014
వాహ్.. కేసీఆర్.......
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలుకుని రెవెన్యూ డివిజన్ అధికారి వరకు పది జిల్లాల అధికార గణం మొత్తం కొలువు తీరిన వేదికలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన ప్రసంగంతో విస్మయ పరిచారు. గ్రామంలో డంప్ యార్డ్ మొదలుకొని తెలంగాణ వాతావరణం వరకు ప్రతి అంశంపై సాధికారికంగా ఆయన ప్రసంగించిన తీరు అధికారులను విస్తుపోయేట్టు చేసింది. సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరులు అభివృద్ధి కేంద్రంలో నవ తెలంగాణపై సమావేశం నిర్వహించారు. కేసిఆర్ అధికారులకు కొత్తేమీ కాదు. గత 13 ఏళ్ల నుంచి తెలంగాణ ఉద్యమ నాయకుడిగానే ఆయన వారిగా బాగా తెలుసు. ప్రత్యర్థులు, మీడియా ఆయనపై చేసిన ప్రచారం ఆధారంగా కేసిఆర్‌పై ఒక అంచనాకు వచ్చిన అధికారులు ఈ రోజు జరిగిన సమావేశంతో తమ ఆలోచనలను మార్చుకున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, జిల్లాల భౌగోళిక స్వరూపం, గ్రామాల్లో సమస్యలు విషయం ఏదైనా కావచ్చు సాధికారికంగా వాస్తవిక దృక్ఫథంతో ఆయన మాట్లాడిన తీరు అధికారులను ఆలోచనల్లో పడేసింది. ఉద్యమ నాయకుడు సరే పాలనపై ఆయను ఉన్న అనుభవం ఎంత? అవగాహన ఎంత? అనుకున్న కొందరు అధికారులు మా ఆలోచనలు మార్చే విధంగా కేసిఆర్ ఉపన్యాసం సాగిందని చెప్పుకొచ్చారు.
అంతర్జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ ఇక్రిసాట్ హైదరాబాద్‌లో ఉందనే విషయం అధికారులందరికీ తెలిసిందే? కానీ అది హైదరాబాద్‌లోనే ఎందుకు ఉందో కేసిఆర్ వివరించిన తీరు అధికారులను విస్మయపర్చింది. ఎర్రరేగడినేల,నల్లరేగడి నేల కలిసి ఉన్న అరుదైన ప్రాంతం అది, విత్తనాభివృద్ధికి ప్రపంచంలోనే అరుదైన ప్రాంతం. అందుకే ఇక్కడ ఆ కాలంలోనే ఇక్రిసాట్‌ను ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. పంచాయితీరాజ్ విధానాన్ని మనం నిర్వీర్యం చేశాం కానీ అసలైన లక్ష్యం ఏమిటో? అధికారులకు చెప్పుకొచ్చారు.స్వాతంత్య్రం లభించి ఆరు దశాబ్దాలు అవుతున్నా గ్రామానికి ఒక డంప్ యార్డ్ ఉండాలనే ఆలోచన మనకు కలగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్లు తమ వద్దకు వచ్చే గ్రామీణులతో, కింద స్థాయి ఉద్యోగులతో తెలుగులోనే మాట్లాడాలని సూచించారు. వినడానికి చిన్న మాటగానే కనిపించవచ్చు. కానీ ఇంగ్లీష్‌లో మీరు ఏదో మాట్లాడితే వారు మీ వద్దకు రావడానికే జంకుతారు.తమదైన భాషలో మాట్లాడితే మీపై నమ్మకం పెరుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు. బ్రీటీష్ కాలం నాటి కలెక్టర్లుగా ఉండొద్దని, ప్రజాస్వామ్యంలో ప్రజల కలెక్టర్‌గా నిలవాలని వివరించారు. పాలనలో ,ప్రణాళిక రూపకల్పనలో అన్నింటిలో తెలంగాణ ముద్ర ఉండాలని చెప్పుకొచ్చారు. కొన్ని లక్షల మంది వచ్చిన బహిరంగ సభలోనైనా కేసిఆర్ అరగంటకు మించి మాట్లాడరు. 15-20 నిమిషాల్లోనే ఉపన్యాసం ముగించిన సభలు కూడా ఉన్నాయి.
అలాంటిది ఆయన తొలి సమావేశంలో రెండున్నర గంటల పాటు మాట్లాడారు. 11గంటలకు ప్రారంభం అయిన సమావేశంలో మధ్యాహ్నాం రెండున్నర వరకు ప్రసంగించి, మనం టీ బ్రేక్ తీసుకుందాం అనగానే పక్కన ఉన్న వారు లంచ్ టైం అయిందని గుర్తు చేశారు. దానికి కేసిఆర్ నవ్వుతూ నేను ఎక్కువ సమయం తీసుకున్నాను, తెలంగాణ కోసం ఏం చేయాలని నేను కోరుకుంటున్నానో మీకు అర్ధం అయి ఉంటుందని అన్నారు. అంకెల కోసం కాగితాలను చూడకుండా అన్ని అంశాలపై అనర్ఘళంగా ప్రసంగించారు. ఇది ఉన్నతాధికారులకు తెలంగాణపై శిక్షణ కార్యక్రమంగా సాగింది. ముఖ్యమంత్రిగా కేసిఆర్ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఉన్నతాధికారులతో ఆయా శాఖల గురించి సమీక్షలు నిర్వహించడం తప్ప విస్తృతంగా సమావేశం నిర్వహించడం ఇదే మొదటి సారి. ఐఎఎస్ అధికారులు, ప్రభుత్వ సలహాదారులు, మంత్రులు, రెవెన్యూ డివిజన్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. కేసిఆర్ ఉపన్యాసం విన్నాక వాహ్ కేసిఆర్ వాహ్ అనుకోకుండా ఉండలేకపోయామని అధికారులు చెప్పుకొచ్చారు.
విద్యుత్ రంగంలో ఆంధ్రకు మహర్దశ
విద్యుత్ రంగంలో ఆంధ్రకు మహర్దశ పట్టనుంది. నిరంతర విద్యుత్ సరఫరాకు వీలుగా కేంద్రం ఎంపిక చేసిన రెండు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఈ క్రమంలో నిరంతర విద్యుత్ పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిరంతర సమీక్ష మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం పైసా వెచ్చించాల్సిన పని లేకుండానే ఈ పథకాన్ని కేంద్రం అమలుచేస్తుంది. తొలిదశలో వెయ్యి కోట్లు వెచ్చించేందుకు అపుడే కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. విద్యుత్ అదుపు- పొదుపుపై కేంద్రం నియమించిన త్రిసభ్య కమిటీ సోమవారం రాష్ట్రానికి చేరుకుంది. కమిటీకి ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసస్ లిమిటెడ్ చైర్మన్ సౌరభ్‌కుమార్ నాయకత్వం వహిస్తున్నారు. సోమవారం విద్యుత్ సౌదాలో సుదీర్ఘ సమీక్ష అనంతరం రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితులను మెరుగుపర్చేందుకు రానున్న రెండేళ్లలో వెయ్యి కోట్లు కేటాయించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. మరోపక్క ఈ బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పరిస్థితిని వివరించారు.
ఇదిలావుంటే, విద్యుత్ సంస్థలను ఆర్ధికంగా, సాంకేతికంగా బలోపేతం చేస్తూ వినియోగదారులకు నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్ అందించాలనే ధృడ సంకల్పంతో రాష్ట్రం ఉంది. కరెంటు పొదుపునకు అన్ని చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఎన్టీపిసి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇఆర్‌సి, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌ల భాగస్వామ్యంతో విద్యుత్ పొదుపు కమిటీ ఏర్పాటైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తక్కువ విద్యుత్‌తో ఎక్కువ ప్రయోజనం కలిగించే విధంగా ఎల్‌ఇడి విద్యుద్దీపాల వ్యవస్థను ఆధునీకరించడం, నాణ్యమైన పంపుసెట్లను వినియోగించడం ద్వారా విద్యుత్ వృథాను అరికట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. తొలిదశలో ఈ పథకాన్ని 24 మున్సిపాల్టీల్లో అమలు చేస్తారు.
భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, కాకినాడ, తుని, చీరాల, ఒంగోలు, నర్సారావుపేట, తెనాలి, నెల్లూరు, అనంతపురం, ధర్మవరం, గుంతకల్, తాడిపర్తి, హిందూపూర్, మదనపల్లి, తిరుపతి, కర్నూలు, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూర్, గుంటూరులో అమలు చేస్తారు. విద్యుత్ పరిస్థితిపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్షించారు. విద్యుత్ పొదుపు, సామర్థ్యం అంశాలపై కమిటీతో చర్చించి ప్రణాళికను ఖరారు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ముఖ్యమంత్రికి తెలిపారు. సమీక్షల్లో ముఖ్యమంత్రి కార్యదర్శి జి సాయిప్రసాద్, ముఖ్యకార్యదర్శి డి సాంబశివరావు, ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్, ఎండి కె విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.
రిలయన్స్ మీడియా, అంబానీల ఆలోచనల సామ్రాజ్యం
రిలయన్స్ మీడియా, అంబానీల ఆలోచనల సామ్రాజ్యం
రిలయన్స్ ను నెట్ వర్స్ 18 మీడియా సంస్థల కంపెనీని నాలుగు వేల కోట్లు వెచ్చించి కైవసం చేసుకుంది. దీంతో టివి ఛానల్స్ డిజిటల్ మీడియా తో సహా అనేక ప్రసార మాధ్యమాలు రిలయన్స్ యాజమాన్యంలోకి వచ్చాయి. ఇందులో ఇంగ్లీషు, హిందీ ఛానల్స్ వున్నాయి. రాజకీయాలు ఆర్ధిక రంగం వినోదం ఇలా అనేక ప్రసారాలను ఇవిచేస్తాయి. ఈ పరిణామం తో అంబానీల చేతుల్లోకి వెళ్ళిన మీడియా సంస్థలు : IBNLIVE.COM, MONEYCONTROL.COM, FIRSTPOST.COM, CRICKETNEXT.IN, HOMESHOP18.COM, BOOKMYSHOW.COM; టీవీ ఛానల్స్: COLORS, CNNIBN, CNBC TV18, IBN7, CNBC AWAAZ.
ఫ్రేమ్‌లోకి రోజా..!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రసంగించినా, ఆ పార్టీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా టివీ ఛానళ్ళలో కనిపించారు. జగన్ మాట్లాడినప్పుడల్లా మీరే కనిపిస్తున్నారేమిటీ? అని ఓ విలేఖరి ఎమ్మెల్యే రోజాను ప్రశ్నించగా, జగన్ మాట్లాడినప్పుడు తానూ టివీల్లో కనిపించేలా వెనక వరుసలోనే కూర్చుంటున్నానని ఆమె బదులిచ్చారు. టివీల్లో కనిపిస్తే మా ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉన్నారని అనుకుంటున్నారని, లేకపోతే అసెంబ్లీకి వెళ్ళలేదని నియోజకవర్గం ప్రజలు అనుకుంటారని ఆ విధంగా ప్రేమ్‌లోకి వచ్చేలా కూర్చున్నానని చెప్పారు. ఎంతైనా ఆర్టిస్టును కదా..కెమెరాలో ఎలా కనపడాలో ఆ మాత్రం తెలియదా? అని ఆమె అనడంతో అక్కడున్న మిగతా వారంతా గొల్లుమని నవ్వారు. అదీ ఒక ‘ఆర్టే’నని సదరు విలేఖరి అనడంతో రోజాతో సహా అందరూ మరోసారి నవ్వారు.
విడిది గృహంలో యువతులు… రేప్ చేసిన ఇద్దరు పోలీసులు
విడిది గృహంలో జీవనం సాగిస్తున్న యువతులపై ఇద్దరు పోలీసులు అత్యాచారానికి పాల్పడి అడ్డువచ్చినవారిని చితకబాదిన తమ రాక్షస క్రీడను సాగించిన ఘటన చెన్నైలోని విరుగంబాకంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే… విరుగంబాక్కలో ఓ స్వచ్చంద సంస్థ నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో 20 మంది మహిళలు జీవనం సాగిస్తున్నారు.
వీరిపై కన్నేసిన విరుగంబాక్కం పోలీసు స్టేషనుకు చెందిన 41 ఏళ్ల హెడ్ కానిస్టేబుల్ రాజా, 32 ఏళ్ల కానిస్టేబుల్ కుమరేషన్ బాగా మద్యం సేవించి యువతులపై అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న ఆశ్రమ నిర్వాహకురాలు అయేషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారని తెలుసుకున్న ఇద్దరూ పరారయ్యారు.
కాపురాల్ని కూల్చేస్తాయి టీవీ సీరియల్స్..........
మీ వైవాహిక జీవితం ఆనందంగానే సాగుతోందా…లేక ఏమైనా సమస్యలున్నాయా? మీ జీవిత భాగస్వామిలో ఎవరైనా అదేపనిగా టీవీలో వచ్చే సీరియల్స్‌ను చూసేస్తున్నారా? మిమ్మల్ని వేధించుకుని తింటున్నారా? అయితే వెంటనే టీవీని బద్ధలు కొట్టేయండి. పుసుకున్న ఆ పని చేసేరు గనక. సదరు సీరియల్స్‌ను చూడ్డం మానేస్తే సరిపోతుంది. అసలు విషయం ఏంటంటే… దాంపత్య జీవితంలో సమస్యలకు సీరియల్స్‌తో సంబంధం ఉందని అంటున్నారు పరిశోధకులు.
ఆనందకరమైన జీవితంలో చిచ్చు రేపడానికి సీరియల్స్ కారణమని మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన పరిశోధనలో తేలిందంటున్నారు. ప్రతి రోజూ కచ్చితంగా సీరియల్‌ను చూసే అలవాటు కచ్చితంగా వాళ్ల వైవాహిక జీవతంపై ప్రభావం చూపుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. భార్యాభర్తలు ఆనందంగా ఉండాలంటే సీరియల్స్‌కు దూరంగా ఉండాలని పరిశోధకులు గట్టిగా సూచిస్తున్నారు. జీవిత భాగస్వామి సీరియల్స్ చూస్తూ ఉంటే మాత్రం అది మీ దాంపత్య జీవితాన్ని నాశనం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
Friday, July 4, 2014
ఎన్టీఆర్ డెసిషనే ఫైనల్
- సాధారణంగా ఒక సినిమాకు ఎటువంటి క్యాస్ట్ అండ్ క్రూ కావాలన్నది డైరెక్టర్ నిర్ణయిస్తారు. కానీ ఈ లెక్క అన్ని సార్లూ నిజమవ్వదు. స్టార్ హీరోలను అప్పుడప్పుడే లైం లైట్ లోకి వస్తున్న డైరెక్టర్ లు డైరెక్ట్ చెయ్యాల్సి వచ్చినప్పుడు సదరు ఈ పెద్ద హీరోలే సినిమాలో ఎవరుంటే బాగుంటుంది, ఎవరిని తీసేస్తే హిట్ అవుతుంది వంటి విషయాలు చెప్పుకొస్తూ వుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఒక స్టార్ డైరెక్టర్ కి కూడా వచ్చింది.
- ఎన్.టి.ఆర్ తో పూరి సినిమాకు పాపం పూరి అనుకున్నవి ఏవి సజావుగా సాగడంలేదు.కెరీర్ లో మొదటిసారి పూరి తన కధను కాకుండా వక్కంతం వంశీ రాసుకొచ్చిన కధను తెరకెక్కించే క్రమంలో వున్నాడు. ఇటీవలే ఈ సినిమాను 100 రోజుల్లో పూర్తి చేస్తాను, 2015 సంక్రాంతికి విడుదల చేస్తాను అంటూ స్టేట్మెంట్ లు ఇచ్చినందుకు సినిమానే మొదలుకాకుండా రిలీజ్ డేట్ లు ప్రకటించకు అంటూ నందమూరి వర్గం నుండి అక్షింతలు పడ్డాయట. ఇక తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ కోసం మరోసారి పూరి వెనక్కి తగ్గాల్సి వచ్చింది.సాధారణంగా కొత్త నాయికలను పరిచయం చేసే పూరి ఈ సినిమాతో ఆలియా భట్ ని తెలుగు తెరకు చూపిద్దాం అనుకున్నాడు. ఇటీవలే ఈ భామ చేసిన స్టేట్మెంట్ లు కూడా పాజిటీవ్ గా వుండడం తో తనని ఈ సినిమా నేపధ్యంలో కలిసాడని కూడా సమాచారం. అయితే మన బుడ్డోడికి ఈ భామ కంటే కాజల్ అయితేనే సినిమాకు బెస్ట్ అని తోచిందట. వేరే ఏ ఆలోచనలు పెట్టుకోకుండా కాజల్ ని ఫైనలయిజ్ చెయ్యమని దర్శకుడికి, నిర్మాత బండ్ల గణేష్ కి చెప్పాడని సినిమాలో హీరోయిన్ కాజలేనని కన్ఫర్మ్ అయినట్టు సమాచారం.
Thursday, July 3, 2014
టార్గెట్ చేసిన పవర్ స్టార్
అస్సలు ఈ ఏడాది పవన్ కల్యాణ్ నుంచి ఒక్క సినిమా అయినా వస్తుందా రాదా అనే డౌట్స్ అందర్లో ఉన్నాయి. కానీ పవన్ కల్యాణ్ సినిమా ఈ ఏడాది వస్తోంది. వెంకటేష్ తో చేస్తున్న గోపాలా..గోపాలా సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. దీపావళి కానుకగా అక్టోబర్ 23న పవన్ సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది.
గతేడాది సెప్టెంబర్ 27న అత్తారింటికి దారేది సినిమాని విడుదలచేశాడు పవన్. సరిగ్గా మళ్లీ ఏడాది తర్వాత అక్టోబర్ 23న గోపాలా.గోపాలాని రిలీజ్ చేస్తున్నాడు. మళ్లీ ఏడాది గ్యాప్ తర్వాత గబ్బర్ సింగ్-2ని తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ గ్యాప్ లో మరోసారి రాజకీయాలపై దృష్టిపెట్టబోతున్నాడు పవర్ స్టార్. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున అభ్యర్థుల్ని బరిలోకి దింపడానికి ప్రయత్నిస్తున్నాడు.
మహేష్ ను. ‘క్రిష్ణమ్మ పిలిచింది’ .....
కెరీర్ లో ఇప్పటి వరకు గెస్ట్ రోల్ లో కనిపించలేదు సూపర్ స్టార్ మహేష్ బాబు. కానీ త్వరలోనే ఫ్యాన్స్ కు ఆ ముచ్చట తీర్చనున్నాడు. గెస్ట్ రోల్ లో నటించాల్సిందిగా మహేష్ ను ‘క్రిష్ణమ్మ పలిచింది’. అర్థం కాలేదా.. మహేష్ బావ సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క్రిష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. ఈ సినిమాలో బావ కోసం ఓ గెస్ట్ రోల్ చేస్తున్నాడంట మన ప్రిన్స్. మహేష్ కోసం ప్రత్యేకంగా మంచి సీన్ క్రియేట్ చేశారట. ప్రస్తుతం ‘ఆగడు’ మూవీ షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్న మహేష్.. షూటింగ్ పూర్తయిన వెంటనే సుధీర్ బాబు సినిమాలో చేరనున్నాడట.
ఇప్పటి వరకైతే మహేష్ కేమియో రోల్ లో నటించలేదు. కాకపోతే జల్సా, బాద్షా సినిమాలకు వాయిస్ ఓవర్ అందించాడు. అనుష్క నటిస్తున్న రుద్రమాదేవి లో గెస్ట్ రోల్ చేస్తాడని వార్తలొచ్చినా.. అది కుదరలేదు. తాజాగా సుధీర్ బాబు సినిమాలో నటిస్తుండటంతో ఫ్యాన్స్ కు పండగే. ఇక సుధీర్ బాబు సినిమాను కన్నడ డైరెక్టర్ చంద్రు తెరకెక్కిస్తున్నాడు. కన్నడంలో చార్మినార్ పేరుతో వచ్చిన ఈ సినిమాకు కూడా చంద్రే డైరెక్టర్. ఇక ఈ సినిమాలో సుధీర్ కు జోడిగా నందిత నటిస్తోంది. గిరిబాబు, ఎమ్.ఎస్.నారాయణ.. తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Saturday, June 28, 2014
N Convention Center is built on Gurukul Trust land - GHMC - N Convention Hall Controversy
N Convention Center is built on Gurukul Trust land - GHMC - N Convention Hall Controversy
మొబైల్‌తో నెట్ లేకుండానే ఫేస్‌బుక్
ఇకమీదట నెట్ లేకుండానే ఫేస్‌బుక్ ఓపెన్ చేసుకోవచ్చు.ఈ అవకాశాన్ని వినియోగదారులకు బీఎస్ఎన్‌ఎల్ కల్పిస్తోంది. అన్‌స్ర్టక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా ద్వారా ఫేస్‌బుక్ సేవలను అందించేందుకు యూ2 ఓపియా మొబైల్‌తో ఈ మేరకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అన్నిరకాల హ్యాండ్ సెట్లలోనూ ఈ సేవను పొందవచ్చు. ప్రస్తుతానికి కొన్ని జోన్లకు పరిమతమైన ఈ సేవలను త్వరలో దేశవ్యాప్తంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే మూడురోజుల ఈ ప్లాన్ వినియోగించుకుంటే రూ. 4, వారం,నెలవారీకి రూ. 10, 20లను చెల్లించాల్సివుంది.
టెలికాం సంస్థల ఆఫర్లు+ఛార్జీల పెంపు
ఛార్జీల పెంపులో పోటీపడుతున్న టెలికాం సంస్థలు ఇప్పుడు కనెక్షన్లు పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నాయి. తమ నెట్ వర్క్ పరిధిలో చేసుకునే కాల్స్,ఎస్ ఎంఎస్ లకు తక్కువ టారిఫ్ తోను,అపరిమిత సంఖ్యలోను అనుమతిసున్నాయి. తక్కువ ఖర్చుతో మాట్లాడుకునేందుకు ప్రస్తుత కనెక్షన్ దారులు,తమ సన్నిహితులు మరికొందరికి అవే నెట్ వర్క్ కనెక్షన్లు ఇప్పిస్తున్నారు. కొత్తగా కనెక్షన్లు తీసుకునే వారినీ ఈ ఆఫర్లు ఆకర్షిస్తున్నాయి. గతంలో ఎయిర్ టెల్ ఖాతాదారు ఐడియా కనెక్షన్ కు కాల్ చేస్తే,అతనికి అమల్లో ఉన్న టారిఫ్ ప్రకారం ఛార్జీ పడేది. ఎయిర్ టెల్ సంస్థ,ఐడియాకు నిమిషానికి 20పైసలు చెల్లించాల్సి వస్తోంది. అదే సొంత నెట్ వర్క్ పరిధిలో అయితే ఇలా ఆదాయం పంచాల్సిన పనిలేదు. ఇందుకోసమే సంస్థలు కొత్త పద్ధతికి తెరతీశాయి.
మొబైల్ ప్రపంచంలో బ్లాక్ బెర్రీ Z3
బ్లాక్ బెర్రీ Z3మొబైల్ ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ లు రోజు రోజుకు కొత్త టెక్నాలజీతో దూసుకవస్తున్నాయి. తాజగా బ్లాక్ బెర్రీ Z3 పేరుతో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. దీని ఖరీదు భారత మార్కెట్ లో 15,990 రూపాయలు. ఐదు ఇంచుల డిస్ ప్లే తో పాటు బ్లాక్ బెర్రీ మ్యాప్స్ ఆప్ ను అందిస్తోందని కంపెనీ తెలిపింది. లోకల్ సర్చ్, వాయిస్ తో జీపీఎస్ నావిగేషన్ సిస్టం ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకత. ఫాక్స్ కాన్ తో కలిసి Z3 స్మార్ట్ ఫోన్ విడుదల చేసినట్టు బ్లాక్ బెర్రీ ప్రతినిధి సునీల్ లవానీ వెల్లడించారు. జూన్ 25 నుంచి మార్కెట్ లో అందుబాటులో ఉంటుందని తెలిపారు.
Friday, June 27, 2014
చైనాలో గొల్లం అనే వింతజీవి కలకలం
చైనా గుట్టల మధ్య వింతజీవి దర్శనమిచ్చింది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అడుగు భాగంలో వింత చర్మం రంగుతో,అంతకన్నా వింతైన చెవులతో ఓ వింత జీవి దర్శనమిచ్చింది. దాన్ని చూసిన వారికి పై ప్రాణాలు పైకే పోయాయి. ఎవరో ఒకరు మాత్రం ధైర్యం చేసి తన కెమెరాలో వింత జీవిని బంధించాడు. రాళ్ల మధ్య కూర్చుని ఉన్న ఆ వింత జీవిని చైనీయులు గొల్లం అని పేరు పెట్టుకున్నారు. ఇక ఇంటర్నెట్ అంతా గొల్లం సందడే.32000 మంది గొల్లం బొమ్మను రీపోస్ట్ చేశారు. లక్షలాది మంది కామెంట్ చేశారు.
చైనా అంతా గొల్లం కబుర్లే.
చైనా ప్రభుత్వం కూడా రంగంలోకి దిగి, ఈ వింత జీవి గురించి విచారణ మొదలుపెట్టింది. అప్పుడు ఉన్నట్టుండి ఒకవ్యక్తి ముందుకొచ్చి గొల్లం వింత జంతువు కాదు. అది నేనే. ఆ వేషం వేసింది నేనే. ఓ టీవీ యాడ్ కోసం నేను ఆవేషం వేశాను అని తన చిత్రాలను, తన మేకప్ దృశ్యాలను విలేఖరులకు చూపించాడు. అయినా ప్రజలు నమ్మలేదు. చివరికి ప్రజల ముందే మేకప్ వేసుకున్నాడు. అప్పటికి గానీ ప్రజలు గొల్లం అనే భూతం లేదని ఒప్పుకోలేదు.
Sunday, June 8, 2014
TRS Chief Kalvakuntla Chandrasekhar Rao has taken the oath as the first ever Chief Minister of Telangana
TRS Chief Kalvakuntla Chandrasekhar Rao has taken the oath as the first ever Chief Minister of Telangana state at Raj Bhavan . Governor ESL Narsimhan facilitated KCR 's oath taking ceremony . It is really a befitting moment for whole of Telangana to see the torch bearer of Telangana movement KCR as the Chief Minister of the state and many hopes and expectations are surrounding the new Government . Hope KCR comes out with flying colors and fulfill the aspirations of four crores of Telangana people .
Chandra Babu Naidu taking oath as AP CM
Telugu Desam Party (TDP) President N Chandrababu Naidu will be sworn in as the first Chief Minister of new Andhra Pradesh at a grand function today.
Governor E S L Narasimhan will administer the oath of office and secrecy to Mr Naidu at a public function to be held at Nagarjuna Nagar between Vijayawada and Guntur at 7.27 pm.
Some Cabinet ministers will also be sworn-in, but their exact number is not known yet.
A host of dignitaries, including 15 Union ministers, six Chief Ministers of various states, film stars and veteran BJP leaders like L K Advani and Murali Manohar Joshi, besides chief ministers of Gujarat, Chhattisgarh, Rajasthan, Odisha, Punjab and Goa are expected to attend,
Monday, April 7, 2014
Bhadrachalam is the abode of Sri Sita Ramachandra Prabhu. The Bhadrachalam Temple is situated on the banks of river Godavari, Khammam District, AP. In this temple, Sri Sita Rama Kalyanam is being celebrated every year on the day of Navami of the bright fortnight of the month Chaitra(March/April). The festival day is called as Sri RamaNavami which falls on
April 8, 2014(Tuesday) in the year 2014.
Live Telecast TV Channels are
1) SVBC TV Watch SVBC TV ONLINE
2) Bhakti TV Watch Bhakti TV Online
Sri Sita Ramachandra Swamy Temple Address, Bhadrachalam
April 8, 2014(Tuesday) in the year 2014.
Sree Seetha Ramachandra Swamy Vari Devasthanam, Bhadrachalam has set all the arrangements for the great wedding event of Sri Sita Ramachandra swamy which begins from 10:00am onwards on April 8, 2014(Tuesday).
Almost all the TV channels of AndhraPradesh will provide Live telecast of this mega wedding event from 10:00am on the auspicious day of Sri RamaNavami.
LIVE WEB Telecast is also available from Sri Seetha Ramachandra Vari Devasthanam official website. The webcast link is as follows...
Live Telecast TV Channels are
1) SVBC TV Watch SVBC TV ONLINE
2) Bhakti TV Watch Bhakti TV Online
Sri Sita Ramachandra Swamy Temple Address, Bhadrachalam
Sree Seetha Ramachandra Swamy Vari Devasthanam
Bhadrachalam-507111,
Khammam District,
Andhrapradesh, India.
Contact Telephone Numbers:
General Temple Information | 08743-232465 or 91+ 9848489060 |
Accommodation | 08743-232467 or 91+ 9848489060 |
Annadanam Information | 91+ 8801650620 |
Assistant to Executive Officer | 9866770473/8985891929 |
Subscribe to:
Posts (Atom)